ఆ ఇద్దరు స్నేహితులు ట్రైన్ మిస్ అయ్యారు..! కానీ ఇద్దరిలో ఎవరెక్కువ దురదృష్టవంతుడో చెప్పగలరా.?

ఇప్పుడు మేం చెప్పబోయేది సైకాలజీకి చెందినది. కాబట్టి కింద ఇచ్చిన ప్రశ్నలను చాలా జాగ్రత్తగా చదవండి. అనంతరం మేం అడిగే ఒక ప్రశ్నకు జవాబు చెప్పండి. ఇక ఆ మ్యాటర్‌ ఏంటో చూద్దామా..!

సందర్భం-1
మీరు ఉదయం 11 గంటలకు ట్రెయిన్‌ ఎక్కాల్సి ఉంది. కానీ ట్రాఫిక్‌ జాం కారణంగా అరగంట ఆలస్యంగా స్టేషన్‌కు వచ్చారు. 11.30 కి స్టేషన్‌కు చేరుకున్నారు. అయితే అప్పటికే రైలు వెళ్లిపోయింది. కరెక్ట్‌గా 11 గంటలకే ట్రెయిన్‌ బయల్దేరింది.

సందర్భం-2
మీ ఫ్రెండ్‌ ఉదయం 11 గంటలకు ట్రెయిన్‌ ఎక్కాల్సి ఉంది. కానీ ట్రాఫిక్ జాం కారణంగా అరగంట ఆలస్యంగా స్టేషన్‌కు చేరుకున్నాడు. దీంతో 11.30కి స్టేషన్‌కు వచ్చాడు. అయితే ట్రెయిన్‌ మాత్రం 25 నిమిషాలు ఆలస్యంగా.. అంటే.. 11.25 కి బయల్దేరింది.

ఇక ప్రశ్న చూద్దాం…
పైన చెప్పాం కదా, మీకు, మీ ఫ్రెండ్‌కు ట్రెయిన్‌ మిస్‌ అయిందని.. అయితే మీ ఇద్దరిలో మిక్కిలి దురదృష్టవంతుడు ఎవరు..?
ఆ ఏముందీ.. నా స్నేహితుడే అవుతాడు. ఎందుకంటే కేవలం 5 నిమిషాల వ్యవధిలోనే ట్రెయిన్‌ను మిస్‌ అయ్యాడు కదా. కాబట్టి అతనికే ఎక్కువ బాధ ఉంటుంది.. అంటున్నారు కదా.. అయితే మీరు చెప్పింది కరెక్టే. ఎందుకంటే నూటికి 95 శాతం మంది ఇదే చెబుతారు. 5 నిమిషాలు ముందు లేచి ఉంటే.. 5 నిమిషాలు ముందు బయల్దేరి ఉంటే… ఇలా కేవలం 5 నిమిషాలు ఆలస్యం అయ్యేది కాదు, టైముకు ట్రెయిన్‌ను అందుకునే వాడిని అని మీ స్నేహితుడు ఆలోచిస్తాడు. కానీ మీకు అంత బాధ ఉండదు. ఇక ఏదైనా పోటీలో సిల్వర్‌ మెడల్‌ సాధించిన వాడికి ఎక్కువ బాధ అనిపిస్తుంది. ఎందుకంటే గోల్డ్‌ మెడల్‌ సాధించిన వారికి, సిల్వర్‌ మెడల్‌ సాధించిన వారికి విజయంలో తేడా కేవలం కొంత మాత్రమే ఉంటుంది. అదే బంగారు మెడల్‌ సాధించిన వ్యక్తికి, కాంస్య మెడల్‌ సాధించిన వ్యక్తికి తేడా బాగా ఉంటుంది కనుక సిల్వర్‌ మెడల్‌ సాధించిన వారే ఎక్కువ ఫీలవుతారు. తమకు గోల్డ్‌ మెడల్‌ రాలేదే అని బాధ పడుతారు. కేవలం కొంత తేడాతో ఎందుకు ఓడిపోయాం అని ఫీలవుతారు. అయితే ఇలా ఆలోచించడం, ఫీల్‌ కావడం ఎవరి తప్పు కాదు లెండి. కానీ దీనికి సైకాలజీలో ఓ పేరు ఉంది. ఇలా ఆలోచించడాన్ని Counterfactual Thinking అంటారు..! భలే ఆశ్చర్యంగా ఉంది కదా..!

Comments

comments

Share this post

scroll to top