తెలుగు ఆప్యాయతకు ఫిదా అయిన బ్రిటీష్ ఎయిర్ వేస్…

అనురాగం, అప్యాయత, ప్రేమానురాగాలు అనే పదాలకు మన తెలుగు నేల ఎప్పటికీ నిలువెత్తు నిదర్శనం. ఈ మాట ఎవరో అన్నది కాదు. ప్రపంచంలోనే పెద్దన్నగా చలామణి అవుతున్న బ్రిటీష్ ఎయిర్ వేస్ సగర్వంగా ఓ వీడియో లో చెప్పిన మాట. బ్రిటీష్ ఎయర్ వేస్ ఫ్యుయెల్డ్ బై లవ్ అనే ట్రైబ్యూట్ వీడియో అందర్నీ ఆకట్టుకుంటుంది. ప్రతి ఒక్క ఇండియన్ ముఖ్యంగా తెలుగు ప్రజలందరూ గర్వించే విధంగా ఉంది ఈ వీడియో.

helena-story,-fb_647_020316111839

ఓ ఎయిర్ హోస్టెస్ ప్రయాణంలో  తనుకు  చేసిన సేవకు….ప్రతిగా ఓ భామ్మ తన ఇంటికి ఆహ్వానించడం, తన ఫ్యామిలీలో ఓ మెంబర్ గా ఆమెను ట్రీట్ చేయడం. తనచేత్తో చేసిన రుచికర వంటకాలను కొసరికొసరి మరీ వడ్డించడంతో  పాటు మన సాంప్రదాయ సంగీతాన్ని వినిపిస్తుంది.  వెళ్ళే ముందు ఎయిర్ హోస్టెస్ కు ఓ మంచి గిప్ట్ ను కూడా ఇస్తుంది. దీంతో ఆ ఎయిర్ హోస్టెస్ ఆ భామను ఆత్మీయ ఆలీంగనం చేసుకుంటుంది.  ఇదంతా ఓ వాస్తవ ఘటన ఆధారంగా రూపొందించబడిందని బ్రిటీష్ ఎయిర్ వేస్ సంస్థే తెలిపింది.

Watch Video:

 

Comments

comments

Share this post

scroll to top