క్యాబేజి కొంటె లక్షల రూపాయిల లాటరి తగిలింది.!!

AP2TG Staff

అప్పుడప్పుడు పెద్దలు చెప్పే మాటలు వింటూ ఉండాలి, ఎందుకంటే పెద్దలు చెప్పిన మాటలు వింటే ఒక్కో సారి మంచి జరుగుతుంది, ఎంత మంచి అంటే దాదాపు కొన్ని లక్షల డాలర్ లు చిటికెలో సంపాదించేంత.

వివరాల్లోకెళితే అమెరికాలోని మేరీల్యాండ్‌కు చెందిన ఓ మహిళ క్యాబేజీ కొందాం అని ఒక దుకాణాన్ని వెళ్ళింది, క్యాబేజీ ని కొని వస్తూ వస్తూ దారిలో ఒక లాటరీ టికెట్ కొనుగోలు చేసి ఇంటికి వచ్చింది, వచ్చిన వెంటనే గీకి చూస్తే 2.25 లక్షల డాలర్లు గెలుచుకున్నట్టు వచ్చింది. ఆమెకు ఆ టికెట్ రాడానికి పరోక్షంగా ఆమె తండ్రి కారణం అయ్యాడు. గ్రోవ్‌టన్‌ పట్టణానికి చెందిన ‘వెనెస్సా వార్డ్‌’ అనే మహిళకు ఆమె తండ్రి ఫోన్‌ చేసి క్యాబేజ్‌ తీసుకొని రమ్మని చెప్పాడు. దీంతో వెనెస్సా వార్డ్ స్థానిక జైంట్‌ ఫుడ్‌ స్టోర్‌ అనే దుకాణానికి వెళ్లింది. మార్గ మధ్య లో ఆమెకు లక్ కలిసి వస్తుందని కల్లో కూడా ఊహించి ఉండదు.

అసలైన లక్ అంటే ఆమెదే, తన తండ్రి ఫోన్ చేసి క్యాబేజీ లు తీసుకు రా అని చెప్పకపోయి ఉంటె, ఇంత డబ్బు సంపాదించేది కాదు, అంటే లాటరీ కొనమని తన తండ్రి తనతో చెప్పలేదు, కానీ ఆ సమయానికి అటుగా తండ్రి పని మీద వెళ్ళింది కాబట్టి, కచ్చితంగా పరోక్షంగా ఆమె డబ్బులు గెలుచుకోడానికి లక్ తో పాటు తన తండ్రి కూడా ముఖ్య కారణమే. తాను గెల్చుకున్న డబ్బుని భవిష్యత్తులో పదవీ విరమణ చేసాక ఉపయోగించుకుంటానని, డిస్నీ వరల్డ్‌ చూసేందుకు వెళ్తానని ‘వెనెస్సా వార్డ్‌’ తెలిపారు.

మీది లాటరీ మాది హిస్టరీ అనే డైలాగ్ లెజెండ్ సినిమా లో బాలయ్య బాబు నోటి వెంట వింటే లాటరీ కి పవర్ లేదు అనుకున్నా, కానీ ఒక లాటరీ తో హిస్టరీ లోకి ఎక్కొచ్చని ‘వెనెస్సా వార్డ్‌’ నిరూపించారు.

 

Comments

comments