ఒప్పో, వివోలో ఈ రెండు ఫోన్ల‌ను కొంటున్నారా..? ఇది చ‌దివితే మీరు ఆ ప‌ని చేయ‌రు తెలుసా..?

నేటి త‌రుణంలో స్మార్ట్‌ఫోన్లు మ‌న జీవితాల‌ను ఎలా ప్ర‌భావితం చేస్తున్నాయో అంద‌రికీ తెలిసిందే. ప్ర‌తి ఒక్క‌రి చేతిలోనూ అవి ద‌ర్శ‌న‌మిస్తున్నాయి. ఇంట‌ర్నెట్ అనేది నేడు ప్ర‌తి ఒక్క‌రి నిత్యావ‌సర వ‌స్తువుగా మారిపోయింది. ఈ క్ర‌మంలో రోజు రోజుకీ స్మార్ట్‌ఫోన్ల‌ను కొంటున్న వారి సంఖ్య పెరిగిపోతూనే ఉంది. అయితే ఎవ‌రైనా డ‌బ్బులు పెట్టిన‌ప్పుడు మంచి ఫోన్‌నే కొనాల‌ని చూస్తారు కానీ, ప‌నికిమాలిన ఫోన్‌ను కొనాల‌ని అనుకోరు క‌దా. అలాగే డ‌బ్బులు వెచ్చించిన‌ప్పుడు ఆ స్థాయిలో ఫీచ‌ర్లు ఫోన్‌లో ఉండాల‌నే ఎవ‌రైనా ఆశిస్తారు. మ‌రి ఇప్పుడు మేం చెప్ప‌బోయే ఓ రెండు కంపెనీల‌కు చెందిన ఫోన్ల‌లో మాత్రం అలా ఫీచ‌ర్లు ఉండ‌వు. కానీ వాటి ధ‌ర మాత్రం చాలా ఎక్కువ‌. ఇంత‌కీ అవేంటో తెలుసు క‌దా. అవేనండీ ఒప్పొ, వివో కంపెనీలు.

అవును, అవే. నిజానికి పేర్లు వేరే అయినా ఈ రెండు కంపెనీల గొడుకు ఒక్క‌టే. అంటే ఈ కంపెనీల‌కు చెందిన ఫోన్ల‌ను బీబీకే ఎల‌క్ట్రానిక్స్ త‌యారు చేస్తుంది. కానీ ఇవి రెండూ రెండు వేర్వేరు కంపెనీల్లా చెలామ‌ణీ అవుతున్నాయి. అయితే ఇవి భార‌తీయ కంపెనీలు కాదు. చైనావి. స‌రే చైనావి అయినా, మ‌రో దేశం కంపెనీలు అయినా ఫోన్ల‌ను ఎక్కువ ధ‌ర‌కు అమ్ముతున్నారంటే ఆ స్థాయిలో ఫీచ‌ర్లు ఉండాలి క‌దా. అవి లేకుండానే బాగా ఎక్కువ ధ‌రకు ఒప్పో, వివోలు ఫోన్ల‌ను విక్ర‌యిస్తున్నాయి. అలాంటి మోడ‌ల్స్‌లో వివోకు చెందిన వీ5 ఒక మోడ‌ల్ కాగా, ఒప్పో కు చెందిన ఎఫ్‌3 మోడ‌ల్ ఒకటి. చాలా మంది ఈ ఫోన్ల‌ను కొంటున్న కార‌ణం ఒక్క‌టే. సెల్ఫీ కెమెరా, బ్యాక్ కెమెరా బాగుంటుంద‌ని. కానీ మీకు తెలుసా..? నిజంగా చెప్పాలంటే వీటిల్లో కెమెరా ప‌నిత‌నం అంతంత మాత్ర‌మే. ఇక మిగిలిన ఫీచ‌ర్స్ విష‌యానికి వ‌స్తే చాలా త‌క్కువనే చెప్ప‌వ‌చ్చు.

