“జియో” కు పోటీగా “బీఎస్‌ఎన్ఎల్” బంపర్ ఆఫర్..! “అన్లిమిటెడ్ డేటా” కేవలం 249 రూపాయలకే..!

రిల‌య‌న్స్‌కు చెందిన జియో దెబ్బ‌కు ఓ వైపు ప్రైవేటు టెలికాం ఆప‌రేట‌ర్లు అంతా త‌మ త‌మ ప్లాన్ల‌ను మారుస్తూ క‌స్ట‌మ‌ర్లు చేజారిపోకుండా ఉండేందుకు ప‌థ‌కాలు ర‌చిస్తున్నారు. ఇప్ప‌టికే ఎయిర్‌టెల్‌, ఐడియా, వొడాఫోన్ లు పోటా పోటీగా ఆఫ‌ర్ల‌ను ప్ర‌క‌టిస్తూ జియోను ఢీకొట్టినంత ప‌ని చేస్తుండ‌గా, ఆ కోవ‌లోకి బీఎస్ఎన్ఎల్ కూడా వ‌చ్చి చేరింది. అంద‌రు ఆప‌రేట‌ర్లు ఇస్తున్న మాదిరిగానే ఆ సంస్థ కూడా ప‌లు ఆఫ‌ర్ల‌ను తాజాగా ప్ర‌వేశ‌పెట్టింది. వాటిలో అన్‌లిమిటెడ్ డేటా అన్నింటిలోనూ ల‌భిస్తోంది. ఆయా ప్యాక్‌ల వివ‌రాలు ఇలా ఉన్నాయి…

బీఎస్‌ఎన్ఎల్ తన బ్రాండ్‌బ్యాండ్ కస్టమర్లకు అదిరిపోయే ఆఫర్‌ను ప్రకటించింది. ‘అన్‌లిమిటెడ్ బ్రాడ్‌బ్యాండ్ యట్ 249’ పేరుతో నెలరోజుల పాటు రోజుకి 10జీబీ డాటాను అందిస్తున్నట్లు ప్రకటించింది. అంటే నెలకి రూ. 249 చెల్లిస్తే రోజుకి డౌన్‌లోడ్, బ్రౌజింగ్ కోసం 10జీబీ డాటాను వాడుకోవచ్చు. కొత్త బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్ పొందడానికి టోల్ ఫ్రీ నంబర్ 1800 345 1500ని సంప్రదించాలి.

దీనికి అదనంగా మరొక ఆఫర్ కూడా ఇచ్చింది!

  • రాత్రి 9 గంటల నుంచి ఉదయం 7 గంటల మధ్య ఏ నెట్‌వర్క్‌కి అయినా అన్ లిమిటెడ్ కాల్స్
  • ఆదివారం రోజు మొత్తం అన్ లిమిటెడ్ కాల్స్ ఫ్రీ

Comments

comments

Share this post

scroll to top