ఇల్లు కొనాల‌ని అనుకుంటున్నారా..? అయితే ఈ 7 ప్రాంతాల్లో అస్స‌లు కొన‌రాదు. ఎందుకో తెలుసా..?

ప్ర‌పంచంలో ఏ దేశంలో ఏ ప్రాంతంలో ఉండే వ్య‌క్తి అయినా త‌న‌కంటూ ఓ సొంత ఇల్లు అనేది ఉండాలని కోరుకుంటాడు. ఈ క్ర‌మంలో కొంద‌రికి సొంతింటి క‌ల నెర‌వేరితే కొంద‌రికి మాత్రం ఎంత క‌ష్ట‌ప‌డినా ఆ అదృష్టం రాదు. ఎప్ప‌టికీ అద్దె ఇండ్ల‌లోనే ఉంటారు. అది వేరే విష‌యం. అయితే కొత్త‌గా ఇల్లు కొనుక్కునే వారైనా, లేదంటే ఖాళీ స్థలం కొనుక్కుని అందులో ఇల్లు క‌ట్టుకోవాల‌నుకునే వారైనా కొన్ని జాగ్ర‌త్త‌లు పాటించాల్సి ఉంటుంద‌ట‌. ముఖ్యంగా కింద చెప్పిన 7 ప్ర‌దేశాల్లో మాత్రం అస్సలు ఇల్లు కొన‌కూడ‌ద‌ని శాస్త్రాలు చెబుతున్నాయి. మ‌రి ఆ ప్ర‌దేశాలు ఏమిటో తెలుసుకుందామా..!

1. చౌర‌స్తా
పేరులోనే ఉంది క‌దా చౌర‌స్తా అని. 3 లేదా 4 రోడ్లు క‌లిసే చోటును సాధార‌ణంగా చౌర‌స్తా అని వ్య‌వ‌హ‌రిస్తారు. అయితే ఇలాంటి చౌర‌స్తాల్లో ఎక్క‌డైనా వాహ‌నాల ర‌ద్దీ ఎక్కువ‌గా ఉంటుంది. ఉద‌యం నిద్ర లేవ‌డంతోనే వాటి రొద ఉంటుంది. ఇక రాత్రి చాలా సేప‌య్యే వ‌ర‌కు కూడా వాటి చ‌ప్పుళ్లు, హార‌న్ మోత‌లు విన‌ప‌డుతూనే ఉంటాయి. క‌నుక ఇలాంటి చౌర‌స్తాల్లో మాత్రం అస్స‌లు నివాసం ఉండ‌కూడ‌దు. ఇల్లు కొన‌కూడ‌దు. ఉంటే ఆ చ‌ప్పుళ్లు స‌మీపంలో ఉండే ఇండ్ల‌లో నివ‌సించే వారి మానసిక స్థితిని దెబ్బ తీస్తాయి. అంతేకాదు, అలా అన్ని ర‌కాల వాహ‌నాల చ‌ప్పుళ్లు ఇండ్ల‌లోకి వెళ్ల‌రాద‌ట‌. వెళితే నెగెటివ్ ఎన‌ర్జీ ప్ర‌సార‌మై ఆ ఇండ్ల‌లో ఉండే వారికి అన్నీ అశుభాలే జ‌రుగుతాయ‌ట‌.

2. పాడు బ‌డిన నిర్మాణాలు
పాడుబ‌డిన నిర్మాణాలు ఉండే ప్రాంతంలో ఇళ్ల‌ను కొన‌రాదు. అలాంటి ప్ర‌దేశంలో ఉండే ఇండ్ల‌లోనూ నివాసం ఉండ‌రాదు. ఎందుకంటే అలాంటి ఇండ్లు దుష్ట శ‌క్తుల‌కు ఆవాసంగా ఉంటాయ‌ట‌. వాటి నుంచి నెగెటివ్ ఎన‌ర్జీ మ‌న ఇండ్ల‌లోకి ప్ర‌వేశించి మ‌న‌కు ఇబ్బందుల‌ను క‌లిగిస్తుంద‌ట‌. ఆరోగ్య‌ప‌రంగా, ఆర్థిక ప‌రంగా స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కోవాల్సి వ‌స్తుంద‌ట‌.

