ఈ ఫొటోలో ఉన్న క్రికెట‌ర్లు ఎవ‌రో గుర్తు ప‌ట్టారా..?

వ‌యస్సు  పెరుగుతున్న కొద్దీ ఎవ‌రి శ‌రీరంలోనైనా చాలానే మార్పులు వ‌స్తాయి. ఆకారం, ముఖ క‌వ‌ళిక‌ల్లో ఈ తేడాలు మ‌న‌కు క‌నిపిస్తాయి. అయితే ఓ వ‌య‌స్సుకు వ‌చ్చ‌క ఆ తేడాలు పెద్ద‌గా రావు. కానీ చిన్న‌ప్ప‌టికీ, యుక్త వ‌య‌స్సులో, పెద్ద‌గా అయిన‌ప్పుడు మాత్రం ఆ తేడాలు మ‌న‌కు బాగానే కనిపిస్తాయి. ఈ క్ర‌మంలో చిన్న‌ప్పుడు తీసిన ఫోటోలు, పెద్ద‌గా ఉన్న‌ప్పుడు ఫొటోలు చూస్తే ఎవ‌రినైనా కనుక్కోవ‌డం, గుర్తు ప‌ట్ట‌డం కొంత వ‌ర‌కు క‌ష్టమే. అయితే అంద‌రికీ అలా క‌ష్ట‌మ‌వుతుంద‌నుకున్నాడో ఏమో, మ‌న క్రికెట‌ర్ విరాట్ కోహ్లి, త‌న ఒక‌ప్ప‌టి ఫొటోను ఈ మ‌ధ్య సోష‌ల్ మీడియాలో షేర్ చేశాడు. అందులో తాను ఎక్క‌డ ఉన్న‌దీ క‌నుక్కోవాల‌ని త‌న అభిమానులకు స‌వాల్ విసిరాడు. అయితే వారికే కాదు, మ‌న‌కూ అత‌ని ఫేస్ గుర్తు పట్ట‌డం పెద్ద క‌ష్టం కాలేదు.

identify-cricketers-1
చూశారుగా… పై ఫొటోలోనే విరాట్ కోహ్లి ఉన్నాడు. ఆ ఫొటో అత‌ను అండ‌ర్ 19 టీంలో ఉన్న‌ప్ప‌టిది. అందులో విరాట్ కోహ్లి ఎక్క‌డ ఉన్నాడ‌నేది ఈ పాటికే మీకు తెలిసిపోయి ఉంటుంద‌నుకుంటా. అవును, అత‌ను కంప్లీట్‌గా ఎడ‌మ వైపుకు ఉన్నాడు. అయితే మ‌రి ఆ ఫొటోలో కొంద‌రు ఇప్ప‌టి క్రికెటర్లు కూడా ఉన్నారు. అవును, క‌చ్చితంగా ఉన్నారు. అయితే వారిని మీరు గుర్తు ప‌ట్ట‌గ‌ల‌రా..?  లేదా..! అయితే ఓ సారి ట్రై చేయండి..!

identify-cricketers-2
ఏంటీ వారిని గుర్తు పట్ట‌డం మీ వ‌ల్ల కావ‌డం లేదా..? అయితే కింద చూడండి..! చిత్రంలో కోహ్లి వెనుక‌నే క్యాప్ పెట్టుకుని ఉన్న‌ది ర‌వీంద్ర జ‌డేజా. కోహ్లికి ముందు వ‌రుస‌లో ప‌క్క‌నే ఉంది మ‌నీష్ పాండే. ఇక జ‌డేజా ప‌క్క‌నే క్యాప్ పెట్టుకుని ఉంది సౌర‌భ్ తివారీ. మ‌నీషా పాండే వెనుక ఉన్న‌వారు గోస్వామి, అబ్దుల్లా.

identify-cricketers-3

Comments

comments

Share this post

scroll to top