క్యాన్స‌ర్ వ‌ల్ల‌ బోన్ మారో స‌ర్జ‌రీ కోసం ఎదురు చూస్తున్న చిన్నారికి స‌హాయం చేయండి..!

”నాది అరేంజ్డ్ మ్యారేజ్‌. పెద్ద‌లు కుదిర్చిన వివాహం. అయిన‌ప్ప‌టికీ నేను, నా భ‌ర్త పెళ్ల‌యిన మొద‌టి రోజు నుంచీ అన్యోన్యంగానే ఉన్నాం. మా మ‌ధ్య త్వ‌ర‌లోనే ప్రేమ చిగురించింది కూడా. అత‌ను వాచ్‌మ‌న్‌గా ప‌నిచేసేవాడు. మాకు పెద్ద అవ‌స‌రాలు ఏవీ ఉండేవి కావు. మా అనుబంధానికి గుర్తుగా ఓ కూతురు కూడా జ‌న్మించింది. నేను, భ‌ర్త ఒక్క‌టే నిర్ణ‌యించుకున్నాం.. క‌ష్ట‌ప‌డాలి. ప‌నిచేయాలి. డ‌బ్బు సంపాదించాలి. మా కూతురికి మంచి విద్య‌ను అందించాలి అని అనుకున్నాం. అదే మాకు మొద‌టి ప్రాధాన్య‌త అయింది. కానీ ఆ త‌రువాతే మా జీవితాల్లో అనుకోని మార్పు వ‌చ్చింది.

మా కూతురు అర్పిత క‌ళ్లు వాపుల‌కు గుర‌వ‌డం మొద‌లైంది. ఏదైనా పురుగు కుట్టి ఉండ‌వ‌చ్చ‌ని మేమ‌నుకున్నాం. అందుక‌నే క‌ళ్లు అలా వాపుల‌కు గుర‌వుతున్నాయ‌ని భావించాం. కానీ అది చివ‌ర‌కు క్యాన్స‌ర్ అని తెలిసింది. 2016లో అర్పితకు క్యాన్స‌ర్ అని తెలిసింది. త‌రువాత ఏడాది పాటు ఆమెకు 4 సార్లు కీమో థెర‌పీ చేయించాం. అయితే ప్ర‌తి సారీ మా కూతురు మమ్మ‌ల్ని అడిగేది.. త‌న‌కు ఎందుకు వెంట్రుక‌లు రాలిపోతున్నాయి.. అని ఆమె ప్ర‌శ్నించేది. తాను ఎందుకు ఇంటికి, స్కూల్‌కు వెళ్ల‌లేక‌పోతున్నాను.. అని మమ్మ‌ల్ని అడిగేది. కానీ ఆ ప్ర‌శ్న‌ల‌కు మేం స‌మాధానం చెప్ప‌లేదు. ఆమె దృష్టిని మ‌ర‌ల్చాం.

కీమోథెర‌పీ త‌రువాత 3 నెల‌లు ఆమెకు క్యాన్స‌ర్ త‌గ్గిన‌ట్టే అనిపించింది. దీంతో ఇంటికి వెళ్లి దీపావ‌ళి జ‌రుపుకోవ‌చ్చ‌ని భావించాం. కానీ అప్పుడే మా జీవితంలో పీడ‌క‌ల లాంటి ఘ‌ట‌న జ‌రిగింది. మా కూతురికి మ‌ళ్లీ క‌ళ్లు ఉబ్బ‌డం మొద‌లు పెట్టాయి. దీంతో మ‌ళ్లీ ఆమెను హాస్పిట‌ల్‌కు త‌ర‌లించాల్సి వ‌చ్చింది. అప్పుడు మా ఆర్థిక ప‌రిస్థితి ఏమాత్రం బాగాలేదు. నా భ‌ర్త‌కు నెల‌కు వ‌చ్చేది రూ.8వేలు. అది మాకు ఏమాత్రం స‌రిపోయేది కాదు. ఇక అర్పిత చికిత్స‌కు ఏం ఖ‌ర్చు చేయాలి. అందుకే నేను కూడా ఇంకా ఎక్కువ ప‌నిచేయాల‌ని అనుకున్నా.

హాస్పిట‌ల్‌లో ఓ వైపు మా పాప ప‌రిస్థితి రోజు రోజుకీ మారిపోతోంది. ఏం చేయాలో అర్థం కావ‌డం లేదు. ఆమెను ఆ స్థితిలో చూసి జాలి వేసింది. ఒక రోజు రాత్రి నా భ‌ర్త బిగ్గ‌ర‌గా ఏడ్వ‌డం చూశా. పెళ్ల‌య్యాక ఆయ‌న అలా మొద‌టి సారి ఏడ్చారు. త‌రువాత రోజు నేను నా ద‌గ్గ‌ర ఉన్న బంగారు న‌గ‌ల‌ను తీసి ఇచ్చా. వాటితో వ‌చ్చిన డ‌బ్బుతో అర్పిత‌కు టెస్ట్‌లు చేయించి ట్రీట్‌మెంట్ ప్రారంభించాం. ఇప్పుడు నా భ‌ర్త నెల‌కు రూ.4వేలు మాత్ర‌మే సంపాదిస్తున్నాడు. మ‌రో వైపు మాకు తిన‌డానికి ఆహారానికే త‌గినంత డ‌బ్బు లేదు. ఇంకో వైపు పాప ప‌రిస్థితి చూస్తే అంతంత మాత్రంగానే ఉంది. ఏ రోజు ఏమ‌వుతుందో తెలియ‌దు. ఆమెకు బోన్ మారో ట్రాన్స్‌ప్లాంట్ చేయాల‌ట‌. రూ.25 ల‌క్ష‌ల వ‌ర‌కు అవుతుంద‌ని డాక్ట‌ర్లు చెప్పారు. మేం అంత డ‌బ్బు ఎలా తేగ‌లం ? మాకు ప్ర‌స్తుతం ఎలాంటి దారి లేదు. మా కూతుర్ని కోల్పోవ‌డం త‌ప్ప‌. ఆమెను గొప్ప‌గా చదివిద్దామ‌నుకుంటే ఇలా అయింది. ఏం చేస్తాం.. అన్నీ మ‌నం అనుకున్న‌ట్టు జ‌ర‌గ‌వు క‌దా.”

ముంబైకి చెందిన అర్పిత అనే బాలిక ప్ర‌స్తుతం క్రిటిక‌ల్ కండిష‌న్‌లో ఉంది. ఆమెకు వెంట‌నే స‌ర్జ‌రీ చేయాలి. లేక‌పోతే ఆమె బ‌త‌క‌దు. మ‌రోవైపు ఆమె త‌ల్లిదండ్రుల వ‌ద్ద డ‌బ్బు లేదు. ఈ త‌రుణంలో వారు త‌మ‌కు స‌హాయం అందించే ఆప‌న్న హస్తం కోసం ఎదురు చూస్తున్నారు. త‌మ పాప ప్రాణాల‌ను నిల‌బెట్టే గొప్ప మ‌న‌స్సున్న దాత‌ల కోసం చూస్తున్నారు. వారికి స‌హాయం చేయ‌ద‌లిస్తే https://www.ketto.org/fundraiser/SaveArpita అనే సైట్‌ను సంద‌ర్శించి విరాళం ఇవ్వ‌వ‌చ్చు.

Comments

comments

Share this post

scroll to top