ఎల‌క్ట్రానిక్ వ‌స్తువులు కొనాల‌నుకుంటున్నారా? అయితే జులై 1 లోపే కొనేయండి…ఎందుకో తెలుసా?

మంచి త‌రుణం మించిన దొర‌క‌దు. ఆల‌సించిన ఆశా భంగం… అవును, ఇప్పుడు ఎల‌క్ట్రానిక్ ఉత్ప‌త్తుల అమ్మకం దార్లు అనుస‌రిస్తున్న పంథా ఇదే. ఎందుకంటారా..? త‌్వ‌ర‌లో, అంటే.. జూలై 1 నుంచి జీఎస్‌టీ బిల్లు దేశ‌వ్యాప్తంగా అమ‌లులోకి రానుంది క‌దా. అందుకే అమ్మకం దార్లు తొంద‌ర ప‌డుతున్నారు. పాత స్టాక్‌ను క్లియ‌ర్ చేసుకునేందుకు చాలా పెద్ద ఎత్తున రాయితీల‌ను, ఆఫ‌ర్ల‌ను ప్ర‌క‌టిస్తున్నారు. అదేంటీ… జీఎస్‌టీ బిల్లుకు, వీరి అమ్మ‌కాల‌కు సంబంధం ఏమిటి..? అని అనుకుంటున్నారా..? ఏమీ లేదండీ… అస‌లు విష‌యం ఏమిటంటే…

జూలై 1న దేశ వ్యాప్తంగా జీఎస్‌టీ అమ‌లులోకి రానుంద‌ని అంద‌రికీ తెలిసిందే. ఈ క్ర‌మంలో చాలా వ‌స్తువుల ధ‌ర‌లు పెర‌గ‌నున్నాయి. వాటిలో ఎల‌క్ట్రానిక్ వ‌స్తువులు కూడా ఉన్నాయి. ఈ క్ర‌మంలో జీఎస్‌టీ బిల్లు గ‌న‌క అమ‌లులోకి వ‌స్తే అమ్మ‌కాల ప్ర‌భావం ఏవిధంగా ఉంటుందోన‌ని రీటెయిలర్స్ ఆందోళ‌న చెందుతున్నార‌ట‌. సేల్స్ తక్కువ‌గా ఉంటే అప్పుడు మొద‌టికే మోసం వ‌స్తుంద‌ని వారు అనుకుంటున్నారు. క‌నుక‌నే ఇప్ప‌టికే ఉన్న పాత స్టాక్‌నంత క్లియ‌ర్ చేసుకునే ప‌నిలో ప‌డ్డారు. అందులో భాగంగానే వారు ఆఫ‌ర్ల‌ను ప్ర‌క‌టిస్తున్నారు. భారీ డిస్కౌంట్ల‌కు ఎల‌క్ట్రానిక్ వ‌స్తువుల‌ను అమ్ముతారు.

సాధార‌ణంగా ప్ర‌తి ఏడాది వేస‌వి సీజ‌న్ లో అమ్మ‌కాల శాతం త‌క్కువ‌గా ఉంటుంది. వేస‌వికి జూన్ నెల ఆఖ‌రు గ‌న‌క ఈ నెల‌లో ఆ శాతం మ‌రింత త‌గ్గే అవ‌కాశం ఉంది. ఈ క్ర‌మంలోనే ఆఫ‌ర్ల‌ను, డిస్కౌంట్ల‌ను ప్ర‌క‌టిస్తే ఉత్ప‌త్తుల‌ను అమ్ముకోవ‌చ్చ‌ని, త‌ద్వారా పాత స్టాక్‌ను క్లియ‌ర్ చేసుకోవ‌చ్చ‌ని రీటెయిలర్స్ భావిస్తున్నారు. మ‌రో నెల ఆగితే జీఎస్‌టీ బిల్లు ఎలాగూ వ‌స్తుంది క‌దా, ఇక అప్పుడు అమ్మ‌కాల‌పై ప్ర‌భావం ప‌డుతుంద‌ని వారు భావిస్తున్నారు. అందుకే ఇలా టీవీలు, వాషింగ్ మెషిన్లు, ఫ్రిజ్‌లు, ఏసీలు, ఓవెన్‌లు వంటి ఉత్ప‌త్తుల‌పై 25 నుంచి 30 శాతం వ‌ర‌కు డిస్కౌంట్ల‌ను ప్ర‌క‌టిస్తున్నారు. క‌నుక ఎవ‌రైనా… ఆ వ‌స్తువులు కొనాల‌నుకుంటే ఇక ఈ నెలాఖ‌రులోగా కొనండి. లేదంటే ఆ త‌రువాత డిస్కౌంట్ కాదు క‌దా, ఇంకా వాటిని ఎక్కువ రేటు పెట్టి కొనేందుకు అవ‌కాశం ఉంటుంది.

Comments

comments

Share this post

scroll to top