25 కోట్ల మందికి ప్రతి సంవత్సరం RS.72,000/-.. సంచలనంగా మారిన రాహుల్ గాంధీ వ్యాఖ్యలు,,!!

కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కొత్త పధకాన్ని అమలులోకి తేవాలని తహతహలాడుతున్నారు, ఎన్నికల్లో విజయం సాధిస్తే ఈ పధకాన్ని ఖచ్చితంగా అమలులోకి తెస్తా అని రాహుల్ గాంధీ చెబుతున్నారు. అసలు ఆ కొత్త పధకం ఏంటంటే, నిరుపేద కుటుంబాలకు ఏటా RS.72,000 ఇవ్వడం.

5 కాదు 10 కాదు.. :

25 కోట్ల మందికి ఏటా RS.72,000 ఇవ్వడం అంటే చిన్న విషయం కాదు, ఇదే విషయం అయి రాహుల్ గాంధీ స్పష్టత ఇచ్చారు. ఈ పథకం కింద ప్రతి ఏటా దేశంలోని 20 శాతం నిరుపేదలకు RS.72,000 ఇస్తామని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. ఇది అత్యంత శక్తివంతమైన ఆలోచన, ఈ డబ్బంతా నేరుగా వాళ్ల బ్యాంకు ఖాతాల్లోకి వెళ్తుందని రాహుల్ తెలిపారు. దేశంలోని 20 శాతం అంటే, సుమారు 25 కోట్ల మంది ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతారని, ఆర్థికంగా ఇది సాధ్యమవుతుందని ఆయన తెలిపారు. గత నాలుగైదు నెలలుగా ఈ పథకంపై అధ్యయనం చేస్తున్నాం. ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏ పథకానికి మేము కట్టుబడ్డాం. దానిని సమర్థంగా అమలు చేశాం. ఇప్పుడు పేదలకు న్యాయం చేస్తాం అని రాహుల్ గాంధీ అన్నారు.

ఈ పధకం మాయ చేసేనా.?

అయితే ఈ పధకం ప్రకటించడం ద్వారా పేద ప్రజలను ఆకట్టుకోవడం సులభమయ్యిందని కొందరు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. కానీ ఇలాంటి హామీలు ప్రజలు ఎన్నో విన్నారు. అందుకే ఈ పధకం పైన వారికి నమ్మకం ఉంటె కాంగ్రెస్ కి ఓటు వేస్తారు లేదంటే లేదు అని మరికొందరు అంటున్నారు. ఈ పధకాన్ని రాహుల్ గాంధీ ప్రకటించాక ఈ పధకం పైన బీజేపీ కార్యకర్తలు కౌంటర్స్ వేస్తున్నారు. కేవలం మాటల వరకే పరిమితం అవుతాయి, ఇలాంటి పథకాలకు లొంగిపోయి ఓట్లు వెయ్యరు, జనాలు మా వైపే ఉన్నారు అని బీజేపీ నాయకులు చెబుతున్నారు. ఈ పధకాన్ని ప్రకటించడం ద్వారా కాంగ్రెస్ కి ఏ మాత్రం లాభం చేకూరుతుందో వేచి చూడాలి .

 

Comments

comments

Share this post

scroll to top