ఉన్నత చదువులు చదవాలని యూనివర్సిటీకి వచ్చిన ఆ చదువుల తల్లిని ర్యాగింగ్ పేరుతో చిత్రహింసలకు గురిచేసిన సీనియర్లు ఆగడాల ముందు .. ర్యాంగిగ్ పేరుతో జరుగుతన్న వికృత క్రీడల ముందు .. ర్యాగింగ్ నేరం అనే బోర్డు మౌనంగా రొధిస్తుంది. ఇది ఒక్క నాగార్జున వర్సిటీకే సంబంధించి కాదు.. ప్రతి చదువుల ప్రాంగణంలో వెలుగులోకి రాకుండా చిత్రహింసలు చేసే సీనియర్లు ఉండనే ఉన్నారు.. స్నేహాన్ని పెంచాల్సిన ర్యాగింగ్ ప్రాణాలను బలితీసుకునే రేంజ్ కు తీసుకెళుతున్నారు .
నాన్నంటే ప్రాణం, చదువంటే దైవం అని తలచి యూనివర్సిటీకి వచ్చిన రిషితేశ్వరిని అనంతలోకాలకు పంపించింది కూడా ఈ ర్యాగింగ్ భూతమే . రిషితేశ్వరి ఆత్మకు శాంతి కలగాలంటే… ర్యాగింగ్ రక్కసిని కూకటివేళ్ళతో పెకిలించాల్సిందే.. వారి తల్లిదండ్రుల కోరిక కూడా అదే , లక్షలు వద్దు, ఉద్యోగం వద్దు… మా కూతురు రిషితేశ్వరికి జరిగిన ఘటన మరే అమ్మాయికి జరగొద్దు. ఇది వారి కోరిక.
రండి.. చేతులు కలుపుదాం..అవగాహన పెంచుదాం.. ర్యాగింగ్ భూతాన్ని చదువుల ప్రాంగణాల నుండి తరిమికొడదాం… నేడు ఓ స్వచ్చంధ సంస్థ హైద్రాబాద్ నెక్లెస్ రోడ్డు లోని పీపుల్స్ ప్లాజా వద్ద సాయంత్రం ఏడు గంటలకు… రిషితేశ్వరి ఆత్మకు శాంతి కలిగించాలని, ర్యాగింగ్ ను తరిమికొట్టాలని…. నినదిస్తూ కొవ్వత్తుల ప్రదర్శన కార్యక్రమాన్ని చేపట్టింది. మనమూ పాల్గొందాం… ర్యాగింగ్ కు మేం వ్యతిరేకం అంటూ నినదిద్దాం.
రిషితేశ్వరి..ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ… ర్యాగింగ్ ను కిల్ చేయాలని పిలుపునిస్తూ………….