రాత్రి పూట పెరుగు తినవచ్చా..? తింటే ఏమ‌వుతుంది..?

పెరుగు తినడం వల్ల మనకు ఎలాంటి లాభాలు కలుగుతాయో అందరికీ తెలిసిందే. దీంతో మ‌న‌కు క‌లిగే ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాలు అన్నీ ఇన్నీ కావు. పెరుగు నిత్యం తిన‌డం వల్ల జీర్ణవ్యవస్థ బాగా పనిచేస్తుంది. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది. పెరుగులో ఉండే మంచి బాక్టీరియా జీర్ణాశయానికి, పేగులకు ఎంతగానో మేలు చేస్తుంది. దీంట్లోని కాల్షియం వల్ల దంతాలు, ఎముకలు దృఢంగా మారుతాయి. శరీరాన్ని చల్లబరిచే గుణం కూడా పెరుగుకు ఉంది. అందుకే చాలా మంది ఎండ‌గా ఉన్న‌ప్పుడు పెరుగును తింటారు. దీంతో శ‌రీరం త్వ‌ర‌గా చ‌ల్ల‌బడి ఉప‌శ‌మ‌నం క‌లుగుతుంది. అయితే పెరుగు పట్ల చాలా మందిలో త‌లెత్తే ప్రశ్న ఒక‌టుంది. అదేమిటంటే… రాత్రి పూట పెరుగు తినవచ్చా..? లేదా..? తింటే ఏమ‌వుతుంది..? అని చాలా మంది సందేహిస్తుంటారు. ఈ క్ర‌మంలో అస‌లు రాత్రి పూట పెరుగును తినాలా, వ‌ద్దా అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

curd

శరీరాన్ని చల్లబరిచే గుణం పెరుగుకు ఉందని ఇప్ప‌టికే చెప్పాం కదా. ఆయుర్వేదం కూడా ఇదే చెబుతోంది. అయితే పెరుగును రాత్రి పూట తినడం వల్ల మ్యూకస్ ఎక్కువగా తయారవుతుంది. దీంతో కఫం వస్తుంది. తరచూ జలుబు, దగ్గు వంటి సమస్యలతో బాధపడే వారికి ఇది మంచిది కాదు. కనుక వారు రాత్రి పూట పెరుగును తినకూడదు. అందుకు బదులుగా మజ్జిగ తీసుకోవచ్చు. అందులో కొంత నిమ్మరసం లేదా, మిరియాల పొడి కలుపుకుని రాత్రి పూట తాగవచ్చు. అయితే అలా దగ్గు, జలుబు సమస్య లేని వారు రాత్రి పూట నిర్భయంగా పెరుగు తినవచ్చు.

ఇక దగ్గు, జలుబు సమస్య ఉన్నవారు పెరుగును మధ్యాహ్నం పూట తినవచ్చు. దాంతో ఎలాంటి ఇబ్బంది ఉండదు. అయితే వారు కొద్దిగా చక్కెర లేదా మిరియాల పొడి, నిమ్మరసం కలుపుకుని తినడం ఉత్తమం. దీంతో జీర్ణక్రియ సులభంగా జరుగుతుంది. గ్యాస్, అసిడిటీ, అజీర్ణం, మలబద్దకం వంటి సమస్యలు రావు. తెలుసుకున్నారుగా, రాత్రి పూట పెరుగును తినాలో వ‌ద్దో..! ఇంకెందుకాల‌స్యం, మీకు గ‌న‌క ద‌గ్గు, జ‌లుబు వంటి శ్వాస కోశ స‌మ‌స్య‌లు లేన‌ట్ట‌యితే నిరభ్యంత‌రంగా రాత్రి పూట పెరుగు తిన‌వ‌చ్చు..!

Comments

comments

Share this post

scroll to top