అతను షో రూమ్ లో కారు కొన్నాడు..! కానీ అతనికి “కారు కంపెనీ” 80 వేల ఫైన్ చెల్లించింది.! ఎందుకు?

మీరు కొన్న కారుకు రిపేర్ వ‌చ్చింది. అప్పుడేం చేస్తారు..? ఎవ‌రైనా ఏం చేస్తారు, స‌ర్వీస్ సెంట‌ర్‌కు వెళ్లి రిపేర్ చేయించుకుంటారు. స‌రే.. ఒకటి, రెండు సార్లు అయితే రిపేర్ వ‌చ్చినా వెళ్తారు. కానీ ప‌దే ప‌దే కార్ రిపేర్‌కు వ‌స్తుంటే..? అస‌లు కార్‌లో మొత్తం పార్ట్‌లు అన్నీ స‌రిగ్గా ప‌నిచేయ‌క‌పోతే..? అడుగడుగునా కారు స‌తాయిస్తుంటే..? అప్పుడేం చేస్తారు. ఏం చేస్తారు, కార్ రీప్లేస్ చేయ‌మ‌ని కోరుతారు, లేదంటే డ‌బ్బులు రీఫండ్ ఇవ్వ‌మ‌ని అడుగుతారు. అవును, అదే. స‌రిగ్గా ఇలాగే చేశాడు అత‌ను. కానీ ఆ కార్ కంపెనీ ఆ రెండింటిలో ఏదీ చేయ‌లేదు. దీంతో కోర్టుకెక్కిన బాధితుడు ఎట్ట‌కేల‌కు 12 ఏళ్ల త‌రువాత కేసులో విజ‌యం సాధించాడు.

అత‌ని పేరు మ‌న‌న్ జైన్‌. ఢిల్లీ వాసి. 2004లో స్థానికంగా ఉన్న ఓ షోరూంలో టాటా కంపెనీకి చెందిన ఇండిగో మారినా ఎల్ఎస్ అనే మోడ‌ల్ కారును కొన్నాడు. అప్పుడు దాని ధ‌ర రూ.4,79,972. అయితే మనన్ కు ఆ కారు కొన్నాక నిద్ర క‌రువైంది. ఎందుకంటే కారులో ఉన్న ఒక‌టి రెండు కాదు, దాదాపుగా అన్ని పార్ట్‌లు స‌రిగ్గా ప‌నిచేయడం లేద‌ని తెలుసుకున్నాడు. స‌రిగ్గా మైలేజ్ రాక‌పోవ‌డం, పిక‌ప్ లేక‌పోవ‌డం, కారు యాక్స‌ల‌రేట‌ర్‌, క్ల‌చ్‌, ఏసీ, ఇంజిన్ నుంచి న‌ల్ల‌ని పొగ రావ‌డం, బ్యాట‌రీ… ఇలా ఒక‌టేమిటి, ఆ కారులో అన్నీ స‌మ‌స్య‌లే ఉన్నాయ‌ని, బ‌హుశా అది మానుఫాక్చరింగ్ లోపం అయి ఉంటుంద‌ని గుర్తించాడు.

అయితే అప్ప‌టికే ఏడాది గ‌డిచింది. ఆ స‌మ‌యంలో కారును ఏకంగా 12 సార్లు అంటే నెల‌కు ఒక‌సారి స‌ర్వీస్ సెంట‌ర్‌కు తీసుకెళ్లాడు. అయినా స‌మ‌స్య‌లు అలాగే ఉన్నాయి. దీంతో వారంటీ గ‌డువులోనే ఉంది క‌నుక కారును రీప్లేస్ చేసి కొత్త కారు ఇవ్వ‌మని లేదా డ‌బ్బులు రీఫండ్ ఇవ్వ‌మ‌ని ఆ కార్ కంపెనీకి లేఖ రాశాడు. దీనికి వారి నుంచి స్పంద‌న లేదు. ఈ క్ర‌మంలో మ‌న‌న్ ఢిల్లీ క‌న్‌జ్యూమ‌ర్ కోర్టును ఆశ్ర‌యించాడు. దీంతో కోర్టు ఎట్టకేల‌కు 12 ఏళ్ల త‌రువాత అనేక విచార‌ణ‌లు, వాయిదాల అనంత‌రం మ‌న‌న్‌కు అనుకూలంగా తీర్పునిచ్చింది. మ‌న‌న్ అనుభ‌వించిన మాన‌సిక వేద‌న‌కు గాను రూ.80వేల‌ను అత‌నికి న‌ష్ట‌ప‌రిహారంగా అంద‌జేయాల‌ని ఆ కార్ కంపెనీకి ఆదేశాలు ఇచ్చింది. ఇక కార్ రీప్లేస్ చేయ‌డం కుద‌ర‌ద‌ని తెలియ‌డంతో 30 రోజుల గ‌డువులోగా ఎలాంటి స‌మ‌స్య‌లు లేకుండా స‌ర్వీస్ సెంట‌ర్ వారు కారును రిపేర్ చేసి మ‌న‌న్‌కు అప్ప‌గించాల‌ని కోర్టు తీర్పు చెప్పింది. అవును మ‌రి, అలా జ‌ర‌గాల్సిందే. అయితే మ‌రి ఆ కార్ కంపెనీ వారు స‌మ‌స్య‌లు లేకుండా రిపేర్ చేస్తారా, లేదా అన్నది చూడాలి. ఏది ఏమైనా ఓ బ‌డా కార్పొరేట్ కంపెనీపై ఓ సామాన్యుడు సాధించిన విజ‌య‌మే ఇది. క‌దా..!

Comments

comments

Share this post

scroll to top