స్మార్ట్‌ఫోన్ వినియోగదారులకు బీఎస్‌ఎన్‌ఎల్ బంపర్ ఆఫర్… రూ.50కే 20 జీబీ 3జీ డేటా…

స్మార్ట్‌ఫోన్ ఉందంటే చాలు ఇంటర్నెట్ వాడడం ఈ రోజుల్లో ఎక్కువైపోయింది. కారణం ఏమున్నా ఇప్పుడు స్మార్ట్‌ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఇంటర్నెట్‌ను వాడుతున్నారు. అయితే ఇల్లు, ఆఫీస్, కాలేజ్, రెస్టారెంట్ ఇలాంటి ప్రదేశాల్లో ఉన్నప్పుడు అక్కడి వైఫై ద్వారా ఇంటర్నెట్ వాడుకునే యూజర్లు బయట ఎక్కడైనా దాన్ని వాడాల్సి వస్తే తప్పనిసరిగా మొబైల్ ఇంటర్నెట్‌పై ఆధార పడాల్సి వస్తోంది. ఈ క్రమంలో హైస్పీడ్ ఇంటర్నెట్‌ను ఇచ్చే 3జీ ప్యాక్‌లను వినియోగదారులు రీచార్జి చేసుకుంటున్నారు. పోస్ట్‌పెయిడ్ వాడుతున్న వారు కూడా 3జీ వైపే మొగ్గుచూపుతున్నారు. అయితే ఏ టెలికాం ఆపరేటర్ అయినా ఇప్పుడు 1జీబీ 3జీ డేటా ఇవ్వాలంటే కనీసం రూ.250 వరకు చార్జి చేస్తున్నారు. కానీ బీఎస్‌ఎన్‌ఎల్ మాత్రం యూజర్లకు తాజాగా ఓ బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది. అదేమిటంటే బీఎస్‌ఎన్‌ఎల్ మొబైల్ కనెక్షన్‌ను వాడుతున్న వారు ఇప్పుడు కేవలం రూ.50 చెల్లించి ఏకంగా 20 జీబీ 3జీ డేటాను పొందవచ్చు.

BSNL-3G-Data

కాగా బీఎస్‌ఎన్‌ఎల్ ప్రవేశపెట్టిన ఈ కొత్త ఆఫర్ ఆ కంపెనీ వినియోగదారులకు మాత్రమే లభిస్తోంది. అయితే వారు ఈ ఆఫర్‌ను పొందాలంటే కింద ఇచ్చిన పలు సూచనల ద్వారా మొబైల్ రీచార్జి చేసుకోవాల్సి ఉంటుంది.

  1. ముందుగా బీఎస్‌ఎన్‌ఎల్ మొబైల్ సెల్ఫ్‌కేర్ పోర్టల్ http://selfcare.sdc.bsnl.co.in/selfcare/start.swe?SWECmd=Start&SWEHo=selfcare.sdc.bsnl.co.in ను ఓపెన్ చేయాలి.
  2. అక్కడ సూచించిన విధంగా సమాచారం నింపాల్సి ఉంటుంది.
  3. అనంతరం యూజర్లు పోర్టల్‌లోకి లాగిన్ అవ్వొచ్చు.
  4. సైట్‌లోకి లాగిన్ అయిన తరువాత రూ.50కి 20 జీబీ 3జీ డేటా ప్లాన్‌ను ఎంచుకుని రీచార్జి చేసుకోవాలి.
  5. రీచార్జి అనంతరం ప్లాన్ యాక్టివేట్ అవుతుంది.
  6. ఇలా యాక్టివేట్ అయిన ప్లాన్‌ను వినియోగదారులు తమ తమ స్నేహితులు, కుటుంబ సభ్యులకు కూడా షేర్ చేసుకోవచ్చు.
  7. అయితే ప్లాన్ యాక్టివేట్ అయ్యేందుకు మాత్రం కొంత సమయం తీసుకుంటుంది.

ప్రస్తుతం బీఎస్‌ఎన్‌ఎల్ మొబైల్ సెల్ఫ్‌కేర్ పోర్టల్‌కు సందర్శకుల సంఖ్య ఎక్కువగా ఉండడం వల్ల ఆ సైట్ అప్పుడప్పుడూ క్రాష్ అవుతున్నట్టు పలువురు యూజర్లు వెల్లడిస్తున్నారు. కానీ అంతా సక్రమంగా జరిగితే వినియోగదారులు సులభంగా ప్లాన్‌ను యాక్టివేట్ చేసుకునేందుకు వీలుంది. అయితే 20 జీబీ 3జీ డేటా అంటే కనీసం ఎంత లేదన్నా ప్రస్తుతం దాదాపు రూ.3వేల వరకు అవుతుంది. కానీ వినియోగదారులకు రూ.50కే ఇంతటి డేటాను ఉచితంగా ఎందుకు అందిస్తున్నారు? ఇదంతా ఓ స్కామ్ అయి ఉంటుంది! అని మీరు అనుకోవచ్చు. అయితే అదేం కాదు, ఎందుకంటే ప్రధాని నరేంద్ర మోడీ డిజిటల్ ఇండియా స్కీమ్‌లో భాగంగా బీఎస్‌ఎన్‌ఎల్ ద్వారా ఇంతటి భారీ ఆఫర్‌ను ప్రజలకు అందిస్తున్నట్టు తెలిసింది. సో! మీరు బీఎస్‌ఎన్‌ఎల్ మొబైల్ కనెక్షన్ వాడుతున్నట్టయితే వెంటనే ఆ సైట్‌లోకి లాగిన్ అయ్యి రూ.50కే 20 జీబీ 3జీ డేటాను పొందండి. అసలు ఆ కనెక్షన్‌ను వాడని వారైతే వెంటనే ఓ బీఎస్‌ఎన్‌ఎల్ సిమ్ తీసుకుని దాని ద్వారా ఆఫర్‌ను పొందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. పోయేదేముంది డ్యూడ్. వస్తే 20 జీబీ 3జీ డేటా. లేదంటే రూ.50కి ఎలాగూ టాక్‌టైం మాత్రం వస్తుంది కదా!

Comments

comments

Share this post

scroll to top