3. హాస్పిట‌ల్స్‌
హాస్పిట‌ల్స్ ఉండే ప్రాంతాల్లోనూ ఇండ్ల‌లో ఉండ‌రాదు. అలాంటి చోట్ల‌లో ఉన్న ఇండ్ల‌ను కొన‌రాదు. ఎందుకంటే ఆ ప్రాంతంలో రోగుల సంఖ్య ఎక్కువ‌గా ఉంటుంది. క‌నుక హాస్పిటల్స్ నుంచి సూక్ష్మ క్రిములు గాలిలోకి వ్యాపించి ఇవి ఇండ్ల‌లోకి వ‌చ్చేందుకు అవ‌కాశం ఉంటుంది. దీంతో అనారోగ్యాల బారిన ప‌డ‌తారు.

4. మాంసం అమ్మే షాపులు, క‌బేళాలు
మాంసం అమ్మే షాపులు, క‌బేళాల‌కు కూడా దూరంగా ఉండాలి. ఎందుకంటే ఆ ప్రాంతాల్లో నెగెటివ్ ఎన‌ర్జీ ఎక్కువగా ఉంటుంద‌ట‌. అది ఇండ్ల‌లోకి వెళ్తే స‌మ‌స్య‌లు వ‌స్తాయ‌ట‌. క‌నుక ఈ ప్రాంతాల్లో ఉండ‌కూడ‌దు.

5. మ‌ద్యం షాపులు
మ‌ద్యం అమ్మే షాపులు, బార్లు, ప‌బ్‌లు ఉండే ప్రాంతాల్లో ఉండ‌కూడ‌దు. ఎందుకంటే ఆ ప్రాంతాల్లో ఉంటే వాస్తు ప్ర‌కారం కుటుంబ స‌భ్యులు ఎప్పుడూ గొడ‌వ ప‌డుతూ ఉంటార‌ట‌. ఆర్థిక స‌మ‌స్య‌లు వ‌స్తాయ‌ట‌.

6. శ్మ‌శాన‌వాటిక
వీటికి ద‌గ్గ‌ర‌గానైతే సాధారణంగా ఎవ‌రూ ఉండ‌రు. కానీ సిటీల్లో స్థ‌లం దొర‌క‌దు క‌దా. అందుకే వీటి ప‌క్క‌న కూడా నిర్మాణాల‌ను క‌డుతున్నారు. క‌నుక అలా శ్మ‌శానాల‌కు ద‌గ్గ‌ర‌గా ఉండే ఇండ్ల‌లో నివ‌సించ‌రాదు. అలాంటి ఇండ్ల‌ను కొన‌రాదు. లేదంటే దుష్ట‌శ‌క్తులు, నెగెటివ్ ఎన‌ర్జీ బారిన ప‌డాల్సి వ‌స్తుంది. ఆ త‌రువాత కుటుంబ స‌భ్యుల‌కు అన్నీ స‌మ‌స్య‌లే వ‌స్తాయి.

7. ఆత్మ‌హ‌త్య చేసుకున్న చోటు
ఇక కొత్త‌గా ఎవ‌రైనా ఇల్లు కొనుక్కుంటుంటే గ‌మ‌నించాల్సిన ఇంకో విష‌యం ఏమిటంటే… అంత‌కు ముందు ఆ ఇంట్లో లేదా చుట్టు పక్క‌ల ఎవ‌రైనా ఆత్మ‌హ‌త్య చేసుకున్నారా..? అనేది ప‌రిశీలించాలి. ఎందుకంటే ఆత్మ‌హ‌త్య చేసుకున్న వారి ఆత్మ‌లు అదే ప్రాంతంలో తిరుగుతాయ‌ట‌. ఈ క్ర‌మంలో ఎవ‌రైనా అదే ప్రాంతంలో ఉంటే… వారి జాత‌కం ప్ర‌కారం ఒక్కోసారి ఆత్మ‌ల ప్ర‌భావం వారిపైన ప‌డుతుంద‌ట‌. అంతేకాదు, దుష్ట‌శ‌క్తుల వ‌ల్ల నెగెటివ్ ఎన‌ర్జీ కూడా ఇండ్ల‌లోకి వ‌స్తుంది. క‌నుక ఇలాంటి ప్రాంతాల్లో కూడా ఉండ‌రాదు. ఇండ్ల‌ను కొన‌రాదు.

Comments

comments

Share this post

scroll to top