వివో వీ5 తీసుకుంటే అందులో ఒక్క‌సారి డిస్‌ప్లే రిజ‌ల్యూష‌న్ చూడండి. 1280 x 720 మాత్ర‌మే. ఈ ఫోన్ రేటు దాదాపుగా రూ.17వేల వ‌ర‌కు ఉంది. మ‌రి ఆ స్థాయిలో రేటు ఉంటే కచ్చితంగా ఫుల్ హెచ్‌డీ.. అంటే 1920 x 1080 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్ ఉండాలి. కానీ అలా లేదు. ఇక ప్రాసెస‌ర్‌. అది కేవ‌లం మీడియాటెక్ ప్రాసెస‌ర్‌. అంత నాణ్య‌మైన ప్ర‌ద‌ర్శ‌న ఇవ్వ‌దు. అయితే వీ5 ఫోన్‌ ప్రాసెస‌ర్ మీడియాటెక్ అని వివో త‌న సైట్‌లో ఎక్క‌డా చెప్ప‌లేదు. కేవ‌లం ఆక్టాకోర్ ప్రాసెస‌ర్ అని మాత్ర‌మే చెప్పింది. దీన్ని బ‌ట్టి మ‌న‌కు తెలుస్తుంది ఏమిటంటే… యూజ‌ర్ల‌ను ఇది త‌ప్పుదోవ ప‌ట్టించే చ‌ర్యే. కావాలంటే ఆ సైట్‌లో వీ5 ఫోన్ గురించి మీరు కూడా చెక్ చేసుకోవ‌చ్చు. చిత్రంలో కూడా దాని గురించి ఇవ్వ‌డం జ‌రిగింది. ఇక వీ5 గురించి వివో చెబుతున్న ఏకైక ఫీచ‌ర్ సెల్ఫీ అట‌. నిజంగా చిత్రం కాక‌పోతే ఫోన్ అంటే కేవ‌లం సెల్ఫీయేనా. ప్రాసెస‌ర్‌, ర్యామ్‌, డిస్‌ప్లే రిజ‌ల్యూష‌న్‌, బ్యాట‌రీ ఏమీ ఉండ‌దా..? రూ.17వేలు ధ‌ర చెల్లిస్తున్న‌ప్పుడు వీ5లో మీకు ల‌భించేది కేవ‌లం 3000 ఎంఏహెచ్ బ్యాట‌రీ మాత్ర‌మే. అది నేటి త‌రుణంలో ఓ స్మార్ట్‌ఫోన్ యూజ‌ర్‌కు అస్స‌లు స‌రిపోదు. ఇప్పుడు చెప్పండి రూ.17వేల‌కు వీ5 ఫోన్‌ను కొనొచ్చా..? మీరే తేల్చుకోండి.

ఇక మ‌రో ఫోన్ అయిన ఒప్పో ఎఫ్‌3 లో ఫీచ‌ర్స్ కూడా దాదాపుగా ఇలాగే ఉన్నాయి. కానీ ఆ ఫోన్‌ను కూడా ఎక్కువ ధ‌ర‌కే విక్ర‌యిస్తున్నారు. నిజానికి చైనా ఫోన్ల‌కు అంత‌టి ధ‌ర వెచ్చించ‌డం అవ‌స‌ర‌మా..? అనేది ఆలోచిస్తే ఎవ‌రికైనా ఇట్టే అర్థ‌మ‌వుతుంది. మ‌రి ధ‌ర పెట్టిన‌ప్పుడు వాటిల్లో ఆ స్థాయిలో ఫీచ‌ర్స్ ఉన్నాయా..? అంటే అది లేదు. అంత‌కు త‌క్కువ ధ‌ర‌లోనే ఎక్కువ ఫీచ‌ర్స్ ఇస్తున్న ఫోన్లు కూడా ల‌భిస్తున్నాయి. కాబ‌ట్టి ఈ ఫోన్ల‌ను కొనేవారు ఒక‌సారి ఆలోచించండి. సెల్ఫీ మోజులో ప‌డి మాత్రం ఈ ఫోన్ల‌ను కొన‌కండి.

Comments

comments

Share this post

scroll to top