ఆ బాలుడి చర్మం రోజురోజుకి “రాయిలా” మారుతూ వస్తుంది!…చికిత్సకు సహాయం చేయనుంది ఓ సింగర్!

స్పందించే హృద‌యం ఉండాలే గానీ… ఏ వ్య‌క్త‌యినా, ఎంత‌టి ఉన్న‌త స్థానంలో ఉన్నా… స‌హాయం కోసం ఆర్తిగా ఎదురు చూస్తున్న వారికి ఆప‌న్న‌హ‌స్తం అందించ‌వ‌చ్చు. నేనున్నానంటూ వారికి భ‌రోసా క‌ల్పించ‌వ‌చ్చు..! అదిగో… బ్రిట‌న్‌కు చెందిన ఆ పాప్ సింగ‌ర్ అలాగే చేసింది. ఎక్క‌డో ఏదో దేశంలో ఓ బాలుడు అరుదైన జెనెటిక‌ల్ వ్యాధితో బాధ‌ప‌డుతుంటే అత‌ని విషయం తెలుసుకుని స‌హాయం చేసేందుకు ముందుకు వ‌చ్చింది. ఆ బాలుని కోసం ఓ కాన్స‌ర్ట్ షో ఏర్పాటు చేసి త‌ద్వారా వ‌చ్చే నిధుల‌ను ఆ బాలునికే అంద‌జేయ‌నుంది..! ఇంత‌కీ ఆ సింగ‌ర్ ఎవ‌రంటే…

ramesh-kumari-1

అత‌ని పేరు ర‌మేష్ కుమారి. వ‌య‌స్సు 11 సంవ‌త్స‌రాలు. ఉంటోంది నేపాల్‌లోని ఖాట్మండు ప్రాంతం. అయితే అత‌ను అంద‌రు పిల్ల‌ల్లా ఉండ‌డు. అత‌ని శ‌రీరం మొత్తం రాయిలా ఉంటుంది. అందుకు కార‌ణం ఓ అరుదైన జెనెటిక‌ల్ వ్యాధే. అత‌ను పుట్టిన‌ప్పుడు అంద‌రు పిల్ల‌ల్లా సాధార‌ణంగానే పుట్టాడు. కానీ పుట్టాక 15 రోజుల‌కు అత‌నికి harlequin ichthyosis అనే ఓ అరుదైన జెనెటికల్ వ్యాధి సోకింది. దీంతో అత‌ని శ‌రీరం మొత్తం రాయిలా మార‌సాగింది. చ‌ర్మంపై మొత్తం ఫంగ‌స్ ఇన్‌ఫెక్ష‌న్ వ‌చ్చింది. ఈ క్ర‌మంలో ర‌మేష్‌ను అత‌ని త‌ల్లిదండ్రులు నంద‌, న‌ర్‌లు హాస్పిట‌ల్‌లో చూపించారు. అయితే ర‌మేష్ వైద్యం కోసం డ‌బ్బు బాగా ఖ‌ర్చ‌వుతుంద‌ని చెప్పారు. కానీ వారికి ఆ స్థోమ‌త లేదు. దీంతో ఆ బాలుడు చిన్న‌ప్ప‌టి నుంచి అలా రాయిలా మారుతూ వ‌స్తున్నాడు. అలా మారుతుండే స‌రికి అత‌ను ఎక్క‌డికీ క‌ద‌ల‌లేకుండా అయ్యాడు. ఉన్న‌చోటే ఉండ‌డం, ఎవ‌రైనా తీసుకెళ్తేనే వెళ్ల‌డం, లేక‌పోతే అంతే. దీంతోపాటు వ‌య‌స్సు పెరుగుతున్న కొద్దీ చ‌ర్మంపై ఇన్‌ఫెక్ష‌న్ కూడా ఎక్కువ కాసాగింది.

అయితే మొన్నా మ‌ధ్యే బ్రిట‌న్‌కు చెందిన పాప్ సింగ‌ర్ జాస్ స్టోన్ ర‌మేష్ గురించి తెలుసుకుంది. ఎలాగైనా తన జాస్ స్టోన్ ఫౌండేష‌న్ ద్వారా అత‌నికి సేవ‌లు అందించాల‌నుకుంది. వెంట‌నే అత‌న్ని క‌లిసేందుకు బ్రిట‌న్ నుంచి నేపాల్‌కు వెళ్లింది కూడా. అలా వెళ్లే క్ర‌మంలో ర‌మేష్‌కు ఆట వ‌స్తువులు, తిను బండారాలు తీసుకెళ్లింది. అయితే ఆమె అంత‌టితో ఆగ‌లేదు. ర‌మేష్ కు స‌హాయం చేయాల‌ని అనుకుంది. ఖాట్మండులో ఓ లైవ్ కాన్స‌ర్ట్ షోకు ప్లాన్ చేసింది. ఆ షో ద్వారా వ‌చ్చే డ‌బ్బుల‌న్నింటినీ ర‌మేష్ చికిత్స కోసం కేటాయించ‌నుంది. ఏది ఏమైనా… అలాంటి పాప్ స్టార్ ఆప‌న్న‌హ‌స్తం కోసం ఎదురు చూస్తున్న అలాంటి బాలుడికి స‌హాయం చేయ‌డ‌మంటే… నిజంగా ఆమెకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే..!

Comments

comments

Share this post

scroll to top