అత‌ను క్యాబ్‌లో వెళ్లేందుకు క్యాబ్ బుక్ చేశాడు…! డ్రైవ‌ర్ లొకేష‌న్ ఎక్క‌డ చూపించిందో తెలుసా.?

నేటి త‌రుణంలో మ‌న‌కు ల‌భిస్తున్న ఆధునిక సాంకేతిక ప‌రిజ్ఞానం చేస్తున్న అద్భుతాల గురించి మ‌నం ప్ర‌త్యేకంగా చెప్పుకోవాల్సిన ప‌నిలేదు. అర‌చేతిలో ప్ర‌పంచాన్ని చూపే అధునాత ప‌రిక‌రాలు మ‌న‌కు అందుబాటులో వ‌చ్చాయి. అయితే ఇదంతా నూత‌న టెక్నాల‌జీ పుణ్య‌మే. కానీ ఇదే టెక్నాల‌జీ కొన్ని సార్లు మాత్రం మ‌న‌ల్ని ఫూల్స్‌ని చేస్తుంది. అవును, మీరు విన్న‌ది నిజ‌మే. ఓ యూజ‌ర్ క్యాబ్‌లో వెళ్లేందుకు క్యాబ్‌ను బుక్ చేయ‌గా, క్యాబ్ డ్రైవ‌ర్ లొకేష‌న్ ఎక్క‌డ చూపించిందో తెలుసా..? స‌ముద్రంలో..

అవును, అది క‌రెక్టే. ఈ నెల 15వ తేదీన ముంబైలో ఓ వ్య‌క్తి క్యాబ్ లో వెళ్లేందుకు గాను ఊబ‌ర్‌లో క్యాబ్ బుక్ చేశాడు. అయితే క్యాబ్ బుక్ చేశాక మ‌న‌కు ఆ యాప్‌లో డ్రైవ‌ర్ ఏ లొకేష‌న్‌లో ఉన్నాడో చూపిస్తుంది క‌దా. దాంతో మ‌నం అత‌ను ఎప్పుడు వ‌స్తాడు, ఇంకా ఎంత టైం ప‌డుతుంది అన్న వివ‌రాల‌ను తెలుసుకోవ‌చ్చు. ఇక అత‌నికి మ‌న లొకేష‌న్ క‌నిపిస్తుంది. దీంతో వారు మ‌న ద‌గ్గ‌ర‌కు సుల‌భంగా వ‌స్తారు. అయితే ముందు చెప్పిన క్యాబ్ డ్రైవ‌ర్ లొకేష‌న్ మాత్రం ఆ వ్య‌క్తికి స‌ముద్రంలో క‌నిపించింది.

దీంతో క్యాబ్ బుక్ చేసిన ఆ వ్య‌క్తికి న‌వ్వు ఆగ‌లేదు. తాను క్యాబ్ బుక్ చేస్తే డ్రైవ‌ర్ లొకేష‌న్ అరేబియా స‌ముద్రంలో క‌నిపించే స‌రికి అత‌నికి ఎలా స్పందించాలో తెలియ‌లేదు. దీంతో వెంట‌నే ఈ విష‌యాన్ని త‌న ఫేస్‌బుక్ ఖాతాలో ఫొటోల‌తో స‌హా పోస్టు చేశాడు. ఇక అది చూసిన నెటిజ‌న్లు కూడా త‌మ‌దైన శైలిలో స్పందించారు. వారు కూడా ఈ ఘ‌ట‌న‌పై ఫ‌న్నీ కామెంట్ల‌ను పెట్టారు. అవును మ‌రి, ముందే చెప్పాం క‌దా, నూత‌న టెక్నాల‌జీ ఒక్కోసారి మ‌న‌ల్ని ఫూల్స్‌ను చేస్తుంద‌ని. ఈ విష‌యం ఈ ఘ‌ట‌న‌లో రుజువైంది క‌దా..!

Comments

comments

Share this post

scroll to top