కోడిగుడ్ల‌ను ప‌చ్చిగా తాగవ‌చ్చా..? తాగితే ఏం జ‌రుగుతుంది..?

కోడి గుడ్ల‌తో మ‌నం ర‌క ర‌కాల వంట‌లు చేసుకుంటాం.  కోడిగుడ్డ ట‌మాటా… కోడిగుడ్డు ఫ్రై… కోడిగుడ్డు ఆమ్లెట్‌..! ఇలా కాక‌పోతే గుడ్డును ఉడ‌క‌బెట్టి కూడా తింటాం. అయితే ఇవేవీ కాకుండా కొంద‌రు గుడ్ల‌ను అలాగే కొట్టుకుని ప‌చ్చిగా తాగేస్తారు. ఇది కొంద‌రికి న‌చ్చ‌దు. అయినా న‌చ్చిన వారి అల‌వాటును మనం కాద‌న‌లేం క‌దా. మ‌రి… అలా గుడ్డును అలాగే ప‌చ్చిగా తింటే ఏం కాదా..?  దాంతో ఇబ్బందేమీ ఉండ‌దా..? ఏదైనా అనారోగ్య స‌మ‌స్య వ‌స్తే ఎలా..? అస‌లు గుడ్డును అలా ప‌చ్చిగా తాగ‌వ‌చ్చా..? అంటే… అందుకు ఎస్‌… తాగ‌వ‌చ్చు… అని స‌మాధానం వ‌స్తుంది..! అవును, మీరు విన్న‌ది క‌రెక్టే..! కానీ..! అందులో మ‌నం ప‌రిశీలించాల్సిన ఇంకో విష‌యం ఉంది..! అదేమిటంటే..!

raw-eggs-eating
కోడిగుడ్ల‌ను అలాగే కొట్టుకుని ప‌చ్చిగా తాగ‌వ‌చ్చు. దాంతో ఎలాంటి ఇబ్బంది ఉండ‌దు. అది తాగే వారి ఇష్టం. అయితే… ప‌చ్చి కోడిగుడ్ల‌లో సాల్మొనెల్లా అని ఓ ర‌క‌మైన బాక్టీరియా ఉంటుంద‌ట‌. ఇది ఏ గుడ్డులోనైనా చాలా అత్యల్ప ప‌రిమాణంలో ఉంటుంది. ఈ క్ర‌మంలో గుడ్డును బాయిల్ చేసి, లేదంటే దాంతో కూర వండుకుని తింటే ఓకే. ఆ బాక్టీరియా చ‌నిపోతుంది. దాని వ‌ల్ల మ‌న‌కు ఎలాంటి ఎఫెక్ట్ క‌ల‌గ‌దు. కానీ… గుడ్డును అలాగే ప‌చ్చిగా తాగేస్తే… దాంతో అందులో ఉండే సాల్మొనెల్లా బాక్టీరియా మ‌న శ‌రీరంలోకి ప్ర‌వేశిస్తుంది.

అయితే ఆ బాక్టీరియా స్వ‌ల్ప ప‌రిమాణంలో ఉంటుంది క‌నుక దాంతో మ‌న‌కు ఏమీ కాదు. కానీ రోగ నిరోధ‌క శ‌క్తి త‌క్కువ‌గా ఉన్న‌వారికి మాత్రం ఎఫెక్ట్ అవుతుంది. అలాంటి వారు ప‌చ్చి గుడ్ల‌ను తాగ‌కూడ‌దు. లేదంటే ఇన్‌ఫెక్ష‌న్లు, జ్వ‌రం వ‌స్తాయి. ఇక గుడ్ల‌ను అలాగే ప‌చ్చిగా తాగేవారైనా స‌రే… వాటిని మ‌రీ రెగ్యుల‌ర్‌గా అలా తాగ‌వ‌ద్ద‌ట‌. ఎందుకంటే వారిలో బ‌యోటిన్ అనే పోష‌క ప‌దార్థ లోపం సంభ‌విస్తుంద‌ట‌. దీంతో చ‌ర్మంపై దుర‌ద‌లు, వెంట్రుక‌లు రాలిపోవ‌డం, న‌రాల బ‌ల‌హీన‌త వంటి స‌మ‌స్య‌లు వ‌స్తాయి. ఇప్పుడు తెలిసిందా..! గుడ్ల‌ను ప‌చ్చిగా తాగ‌వ‌చ్చో, తాగ‌కూడ‌దో..!

Comments

comments

Share this post

scroll to top