వాట్సాప్ లో వైరల్ అవుతున్న కాల్ రికార్డింగ్స్…బాగోతాలెన్నో బయటపడుతున్నాయి…!!

వాట్సాప్ లో ఒకప్పుడు ఫేక్ న్యూస్ లు, ఫార్వర్డ్ మెసేజ్ లు రచ్చ చేసాయి, కానీ ఇప్పుడు కాల్ రికార్డింగ్స్ రచ్చ చేస్తున్నాయి, ఎవరెవరో మాట్లాడుకున్న కాల్ రికార్డింగ్స్ అన్ని వికీ లీక్స్ లాగ వాట్సాప్ లీక్స్ రూపం లో బయటపడుతున్నాయి.

లవర్స్ లొల్లి.. 

ప్రేమికులు ప్రేమతో మాట్లాడుకున్న మాటలు, ప్రేమ ఎక్కువై మాట్లాడుకున్న మాటలు, ప్రేమ మరీ ఎక్కువై మాట్లాడుకున్న మాటలు అన్ని కాల్ రికార్డింగ్స్ రూపం లో వాట్సాప్ లో హల్చల్ చేస్తున్నాయి. ఒకటి కాదు రెండు కాదు, రోజుకి కొన్ని 100 ల కాల్ రికార్డింగ్స్ వైరల్ అవుతున్నాయి గడిచిన 10 రోజుల్లో.

దేవుడి పేరు ఎత్తితే… బాబోయ్..

వాట్సాప్ లో ఇది వరకు కూడా ఆడియో క్లిప్స్ వైరల్ అయ్యేవి,కానీ గడిచిన 10 రోజుల నుండి వైరల్ అయినన్ని ఆడియో క్లిప్స్ ఇంతక ముందు ఎప్పుడు అవ్వలేదు, కారణం ఒక ప్రేమికుడి బాధ, ఆ ప్రేమికుడి కాల్ రికార్డింగ్ ఏ రేంజ్ లో వైరల్ అయ్యింది అంటే మాటల్లో చెప్పలేనంత ఫేమస్ అయ్యింది, దేవుడి పేరు ఎత్తితే మొదలు… నువ్వెందుకు బాధ పడతావ్ వంటి డైలాగ్స్ వరకు జనల మదిలో నిలిచిపోయే ఎన్నో మాటలున్నాయి, అవి బూతులే అయినా, అతగాడు మాట్లాడిన మాటలు తప్పే అయినా అబ్బాయిలు బాగా కనెక్ట్ అయ్యారు, అమ్మాయిలు కోప్పడ్డారు. కేవలం వాట్సాప్ లోనే కాదు, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, హైక్… ఇలా అన్నిట్లో ఆ 27 నిమిషాల ఆడియో క్లిప్ వైరల్ అయ్యింది.

ఇంకెన్ని పంపిస్తారు రా బాబు.. 

ఆ తరువాత నుండి రోజుకి కనీసం ఒక 100 ఆడియో క్లిప్స్ అయినా వాట్సాప్ లో చెక్కర్లు కొడుతూనే ఉన్నాయ్, అందులో బాగా కనెక్ట్ అయినవి షేర్ లు చేసి వైరల్ చేసేస్తున్నారు. వీటిలో ఎక్కువ శాతం ప్రేమికుల ముచ్చటైన ముచ్చట్లు, విడిపోయిన ప్రేమికులు కమ్మనైన కష్టాలు, అబ్బాయి కోసం ఘర్షణ పడే ఇద్దరమ్మాయిల ఆర్తనాదాలు.. ఒకటి కాదు రెండు కాదు, ఒక్కో ఆడియో క్లిప్ తో ఒక్కో షార్ట్ ఫిలిం తియ్యొచ్చు.

జాగ్రత్త వహించండి… 

కోపంలోనో, బాధలోనే, ప్రేమలోనో మీరు మాట్లాడిన మాటలు అవతలి వాళ్ళు రికార్డు చేసి వైరల్ చేస్తే, మీ మాటలు మీరే వినాల్సి వస్తుంది, కనుక ఫోన్ కాల్స్ లో అయినా, చాటింగ్ లో అయినా జాగ్రత్త వహించండి.

 

 

Comments

comments

Share this post

scroll to top