ఈ వెబ్‌సైట్‌లోకి వెళ్తే చాలు… ర‌క్త‌దాత‌ల గురించి సుల‌భంగా తెలుసుకోవ‌చ్చు..!

ర‌క్తం మ‌న శ‌రీరంలో ఎంత కీల‌క పాత్ర పోషిస్తుందో అంద‌రికీ తెలిసిందే. శ‌రీరానికి కావ‌ల్సిన శ‌క్తిని అందించ‌డంతోపాటు ఆయా అవ‌య‌వాల నిర్మాణానికి త‌గిన పోష‌కాలు అందించ‌డం, వ్య‌ర్థాల‌ను తీసుకువెళ్ల‌డం వంటి ఎన్నో ప‌నులు చేస్తుంది. అయితే ప్రమాదా కార‌ణంగానో లేదంటే అనారోగ్యం వ‌ల్లో ఆస్ప‌త్రిలో చేరితే కొంద‌రు రోగుల‌కు ఒక్కోసారి పెద్ద మొత్తంలో ర‌క్తం కావ‌ల్సి వ‌స్తుంది. ఈ క్ర‌మంలో చాలా మంది బ్ల‌డ్ బ్యాంకుల‌ను ఆశ్ర‌యిస్తారు. అక్క‌డా దొర‌క్క‌పోతే తెలిసిన వారిని అడిగి ర‌క్త‌దాతల కోసం ఎదురు చూస్తారు. అప్పుడు వారు దొరికినా ఎక్క‌డో దూరంలో ఉన్నార‌నుకోండి, దీంతో రోగికి టైముకు ర‌క్తం అంద‌దు. అప్పుడు మ‌రిన్ని ఇబ్బందుల‌కు గురి కావ‌ల్సి వ‌స్తుంది. అయితే అలాంటి ఇబ్బందుల‌ను తీరుస్తూ రోగుల‌కు ర‌క్తం త్వ‌ర‌గా అందేలా చేసేందుకు ఓ సంస్థ ప‌నిచేస్తోంది. అదే బ్ల‌డ్ ప్ల‌స్‌.

bloodplus

బ్ల‌డ్ ప్ల‌స్ అనేది ఓ వెబ్‌సైట్‌. శ‌శి అనే ఓ సివిల్ ఇంజినీర్ దీన్ని ఏర్పాటు చేశాడు. తాను ప‌నిచేస్తున్న ఓ సంస్థ‌లో తోటి ఉద్యోగికి ర‌క్తం అవ‌స‌రం అయిన‌ప్పుడు స‌ద‌రు వ్య‌క్తి కుటుంబ స‌భ్యులు ఆ బ్ల‌డ్ గ్రూప్ కోసం ఎంత‌గానో శ్ర‌మించ‌డాన్ని శ‌శి చూశాడు. దీంతో అలాంటి ప‌రిస్థితుల్లో ఉన్న వారికి స‌హాయం అందించ‌డం కోసం శ‌శి బ్ల‌డ్ ప్ల‌స్ సైట్‌ను ప్రారంభించాడు. అందులో ఔత్సాహికులు త‌మ మొబైల్ నంబ‌ర్, ఉంటున్న అడ్ర‌స్ వంటి వివ‌రాల‌ను ఎంట‌ర్ చేసి పేరు న‌మోదు చేసుకుంటే చాలు, ఎవ‌రైనా అదే ప్రాంతానికి చెందిన వ్య‌క్తికి ర‌క్తం అవ‌స‌రం వ‌స్తే అప్పుడు సంబంధిత ఔత్సాహికులు వెంట‌నే ర‌క్తం ఇచ్చేందుకు అవ‌కాశం ఉంటుంది. దీంతో చాలా స‌మ‌యం, డ‌బ్బు ఆదా అవుతాయి. ప్రాణాపాయ స్థితిలో ఉన్న వ్య‌క్తిని అపాయం నుంచి గ‌ట్టెక్కించ‌వ‌చ్చు..!

అయితే ఈ వెబ్‌సైట్‌లో యూజ‌ర్లు ఎవ‌రైనా ఫేస్‌బుక్‌తో లాగిన్ అయితే దీంతో వారి ఫ్రెండ్స్ ను కూడా ఇందులో చేర్పించి దాంతో వారి వారి బ్ల‌డ్ గ్రూప్‌లు, అడ్ర‌స్‌లు, మొబైల్ నంబ‌ర్లు ఎంట‌ర్ చేయ‌వ‌చ్చు. అలా ఒకే ప్రాంతానికి చెందిన వివిధ ర‌కాల బ్ల‌డ్ గ్రూప్‌లు గ‌ల దాత‌ల‌ను ఇందులో ఎక్కువ‌గా న‌మోదు చేసేందుకు వీలుంటుంది. ఏది ఏమైనా మ‌నుషుల‌ ప్రాణాలు కాపాడాల‌నే త‌ప‌న‌తో శశి చేస్తున్న‌ ప్ర‌య‌త్నం నిజంగా అభినంద‌నీయ‌మే క‌దా..!

మీరు కూడా ర‌క్త‌దాత‌లుగా మారాలన్నా, లేదంటే ర‌క్తం తీసుకోవాల‌న్నా ఈ సైట్‌లో రిజిస్ట‌ర్ చేసుకోండి..! – http://www.bloodplus.in

Comments

comments

Share this post

scroll to top