35 మందిని కాపాడి…తాను ప్రాణాలొదిలిన RTC డ్రైవ‌ర్.!! త‌మ పాలిట దేవుడంటున్న ప్ర‌యాణికులు!!

తాను చ‌నిపోతున్నాన‌ని…తెలిసినా..త‌నను న‌మ్మి బ‌స్ ఎక్కిన 35 మంది ప్ర‌యాణికుల‌ ప్రాణాల‌ను కాపాడాడు సైదులు అనే ఆర్టీసీ బ‌స్ డ్రైవ‌ర్ . సైదులు డ్రైవింగ్ చేస్తున్న బ‌స్ ఈరోజు ఉద‌యం 35 మంది ప్ర‌యాణికుల‌తో…. ఖ‌మ్మం నుండి హైద్రాబాద్ బ‌య‌లుదేరింది., నకిరేక‌ల్ వ‌ర‌కు రాగానే సైదులుకు ఒక్క‌సారిగా గుండెనొప్పి వ‌చ్చింది…దీంతో బ‌స్ ను రోడ్డు ప‌క్క‌కు ఆపే ప్ర‌య‌త్నం చేశాడు….గుండెనొప్పి మ‌రీ ఎక్కువ కావ‌డంతో…. ఒక్క‌సారిగా బ్రేక్ వేసి డివైడ‌ర్ ను మెల్లిగా ఢీ కొట్టి బ‌స్ ను ఆపాడు. బ‌స్ ఆగింది, బ‌స్ లోని ప్ర‌యాణికులంతా సుర‌క్షితంగా ఉన్నారు. కానీ హార్ట్ ఎటాక్ తో డ్రైవ‌ర్ సైదులు మ‌ర‌ణించాడు.

బ‌స్ లోని ప్ర‌యాణికులంతా…ఇది త‌మ‌కు మ‌రోజ‌న్మ అని…త‌న ప్రాణాలు పోతున్నాయ‌ని తెలిసినా…త‌మ కోసం త‌పించి మ‌ర‌ణించిన సైదులు త‌మ పాలిట దేవుడు అంటున్నారు ప్ర‌యాణికులు. సైదులు మృతదేహాన్ని నకిరేకల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

Watch Video:

Comments

comments

Share this post

scroll to top