ఇంట్లో అక్వేరియం ఉండ‌కూడ‌దా..? ఉంటే ఏమ‌వుతుందో తెలుసా..?

రంగు రాళ్లు, స‌ముద్ర‌పు మొక్క‌లను పోలిన చిన్న‌పాటి డెక‌రేటివ్ ఐట‌మ్స్‌, నీరు… వాటిలో రంగు రంగుల చేప‌లు… అదేనండీ అక్వేరియం. చాలా మంది అక్వేరియంల‌ను పెట్టుకుంటారు. వాటిల్లో రంగు రాళ్ల‌ను, చేప‌ల‌ను వేసి పెంచుకుంటారు. ఇంకా కొంద‌రైతే వాటిని అందంగా తీర్చిదిద్దుతారు. అయితే మీకు తెలుసా..? నిజానికి ఇల్లు లేదా ఆఫీస్ ఎక్క‌డైనా అక్వేరియంలు ఉండ‌రాద‌ట‌. అలా ఉంటే చెడు జ‌రుగుతుంద‌ని వాస్తు చెబుతుంది. అయితే అదే కాదు, ఇంకా ఇలాంటివే ప‌లు వాస్తుకు సంబంధించిన విష‌యాలు ఉన్నాయి. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

1. వాస్తు ప్రకారం ఇంట్లో అక్వేరియంను ఉంచ‌కూడ‌ద‌ట‌. తొట్టెలో లేదా గ్లాసు పెట్టెల్లో నీళ్లుపోసి అందులో చేపలను పెంచితే త‌ద్వారా ఆ ఇంటి యజమానికి అన్నీ క‌ష్టాలే క‌లుగుతాయ‌ట‌. అత‌నికి మానసిక ఉల్లాసం ఉండ‌ద‌ట‌. అప్పుల బాధలు పెరిగిపోతాయ‌ట‌. అందుక‌ని అక్వేరియంను పెట్ట‌కూడ‌ద‌ని వాస్తు చెబుతోంది.

2. ఇంట్లో పనిచేయని గడియారాలు ఉండ‌రాదు. అలాగే ఇంటి హాలులో మహాభారత యుద్ధ సన్నివేశాలకు సంబంధించిన ఫోటోలు, వాల్ పోస్ట‌ర్లు అస్స‌లు పెట్టుకోకూడదు. అలా ఉంటే ఆ ఇంట్లో ఉన్న వారికి అన్నీ క‌ష్టాలే ఎదుర‌వుతాయ‌ట‌.

3. చాలా మంది ఇండ్ల‌లో మ‌నీ ప్లాంట్‌ల‌ను పెట్టుకుంటారు. దాంతో అదృష్టం, ధ‌నం క‌ల‌సి వ‌స్తుంద‌ని న‌మ్ముతారు. నిజానికి మ‌నీ ప్లాంట్ల‌ను కూడా ఇండ్ల‌లో పెట్టుకోరాద‌ట‌. వాటి వ‌ల్ల అంతా నెగెటివ్ ఎన‌ర్జీ ప్ర‌సార‌మ‌వుతుందట‌. దీంతో ఇండ్ల‌లోకి దుష్ట శ‌క్తులు వ‌చ్చి చేరి అంద‌రికీ ఇబ్బందులు క‌లిగిస్తాయ‌ట‌.

4. ఇండ్ల‌లో కప్ప‌లు ఉండ‌రాదు. అలా ఉంటే ఆ ఇంట్లో నివ‌సించే వారికి క‌ష్టాలు తప్ప‌వ‌ట‌.

5. త‌ల‌కు పైన వేలాయుధంతో కూడిన కుమార స్వామి బొమ్మ అస్స‌లు ఉండ‌రాద‌ట‌. అలాగే ఇండ్ల‌లో అడుగు పొడ‌వుకు మించిన దేవ‌త‌ల విగ్ర‌హాలు అస్స‌లు ఉండ‌రాద‌ట‌. అలా ఉండ‌డం వాస్తు ప్ర‌కారం మంచిది కాద‌ట‌.

6. వ్యాపారాలు చేసే ప్రాంతాలు ఏవైనా వాస్తు ప్ర‌కారం అవి చ‌తుర‌స్రాకారం లేదా దీర్ఘ చ‌తుర‌స్రాకారంలోనే ఉండాల‌ట‌. అదేవిధంగా వ్యాపార ప్రాంతానికి తూర్పు, ద‌క్షిణ దిశ‌లు ఎక్కువ విశాలంగా ఉండేలా చూసుకోవాల‌ట‌. దీంతో వ్యాపార వృద్ధి జ‌రుగుతుంద‌ట‌.

7. వ్యాపారం చేసే ప్రాంతంలో పూజ చేస్తున్నవారైతే తూర్పు వైపు తిరిగి చేయాలి. దీంతో అంతా శుభ‌మే జ‌రుగుతుంది. వ్యాపారం నిరాటంకంగా సాగి లాభాలు వ‌స్తాయ‌ట‌.

8. ఇంటికి ఎదురుగా ఆస్పత్రులు, మాంసాహార దుకాణాలు, ఇనుము వస్తువుల తయారీ షాపులు ఉండకూడదని వాస్తు చెబుతోంది. అలా ఉంటే ఆయా ఇండ్ల‌లో నివ‌సించే వారికి అన్నీ క‌ష్టాలే ఎదుర‌వుతాయ‌ట‌.

Comments

comments

Share this post

scroll to top