ప్రపంచంలో దేవుడి తర్వాత చేతులెత్తి మొక్కేది ఒక్క డాక్టర్ కు మాత్రమే. ప్రాణాలు కాపాడిన వైద్యుడ్ని దేవుడు కంటే గొప్పగా చూస్తారు. అయితే ఇంత గొప్ప పనిచేస్తున్న వైద్యులు డాక్టర్ కావడానికి ఎన్నో ఆర్ధిక ఇబ్బందులు, మరెన్నో కష్టాలను ఎదుర్కొని వైద్యరంగంలోకి ప్రవేశిస్తున్నారు. కొన్ని రోజుల క్రితం డబ్బులు కట్టలేక ఎంబిబిఎస్ చదువు మధ్యలోనే నిలిపివేశాడు ఓ విద్యార్థి . కారణం డబ్బుకట్టలేకపోవడమే. ప్రభుత్వ ఫీజు కట్టగలడు గానీ ప్రైవేట్ కాలేజ్ లు డిమాండ్ చేసే కోట్లరూపాయలు మాత్రం చెల్లించలేకపోయాడు.మీరు విన్నది నిజమే ఈ రెండిటికీ చాలా వ్యత్సాసం ఉంది.
మనదేశంలో కొన్నిమెడికల్ కాలేజీలు ప్రభుత్వ ఆధీనంలో నడుస్తుంటే, మరికొన్ని ప్రైవేట్ సంస్థలు నడుపుతున్నాయి. వీటివల్ల మెడికల్ సీట్లను ఎక్కువ ధరకు అమ్ముకుంటున్నారు. ప్రవేశ పరీక్ష రాసి, అందులో ఉత్తీర్ణత సాధించినా, ఎన్నో రకాలుగా డబ్బులు గుంజుతున్నారు. పేరుకు మాత్రమే ప్రవేశ పరీక్షలు రాస్తున్నా, మెడికల్ కాలేజ్ లో చేరాలంటే మాత్రం కొన్ని కోట్లు సీటు కోసం ఖర్చుచేయాల్సి స్తుంది. మనదేశంలో 25000 మెడికల్ సీట్లు 12,000కోట్లకు అమ్ముడుపోయాయంటే ఏ రేంజ్ లో మెడికల్ విద్యార్థుల నుండి డబ్బు వసూల్ చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు.