హెల్మెట్ లేకుంటే ఫైన్ వేసే బదులు ఇలా చేయండి.! తప్పకుండా మార్పు వస్తుందంటూ సొంత అనుభవాలను రాసిన కుర్రాడు.

నా అనుభవంలోని ఓ విషయం మీకు చెబుతాను.నేను ప్రతి రోజూ LB నగర్ నుండి దిల్ సుఖ్ నగర్ కు DSC కోచింగ్ కు వెళుతుంటాను. అయితే ఓ పది రోజుల క్రితం మా ఫ్రెండ్ బైక్ మీద వెళ్లాను. అతను డ్రైవింగ్ చేస్తుంటే నేను వెనుక కూర్చున్నాను. కొత్తపేట సిగ్నల్ దగ్గరికి రాగానే పోలీసులు మా బైక్ ఆపారు, హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తున్నందుకు మోటర్ వెహికిల్ యాక్ట్ 129/177 ప్రకారం 200/- చలాన్ రాశారు. లేచిన వేళ బాలేదురా అనుకుంటూ ఆ రోజు కోచింగ్ కు వెళ్లి వచ్చేశాం. రెండు రోజుల తర్వాత మళ్లీ అదే రూట్ లో అలాగే వెళుతున్నాం. ఈ సారి కూడా అదే సీన్ రిపీట్ అయ్యింది. మళ్లీ ఓ 200 రూపాయల చలాన్ మా చేతిలో………………

22THCHALLAN_484330f

అదే రోజు మొత్తం 400/- ఈ-సేవలో డబ్బులు చెల్లించాం… మళ్లీ ఓ వారం తర్వాత అదే రూట్ లో మా కోచింగ్ కు వెళుతున్నాం. ఈ సారి క్లాస్ మద్యాహ్నం టైమ్ లో కావడంతో , ఏంట్రా బాబు ఈ ఎండ అనుకుంటూ రూమ్ లో నుండి బయలు దేరాం. ఈ సారి కూడా మా ఫ్రెండ్ హెల్మెట్ పెట్టుకురాలేదు. అతనిని చూసి ఒరేయ్ ఇప్పటికే 400/- కట్టావ్ ఇంకా హెల్మెట్ కొనలేదా. రా? అని అడిగాడు. లేదు రా.. రేపు కొంటానే లే, అయినా మద్యాహ్నం చెక్కింగ్ ఏం ఉండదు లేరా అంటూ దిల్ సుఖ్ నగర్ లోని మా కోచింగ్ సెంటర్ వైపుకు బైక్ కదిలింది.

దరిద్రం అంటే ఇదే కాబోలు ..ఈ సారి LB నగర్ సిగ్నల్ దాటగానే పోలీసులు మా బండిని పట్టుకున్నారు. మళ్లీ 200/- ఫైన్. అప్పుడే నాకో ఆలోచన తట్టింది. అదేంటంటే…

ప్రభుత్వ ముఖ్య ఉద్దేశ్యం ఏంటి? హెల్మెట్ పెట్టుకొని డ్రైవ్ చేయాలి. తద్వారా వాహనదారుడి ప్రాణాలను రక్షించుకోవాలి. ఇదే కదా.! హెల్మెట్ లేని వాళ్ళ నుండి చలాన్ల రూపంలో డబ్బులు వసూలు చేసి ప్రభుత్వ ఆదాయం పెంచాలని కాదు కదా.!? అలాంటప్పుడు మొదటి సారి హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తున్న వాహనదారుడి నుండి 200/- కు బదులు 500/- వసూలు చేసి అదే డబ్బుతో ఓ హెల్మెట్ ను వాళ్లే అందించాలి. మరోసారి హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తే మరోసారి 500/- వసూలు చేసి హెల్మెట్ అందివ్వాలి, సార్ నా దగ్గర ఆల్ రెడీ ఉందని చెప్పినా వినొద్దు…. మళ్లీ అలా దొరికితే మళ్లీ కొత్త హెల్మెట్.
ఇలా ఎన్నిసార్లు దొరికితే అన్ని కొత్త హెల్మెట్లు అందించాలి.

COP

ఇలా చేయడం వల్ల…. సదరు వాహనదారుడు చచ్చిన హెల్మెట్ లేకుండా రోడ్డు ఎక్కడు. చలాన్ కడితే రెండు రోజులు గుర్తుంటుంది. తర్వాత మర్చిపోతాడు. అదే కొత్త హెల్మెట్స్ అందిస్తుంటే వాటిని చూసినప్పుడల్లా చేసిన తప్పు గుర్తొస్తుంది. వద్దురా బాబోయ్ అని తప్పకుండా హెల్మెట్ తో రోడ్డెక్కుతాడు.

29-1456729396-helmet-hyderbad-765

మా స్టోరి మద్యలో ఆపాను కదా.. ఆ రోజు చలాన్ 200/- కట్టిన తర్వాత పక్కనే ఉన్న షో రూమ్ కు వెళ్లి మంచి స్టైలిష్ హెల్మెట్ ఒకటి నేనే మా ఫ్రెండ్ కు కొనిచ్చా.!  ఇలా చేయాలన్నది నా డిమాండ్ కాదు,కేవలం ఇది నాకు వచ్చిన ఐడియా. బాగుంటే ఓ సారి ఆలోచించి ఆచరణ లో పెడితే మంచి ఫలితాలోస్తాయనేది నా విన్నపం. ఉంటాను ఫ్రెండ్స్… సెలవు. వెళ్లి  DSC కి ప్రిపేర్ అవ్వాలి.

Comments

comments

Share this post

scroll to top