చంద్రబాబు ఆడియో లీక్.. రేవంత్ కేసులో మరో ట్విస్ట్.

రేవంత్  కేసు కొత్త మలుపు తిరిగింది.  ఎమ్మెల్సీ ఎన్నికల్లో నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ కు 5 కోట్లు ఆఫర్ ఇచ్చిన  విషయంలో రేవంత్  రెడ్డిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసిబి అధికారులు ఇప్పుడు  ఏపి సియం ను టార్గెట్ చేశారు. తాజాగా ఆయన స్టీఫెన్ సన్ తో మాట్లాడిన మాటలు బయటకు వచ్చాయి.. రేపు ఏసిబి అధికారులు బాబు ను విచారించే అవకాశాలున్నాయి.

babu talking with stephenson

 

స్టీఫెన్సన్ తో చంద్రబాబు సంభాషణ ఈ విధంగా సాగింది..

చంద్రబాబు తరపు మనిషి:హలో బ్రదర్.. బాబుగారు మీతో మాట్లాడతారు.. లైన్ లో ఉండండి
ఎమ్మెల్యే స్టీఫెన్సన్: సార్.. గుడ్ ఈవెనింగ్ సార్
చంద్రబాబు:గుడ్ ఈవెనింగ్ బ్రదర్.. హౌ ఆర్ యూ
స్టీఫెన్సన్: ఫైన్.. థాంక్యూ సర్
చంద్రబాబు:మనవాళ్లు నాకంతా వివరించారు.. మీకు అండగా నేనుంటా.. కంగారు పడాల్సిందేమీ లేదు
స్టీఫెన్సన్:యస్ సార్.. రైట్ సార్
చంద్రబాబు:అన్నింటికీ మీకు నేను అండగా ఉంటా.. వాళ్లు మీతో మాట్లాడినవన్నీ నెరవేరుస్తాం
స్టీఫెన్సన్:యస్ సార్.. రైట్ సార్
చంద్రబాబు:మీరు స్వేచ్ఛగా నిర్ణయం తీసుకోండి.. ఎలాంటి సమస్య లేదు
స్టీఫెన్సన్:ఒకే సార్
చంద్రబాబు:అది మా హామీ.. మనం కలిసి పనిచేద్దాం
స్టీఫెన్సన్:రైట్.. థాంక్యూ సార్..
చంద్రబాబు:థాంక్యూ

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top