నెట్‌లో వైర‌ల్ అవుతున్న ఈ 7 ప‌జిల్స్ ను మీరు సాల్వ్ చేయ‌గ‌ల‌రా ?

సుడోకు, ప‌ద‌వినోదం, నంబ‌ర్లు క‌నిపెట్ట‌డం, చుక్క‌లు క‌ల‌ప‌డం.. వంటి ఎన్నో మెద‌డుకు మేత పజిల్స్‌ను మ‌నం రోజూ ప‌త్రిక‌ల్లో చూస్తూనే ఉంటాం. ఇక నెట్‌లో అయితే ఇలాంటి పజిల్స్ కొన్ని ల‌క్ష‌ల సంఖ్య‌లో ఉంటాయి. ఈ క్ర‌మంలో ఈ త‌ర‌హా ప‌జిల్స్‌ను నింపడంలో చాలా మంది ఆసక్తిని క‌న‌బ‌రుస్తుంటారు. అలాంటి వారి కోస‌మే కింద కొన్ని మెద‌డుకు మేత ప‌జిల్స్ ఇవ్వ‌డం జ‌రిగింది. నిజానికి వీటిని ప‌జిల్స్ అనేకంటే ప్ర‌శ్న‌లు అంటేనే బాగుంటుంది. మ‌రి వీటిని మీరు సాల్వ్ చేయ‌గ‌లరా..? ఈ ప్ర‌శ్న‌ల‌కు సాల్వ్ చేయ‌గ‌ల‌మ‌ని మీరు అనుకుంటే.. ఇంకెందుకాల‌స్యం.. వీటిపై ఓ లుక్కేయండి మ‌రి..!

1. ఒక టూరిస్టు ఒక హోట‌ల్‌లో సింగిల్ రూమ్‌లో దిగాడు. సాయంత్రం కాగానే అత‌ను నిద్రకు ఉప‌క్ర‌మించాడు. కానీ నిద్ర ప‌ట్ట‌లేదు. అత‌ను బ‌య‌ట‌కు వ‌చ్చి వేరే వ్య‌క్తితో మాట్లాడాడు. మ‌ళ్లీ రూంలోకి వెళ్లి య‌థావిధిగా ప‌డుకున్నాడు. దీంతో అత‌నికి వెంట‌నే నిద్ర ప‌ట్టింది. మ‌రి అత‌ను ఎవ‌రితో ఏం మాట్లాడాడు, ఎందుకు మాట్లాడాడో కనిపెట్టండి చూద్దాం.

2. O, T, T, F, F, S.. వ‌రుస‌లో త‌రువాత వ‌చ్చే అక్ష‌రాలు ఏమిటో చెప్ప‌గ‌లరా ?

3. ఈ లాక్‌ను మీరు ఓపెన్ చేయ‌గ‌ల‌రా ?
ఈ మూడు నంబ‌ర్ల‌లో లాక్ తీసేందుకు అవ‌స‌ర‌మ‌య్యే ఒక నంబ‌ర్ ఉంది. అది క‌రెక్ట్ ప్లేస్‌లో ఉంది.
ఈ మూడు నంబ‌ర్ల‌లో లాక్ తీసేందుకు అవ‌స‌ర‌మ‌య్యే ఒక నంబ‌ర్ ఉంది. కానీ అది రాంగ్ ప్లేస్‌లో ఉంది.
ఈ మూడు నంబ‌ర్ల‌లో లాక్ తీసేందుకు అవ‌స‌ర‌మ‌య్యే రెండు నంబ‌ర్లు ఉన్నాయి. కానీ అవి రెండు రాంగ్ ప్లేస్‌లో ఉన్నాయి.
ఈ మూడు నంబ‌ర్ల‌లో లాక్ తీసేందుకు అవ‌స‌రం అయ్యే ఒక నంబ‌ర్ కూడా లేదు.
ఈ మూడు నంబ‌ర్ల‌లో లాక్ తీసేందుకు అవ‌స‌రం అయ్యే ఒక నంబ‌ర్ ఉంది. కానీ అది రాంగ్ ప్లేస్‌లో ఉంది.

4. అమెరికాలో ఒక నేరం చేస్తే దానికి శిక్ష ఉంటుంది. దాన్ని చేయ‌డానికి ప్ర‌య‌త్నిస్తే శిక్ష ప‌డుతుంది. కానీ దీన్ని విజ‌య‌వంతంగా చేస్తే శిక్ష ప‌డ‌దు. ఎందుక‌ని ?

5. నేను మా బంధువుల్లో కొంద‌రి క‌న్నా 600 సార్లు పెద్ద‌. ఇది ఎలా సాధ్య‌మ‌వుతుంది ?

6. ఒక ప‌ట్ట‌ణంలో అంద‌రూ అబ‌ద్దాలే చెబుతారు. మ‌రొక ప‌ట్ట‌ణంలో అంద‌రూ నిజాలే చెబుతారు. అవి రెండు ప‌ట్ట‌ణాలు ప‌క్క ప‌క్క‌నే ఉంటాయి. క‌నుక ఒక ప‌ట్ట‌ణంలో ఉన్న‌వారు మ‌రొక ప‌ట్ట‌ణంలో ఉన్న‌వారిని క‌లుసుకునేందుకు వ‌స్తుంటారు, పోతుంటారు. అయితే ఆ రెండు ప‌ట్ట‌ణాల్లో మీరు ఒక ప‌ట్ట‌ణంలో ఉన్నార‌నుకుందాం. కానీ మీరు ఏ ప‌ట్ట‌ణంలో ఉన్న‌ది మీకు తెలియ‌దు. అలాంట‌ప్పుడు మీరు ఏ ప‌ట్ట‌ణంలో ఉన్నార‌నేది తెలుసుకునేందుకు దారిన పోయే వారికి ఏం ప్ర‌శ్న వేసి అడుగుతారు.

7. మీవి బాగా షార్ప్ అయినా క‌ళ్లా ? అయితే కింద ఇచ్చిన చిత్రాన్ని కేవ‌లం 10 సెకండ్ల పాటు మాత్ర‌మే చూడండి. అనంత‌రం అందులో ఉన్న రెండు ఇమేజ్‌ల‌ను గుర్తించి ఏవో చెప్పండి.

జ‌వాబు(1): టూరిస్టు రూమ్‌లో నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి ప‌క్క గ‌దిలో నిద్రిస్తున్న అత‌న్ని కాలింగ్ బెల్ తో లేపాడు. దీంతో ఆ గ‌దిలో నిద్రిస్తున్న వ్య‌క్తి లేచి ప‌క్క‌కు తిరిగి గుర‌క పెట్ట‌కుండా ప‌డుకున్నాడు. దీంతో టూరిస్ట్‌కు నిద్ర‌ప‌ట్టింది.

జ‌వాబు (2): S, E, N, T.. అక్ష‌రాలు ఆ వ‌రుస‌లో త‌రువాత వ‌స్తాయి. ఎలా అంటే.. O అంటే One.. T అంటే Two.. T అంటే Three.. F అంటే Four.. F అంటే Five.. S అంటే Six.. అని వ‌స్తుంది. మ‌రి త‌రువాత ఏం వ‌స్తాయి..? S, E, N, T.. అక్ష‌రాలే క‌దా.. అంటే.. S అంటే.. Seven.. E అంటే.. Eight.. N అంటే Nine.. T అంటే Ten.. అని వ‌స్తాయి. క‌నుక ప్ర‌శ్న‌లో అడిగిన O, T, T, F, F, S అక్ష‌రాల త‌రువాత S, E, N, T అక్ష‌రాలు వ‌స్తాయి.

జ‌వాబు (3): మొద‌టి వ‌రుస‌లో క‌రెక్ట్ ప్లేస్‌లో ఉన్న నంబ‌ర్ 2, రెండో వ‌రుస‌లో రాంగ్ ప్లేస్‌లో ఉన్న ఒక్క నంబ‌ర్ 4, మూడో వ‌రుస‌లో రాంగ్ ప్లేస్‌లో ఉన్న రెండు నంబ‌ర్లు 2, 0, నాలుగో వ‌రుస‌లో లాక్ తీసేందుకు ఎలాంటి నంబ‌ర్లు లేవు, చివ‌రి వ‌రుస‌లో రాంగ్ ప్లేస్‌లో ఉన్న ఒక్క నంబ‌ర్ 0, వీటితో (0, 4, 2) లాక్ తెర‌వ‌చ్చు.

జ‌వాబు (4): ఆ నేరం ఆత్మ‌హ‌త్యే. ఆత్మ‌హ‌త్య చేసుకోబోయి దొరికితే శిక్ష ప‌డుతుంది. అలా కాకుండా ఆత్మ‌హ‌త్య చేసుకుంటే చ‌నిపోతారు క‌దా, మ‌రి వారికి శిక్ష ప‌డ‌దు క‌దా.

జ‌వాబు (5): 50 సంవ‌త్స‌రాలు ఉన్న ఒక వ్య‌క్తి ఉన్నాడ‌నుకోండి. అత‌నికి పుట్టే మ‌న‌వ‌డి వ‌య‌స్సు 1 నెల అనుకుంటే.. అత‌ను 50 * 12 = 600 నెల‌ల వ‌య‌స్సు ఉన్న‌ట్లు లెక్క‌. క‌నుక ఇది సాధ్య‌మే.

జ‌వాబు (6): మీరిక్క‌డికి అతిథిలా వ‌చ్చారా ? అని అడగాలి. అందుకు ఎదుటి వ్య‌క్తి అవును అని చెబితే మీరు అబ‌ద్దాలు చెప్పే వారి ప‌ట్ట‌ణంలో ఉన్న‌ట్టు లెక్క‌. అలా కాకుండా ఎదుటి వ్య‌క్తి కాదు అని చెబితే అప్పుడు మీరు నిజాలు చెప్పే వారి ప‌ట్ట‌ణంలో ఉన్న‌ట్టు లెక్క‌.

జ‌వాబు (7): ఇమేజ్‌ను బాగా చూడండి. ఆడ‌వారి కాళ్లు, సూట్ వేసుకున్న ఓ వ్య‌క్తి కోట్‌, టై క‌నిపిస్తాయి.

 

Comments

comments

Share this post

scroll to top