అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన గిరీష్ భరధ్వాజ్ సక్సెస్ స్టోరి.

Siva Kumar

రెండు గ్రామాలు…. చుట్టూ నీరు.. ఎలాగైనా ఆ ఊరిని కలుపుతూ ఈ రెండూర్లకు దారిని రూపొందించాలి. ఏం చేయాలి? ఎలా చేయాలి? ఇలాంటి ప్రశ్నలు గిరీష్ భరద్వాజ్ మదిలో మెదులుతున్నాయి. ఆ ఆలోచనలకు అనుగుణంగానే అతని పనులు స్టార్ట్ అయ్యాయ్…. చివరకి తన ప్రయత్నంలో సూపర్ సక్సెస్ అయ్యాడు గిరీష్..ఆ సక్సెస్ స్టోరి ఇప్పుడు చదువుదాం…..

కర్ణాటకలోని  మాండ్యలో 1973లో పి.యి. ఎస్. ఇంజినీరింగ్ కళాశాలలో  మెకానికల్ ఇంజినీర్ గా పట్టభద్రుడయ్యాడు గిరీష్ భరద్వాజ్. గిరీష్ తండ్రి వ్యవసాయ యంత్రాలను రూపొందిస్తూ వర్క్ షాప్స్ నిర్వహిస్తుండేవాడు. మొదటినుండీ తండ్రినే ఇన్స్పిరేషన్ గా తీసుకొని ముందుకెళ్తున్న గిరీష్, తన తండ్రి మాట ప్రకారం సులియాలో జరుగుతున్న వర్క్ షాప్ కు వెళ్ళాడు. గిరీష్ ఆలోచనలు, అతనిలోని  కసిని చూసిన ఫారెస్ట్ ఆఫీసర్ నారాయణ్ ఇతడి ప్రతిభ ఈ అడవికే పరిమితం కాకూడదని, సులియా నుండి కుషాల్ నగర్ కు పంపించాడు. కుశాల్ నగర్ లోని నిసర్గాధం ఐస్ ల్యాండ్ నుండి మెయిన్ ల్యాండ్ కు దారిని నిర్మించటం వీలవుతుందా? అని ఒకరోజు ఆ ఆఫీసర్ ను అడిగాడు. వాటి మధ్య దూరం సుమారు 50 మైళ్లు. భూభాగంపైన పెద్ద వంతెన నిర్మించాలనుకున్నాడు. చుట్టూ నీరు, రెండు వైపులా చెట్లు. ఈ విషయం తన స్నేహితుడు లక్ష్మణన్ జూలాతో తెలిపాడు. రెండిటి మధ్యనా.. వంతెన నిర్మించాలని. పెద్ద చెక్కపలకలతో,వైర్ తాళ్ళను ఉపయోగించి రెండు వైపులా ఉక్కు ఊచలను ఏర్పాటు చేసి వంతెన నిర్మించాడు. ఇది పరిశీలించిన ఆ ఆఫీసర్ బాగాలేదని మొహంమీదే చెప్పేశాడు. ప్రయత్నం చేసినా ఫలితం లేదని అన్నాడు.
మళ్ళీ ప్రయత్నించాడు. పాదచారులు సులువుగా నడిచేలా చేయాలని ప్రయత్నం మొదలుపెట్టాడు. తను చదివిన చదువు, పుస్తకాలను ఒక్కసారి తిప్పేశాడు. అప్పుడు గిరీష్ భరద్వాజ్ కు ఒక ఆలోచన తట్టింది. గోల్డెన్ గేట్ నిర్మాణాన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని, ఆ పుస్తకాలను చదివి, ఆ పద్ధతినే ఇక్కడా ఉపయోగించాడు.
1724778_836942893102098_6664984643297336126_n
ఇక్కడి ప్రజల దగ్గర నుండి డబ్బులు తీసుకొని, ఆ బ్రిడ్జి నిర్మాణాన్ని పూర్తిచేయాలనుకుంటే, వారే దయనీయమైన స్థితిలో ఉన్నారు. అయినా సరే వారికి తోచినంత ఉన్నదాంట్లో బ్రిడ్జి నిర్మాణానికి జోలపట్టారు, ఇంటింటికీ తిరిగి డబ్బులు కలెక్ట్ చేశారు. బ్రిడ్జి నిర్మాణానికి  కావాల్సిన రోలింగ్ మిషన్ లను అక్కడికి తీసుకువచ్చారు. 40 మంది వాలంటీర్లను పనిచేయడానికి నియమించాడు.ఆడవాళ్ళు.. వాళ్ళకు కావాల్సిన తిండి, టీ అందించేవారు. రెండు నెలలు పూర్తికాగానే గిరీష్ భరద్వాజ్ కలలుగన్న ప్రాజెక్ట్ 1989 ఆగస్ట్ లో పూర్తి అయింది. తను నిర్మించిన బ్రిడ్జిని చూడటానికి తన స్నేహితులను, కుటుంబ సభ్యులను ఆహ్వానించాడు. గిరీష్ చేసిన పనికి అందరూ కృతఙ్ఞతలు తెలిపారు. ఆ రిస్కీ ప్రాజెక్ట్ ను అప్పట్లో సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసి వారందరి ముందూ ఒక హీరో అయ్యాడు. నిజమే కదా.

Comments

comments