చెల్లెల్నిపెళ్లి చేసుకున్న అన్న. గేమ్ అఫ్ థ్రోన్స్ కాదు, గేమ్ అఫ్ పంజాబ్..

వీసా కోసం పెళ్లిళ్లు చేసుకోడం కొత్తేమి కాదు, కానీ వీసా కోసం తోబుట్టువుని పెళ్లి చేసుకోడం ఎక్కడైనా చూసారా.? మన దేశం లో తోబుట్టువుని పెళ్లి చేసుకొనే ఆచారం అయితే లేదు, కానీ ఆచారాలకు పద్ధతులకు విరుద్ధంగా పంజాబ్ కి చెందిన అన్న చెల్లెలు పెళ్లి చేసుకున్నారు, ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియా లో హాట్ టాపిక్ అయ్యింది.

వారసత్వం కోసం కాదు, పౌరసత్వం కోసమే..:

అన్నయ్యకు ఆస్ట్రేలియా పౌరసత్వం ఉంది, ఆస్ట్రేలియాలో పౌరసత్వం పొందాలంటే, దాదాపు ఆరు సంవత్సరాలు అక్కడ బస చేయాల్సి వుంటుంది. ఆస్ట్రేలియా పౌరసత్వంతో ఉపాధి అవకాశాలు ఎక్కువగా లభిస్తాయి. అందుకే సొంత చెల్లిని అన్నయ్య వివాహం చేసుకున్నాడు, దీంతో ఆమెకు ఆస్ట్రేలియా పౌరసత్వం లభించింది.

విచారణ లో బయటపడింది.. :

వీసా ఆఫీస్ లో సొంత అన్న చెల్లి పెళ్లి చేసుకున్నారని బయటపడింది, ఆస్ట్రేలియా పౌరసత్వం చెల్లెలికి కల్పియాలి అనే పెళ్లి చేసుకున్నట్టు అన్నయ్య తెలిపాడు. 6 ఏళ్లకు పైగా ఆస్ట్రేలియా లో బస చేసిన తనకు ఆస్ట్రేలియా పౌరసత్వం రావడంతో, తన చెల్లెల్ని కూడా ఆస్ట్రేలియా తీసుకొని వెళ్తే, తనకి పౌరసత్వం ఉంటే మంచి ఉపాధి వస్తుందనే ఉదేశ్యం తోనే వివాహం చేసుకున్నా అని తెలిపాడు.

తప్పయినా… :

ఆచారాలకు, శాస్త్రాలకు వ్యతిరేకమైనా ఎవ్వరు అడ్డు చెప్పకపోడం తో వివాహం చేసుకొని ఇరువురు ఆస్ట్రేలియా పౌరులు అయ్యారని పోలీసులు తెలిపారు. అయితే ఆస్ట్రేలియా కి వెళ్ళాక విడాకులు తీసుకొని కొత్త భాగస్వామి ని వివాహమాడతారని, అందుకే ఎవ్వరు పెళ్ళికి అభ్యంతరం చెప్పలేకపోయారని అక్కడ ఉన్న కొందరు వ్యక్తులు తెలుపుతున్నారు, ఏది ఏమైనా అన్న చెల్లెల్లు పెళ్లి చేసుకున్నారు అనే విషయం దేశ వ్యాప్తంగా వైరల్ అయ్యింది. గేమ్ అఫ్ థ్రోన్స్ లాగ గేమ్ అఫ్ పంజాబ్ అని కొందరు సోషల్ మీడియా లో కామెంట్స్ చేసారు.

 

Comments

comments

Share this post

scroll to top