నార్మ‌ల్ డెలివ‌రీ కోసం…డాన్స్.!! కొత్త ట్రిక్ !!

ఒకప్పుడు గంపెడు మంది పిల్లల్ని కనేవారు మన నాన్నమ్మలు,అమ్మమ్మలు..అన్ని నార్మల్ డెలివరీలే.కానీ ఇప్పుడు ఒకరిద్దర్ని కనడానికే నానా కష్టాలు పడుతున్నాం.ఆ ఒకరిద్దర్ని కూడా సిజేరియన్ ద్వారానే కంటున్నాం.ప్రసవవేదన ఎలా ఉంటుంది..నొప్పులు పడి బిడ్డపుట్టగానే ప్రపంచాన్ని జయించినంత సంతోషం రుచి చూస్తున్న మహిళలు చాలా తక్కువ.నార్మల్ డెలివరీ అనేది కలలో మాటలా అయిపోయింది ప్రస్తుత పరిస్థితి..డాక్లర్లు కూడా ప్రతి ఒక్కరికి సిజేరియన్ చేసి బిడ్డను తీసేస్తున్నారు..ఎక్కడో ఒకచోట నార్మల్ డెలివరీ కోరుకునేవారు లేకపోలేదు..అలాంటి మహిళే ఈవిడ..

నెలలు నిండిన తర్వాత ఫైనల్ చెకప్ కోసం హాస్పటల్ కు వెళ్లిన మహిళకు సిజేరియన్ తప్పదని చెప్పారు డాక్టర్లు.దీంతో తనకు నార్మల్ డెలివరీ కావాలని సుఖ ప్రసవం కోసం ఏమేం చేయాలో అన్ని చేసి,చివరకు రెండు గంటలలపాటు బూగీ డ్యాన్స్ చేసింది.మధ్య మధ్యలో అరగంటకొకసారి పదినిమిషాలపాటు విశ్రాంతి తీసుకుంటూ డ్యాన్స్ చేస్తూ ఊగిపోయింది.ఇప్పుడు ఆ డ్యాన్స్ వైరల్ అయింది.మీరు ఓ లుక్కేయండి..

Watch Video:

https://youtu.be/6TF18oovWzE

సుఖప్రసవం అనేది అంత కష్టమైనదేం కాదు..దానికోసం ముందుగా మనకు కావల్సింది దైర్యం.ఇప్పటి వాళ్లు నొప్పులు అనగానే టెన్షన్ పడిపోతుంటారు.దానితో పాటు గా మనం రెగ్యులర్ యాక్టివిటీస్ యాజ్ ఇట్ ఈజ్ గా చేసుకోవడం..వాకింగ్ లాంటివి చేయడం చేస్తే సరిపోతుంది..

Comments

comments

Share this post

scroll to top