4 రోజుల్లో 2.5 కోట్ల మంది చూసిన 'కెప్టెన్ అమెరికా సివిల్ వార్' ట్రైలర్.

సూపర్ హిట్ సినిమాకు సీక్వెల్ వస్తుందంటే ఆ సినిమాలకు ఉండే క్రేజే వేరు. ప్రపంచవ్యాప్తంగా తమ సినిమాలతో అలరిస్తున్న హాలీవుడ్ సినిమాల సంగతైతే ఇక వేరే చెప్పనక్కర్లేదు. తాజాగా అలాంటి ఓ ట్రైలర్ యూట్యూబ్ లో తెగ హల్ చల్ చేస్తోంది. 2011 లో వచ్చిన సూపర్ హిట్ సినిమా కెప్టెన్ అమెరికా ది ఫస్ట్ అవెంజర్ కు సీక్వెల్ గా తెరకెక్కుతున్న ‘కెప్టెన్ అమెరికా సివిల్ వార్’ ట్రైలర్ ను రిలీజ్ చేయగా నెట్ లో వీరవిహారం చేస్తోంది. మూడు రోజుల క్రితం రిలీజ్ అయిన ఈ చిత్ర ట్రైలర్ ను ఇప్పటిదాకా 2.5 మిలియన్ మంది వీక్షించారంటే ఆ సినిమాపై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఎవేంజర్స్ సూపర్ హీరోల బృందం నుంచి ఐరన్‌మ్యాన్ విడిపోయిన తర్వాత ఏం జరిగింది?  కెప్టెన్ అమెరికా- ఐరన్‌మ్యాన్ మధ్య వచ్చిన విభేదాలేంటి? అనే స్టోరీతో ఈ తాజా  తెరకెక్కుతోంది.ఆంథోని రూసొ, జ్యో రూసొలు డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో క్రిస్ ఎవాన్స్, రాబర్ట్ డోనీ, స్కార్లెట్ జాన్సన్… ముఖ్య పాత్ర పోషించారు. 2016 మే 6 ఈ సినిమా వరల్డ్ వైడ్ గ రిలీజ్ కానుంది.

Watch Video:

Comments

comments

Share this post

scroll to top