తల్లీదండ్రులు టైలరింగ్ చేస్తూ కొడుకును ఇంజనీరింగ్ చదివిస్తుంటే, అతడేమో జల్సాల కోసం దొంగగా మారాడు.!

తల్లీదండ్రులిద్దరూ టైలరింగ్ చేస్తూ   కొడుకు ఇంజనీరింగ్  చదివిస్తున్నారు. కొడుకు మంచిగా చదివుకొని తమను కష్టాలనుండి గట్టెక్కిస్తాడనే గంపెడాశాతో ఉన్న ఆ తల్లీదండ్రులకు అనుకోని షాక్ తగిలింది పోలీసులు చేసిన ఫోన్ తో.. మీ కొడుకు రాహుల్ దొంగతనం చేస్తూ పట్టుబడ్డాడు ఓ సారి మీరు స్టేషన్ కు రావాలనే అవతలి మాటలు విన్నాక. అసలు విషయం ఏంటా అని పోలీస్ స్టేషన్ వెళ్ళేంతవరకు తెలియదు  ఆ తల్లీదండ్రులకు జల్సాలకు అలవాటు పడిన తమ కొడుకు దొంగ గా మారి …భారీ దొంగతనానికి ఒడిగట్టిన విషయం.

పోలీసుల వివరాలు ప్రకారం… రాహుల్ అనే ఇంజనీరింగ్ కుర్రాడు … గత సంవత్సరం డిసెంబర్ 18న సమీపంలోని ఇంటిని టార్గెట్ చేసుకొని తాళాలు ఎక్కడ పెడుతున్నారో గమనించి బయటకు వెళ్లగానే  ఆ ఇంటినుండి 30 తులాల బంగారాన్ని  చోరీ చేశాడు. ఇదే కాక అక్కడక్కడ కూడా దొంగతనాలు చేసినట్టు తెలుస్తుంది. ఇతని నుండి   రూ.10 లక్షలు విలువ చేసే 45 తులాల ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు పోలీసులు ఈ మేరకు  ఎస్ఆర్ నగర్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.

 

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top