కొత్త ఫోన్ కొనాలి అనుకుంటున్నారా.? అయితే ఈ వారంలో భారీగా ధరలు తగ్గనున్న 7 స్మార్ట్ ఫోన్లు ఇవే.!

నేటి త‌రుణంలో ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్లలో అనేక ఆక‌ట్టుకునే ఫీచ‌ర్లు యూజ‌ర్ల‌కు ల‌భిస్తున్నాయి. ప్ర‌తి ఒక్క‌రూ త‌మకు న‌చ్చిన ఫీచ‌ర్లు క‌లిగిన ఫోన్ల‌ను కొనుగోలు చేసేందుకు ఆస‌క్తిని క‌న‌బ‌రుస్తున్నారు. ఫోన్ల‌లో ఉండే ఫీచ‌ర్లతోపాటు ధ‌ర కూడా త‌మ బ‌డ్జెట్‌కు అనుకూలంగా ఉంటేనే స్మార్ట్‌ఫోన్ల‌ను కొంటున్నారు. ఈ క్ర‌మంలోనే స్మార్ట్‌ఫోన్ త‌యారీ కంపెనీల‌తోపాటు ఈ-కామ‌ర్స్ సంస్థ‌లు కూడా అప్పుడ‌ప్పుడు స్పెష‌ల్ సేల్స్ నిర్వ‌హిస్తూ త‌క్కువ ధ‌ర‌కే ఫోన్ల‌ను అందిస్తున్నాయి. అయితే ఈ వారంలో కూడా ఇలాగే ప‌లు కంపెనీల‌కు చెందిన స్మార్ట్‌ఫోన్ల ధ‌ర‌లు త‌గ్గ‌నున్నాయి. ఈ వారంలో మొత్తం 7 స్మార్ట్‌ఫోన్ల ధ‌ర‌లు త‌గ్గ‌నుండగా వాటి వివ‌రాల‌ను మీకు అంద‌జేస్తున్నాం. కనుక వాటిపై ఓ లుక్కేసి మీ బ‌డ్జెట్‌కు అనుగుణంగా మీకు న‌చ్చిన ఫోన్‌ను కొనుగోలు చేయండి. మ‌రింకెందుకాల‌స్యం… ధ‌ర‌లు త‌గ్గ‌నున్న ఆ ఫోన్ల‌ను ఓసారి చూద్దామా..!

1. శాంసంగ్ గెలాక్సీ జె7 ప్రొ
శాంసంగ్ గెలాక్సీ జె7 ప్రొ స్మార్ట్ ఫోన్‌ ధర రూ. 2 వేలు తగ్గి రూ. 18,900కు అందుబాటులోకి రానుంది. ఈ ఫోన్‌లో 5.5 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ సూపర్‌ అమోలెడ్‌ డిస్‌ప్లే, ఆక్టాకోర్ ఎగ్జినోస్‌ 7870 ప్రాసెస‌ర్‌, 3జీబీ ర్యామ్‌, 64జీబీ స్టోరేజ్‌, 128 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌, 13 మెగాపిక్స‌ల్ బ్యాక్ కెమెరా, 13 మెగాపిక్స‌ల్‌ ఫ్రంట్‌ కెమెరా, 3600 ఎంఏహెచ్‌ బ్యాటరీ త‌దిత‌ర ఫీచ‌ర్లు ఉన్నాయి.

 

2. నోకియా 6
నోకియా 6 స్మార్ట్‌ఫోన్‌ ధర రూ. 1,500 తగ్గి రూ. 13,499కి లభించనుంది. ఈ ఫోన్‌లో 5.5 ఇంచుల డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ 7.0 నూగట్ ఓఎస్‌, 1.4 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్ డ్రాగ‌న్ 430 ప్రాసెస‌ర్‌, 4జీబీ ర్యామ్, 64జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 16, 8 మెగాపిక్స‌ల్ బ్యాక్‌, ఫ్రంట్ కెమెరాలు, 3000 ఎంఏహెచ్ బ్యాట‌రీ ఫీచ‌ర్లు ఉన్నాయి.

3. శాంసంగ్ గెలాక్సీ జె7 మ్యాక్స్
ఈ ఫోన్ ధ‌ర రూ.3వేలు త‌గ్గి రూ.11,900కు ల‌భ్యం కానుంది. ఇందులో 7 ఇంచ్ డిస్‌ప్లే, 1.5 గిగాహెడ్జ్ క్వాడ్ కోర్ ప్రాసెస‌ర్‌, 1.5 జీబీ ర్యామ్‌, 8 జీబీ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్ 5.1 లాలిపాప్‌, డ్యుయల్ సిమ్‌, 8, 2 మెగాపిక్స‌ల్ బ్యాక్‌, ఫ్రంట్ కెమెరాలు, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.0, 4000 ఎంఏహెచ్ బ్యాట‌రీ ఫీచర్లు ఉన్నాయి.

4. వివో వీ7 ప్ల‌స్
రూ.2వేల త‌గ్గింపు ధ‌ర‌తో ఈ ఫోన్ రూ.19,990 ధ‌ర‌కు ల‌భ్యం కానుంది. ఈ ఫోన్‌లో 5.99 ఇంచ్ డిస్‌ప్లే, 1.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెస‌ర్‌, 4 జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్ 7.1 నూగ‌ట్‌, 16, 24 మెగాపిక్స‌ల్ బ్యాక్‌, ఫ్రంట్ కెమెరాలు, 3225 ఎంఏహెచ్ బ్యాట‌రీ ఫీచ‌ర్లు ఉన్నాయి.

5. వివో వై53
ఈ ఫోన్‌ రూ. 500 తగ్గి రూ. 8,499కి మార్కెట్లో ల‌భ్యం కానుంది. ఈ ఫోన్‌లో 5 ఇంచ్ డిస్‌ప్లే, 1.4 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెస‌ర్‌, 2 జీబీ ర్యామ్‌, 16 జీబీ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో, 8, 5 మెగాపిక్సల్ డ్యుయ‌ల్ బ్యాక్ కెమెరాలు, 2500 ఎంఏహెచ్ బ్యాట‌రీ ఫీచ‌ర్లు ఉన్నాయి.

6. ఇన్ఫినిక్స్ జీరో 5
ఈ ఫోన్ రూ.2వేలు త‌గ్గి రూ.15,999కి రానుంది. ఈ ఫోన్‌లో 5.98 ఇంచ్ డిస్‌ప్లే, 2.6 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెస‌ర్‌, 6 జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్ 7.0 నూగ‌ట్‌, 12, 16 మెగాపిక్స‌ల్ బ్యాక్, ఫ్రంట్ కెమెరాలు, 4350 ఎంఏహెచ్ బ్యాట‌రీ ఫీచర్లు ఉన్నాయి.

7. ఇన్ఫినిక్స్ నోట్ 4
ఈ ఫోన్ రూ.1000 తగ్గి రూ.7,999కి ల‌భ్యం కానుంది. ఈ ఫోన్లో 5.70 ఇంచ్ డిస్‌ప్లే, 1.3 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెస‌ర్‌, 13, 8 మెగాపిక్స‌ల్ బ్యాక్‌, ఫ్రంట్ కెమెరాలు, 3 జీబీ ర్యామ్‌, 32 జీబీ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్ 7.0 నూగ‌ట్‌, 4300 ఎంఏహెచ్ బ్యాట‌రీ ఫీచ‌ర్లు ఉన్నాయి.

Comments

comments

Share this post

scroll to top