తాళి కట్టే ముందు డ్రైనేజీ లో పడ్డ పెళ్లి కొడుకు. అసలేమైందంటే…!!

ఢిల్లీ దేగ్గర్లోని నోయిడాలో హోషియార్‌పూర్‌‌కి చెందిన ఒక కుటుంబం కథ ఇది, కొడుకు పెళ్లి కోసం అని మంచి ఫంక్షన్ హాల్ బుక్ చేసారు. రోడ్ కి ఫంక్షన్ హాల్ కి మధ్యలో పెద్ద డ్రైనేజీ ఉండటం తో ఆ డ్రైనేజీ పైన ఒక చెక్క వంతెన వేపించాడు ఫంక్షన్ హాల్ ఓనర్. పెళ్లి సమయానికల్లా పెళ్లి కూతురు తరుపు వాళ్ళు, పెళ్లి కూతురు ఫంక్షన్ హాల్ లో ఉన్నారు.

అరే హో… విరిగిపాయె… :

పెళ్ళికొడుకుని ధూమ్ దాంగ తీసుకొని వస్తున్నారు, పెళ్లి అంటేనే హుషారు కనుక, అందరూ డ్యాన్స్ లు వేస్తూ పెళ్లి కొడుకుని ఊరేగిస్తూ తీసుకొని వస్తున్నారు, ఆ హుషారు లో వంతెన చెక్కదని కూడా మర్చిపోయారు జనాలు, వంతెన మీద కూడా గట్టిగ చాలా మంది ఎగరడం తో వంతెన విరిగిపోయింది, దీంతో డ్యాన్స్ వేస్తున్న వారు, వంతెన మీద ఉన్న వారు అందరూ డ్రైనేజీ లో పడిపోయారు, పెళ్ళికొడుకు కూడా వంతెన మీదే ఉండటంతో డ్రైనేజీ లో పడిపోయాడు.

అదృష్టవశాత్తు.. :

తాళి కట్టే సమయం ముందు ఇలా జరిగిందేంటని చాలా మంది అనుకున్నారు, అదృష్టవశాత్తు ప్రాణ హాని జరగలేదు, డ్రైనేజీ లో పడ్డ 15 మందిని క్షేమంగా బైటికి తీసుకువచ్చారు, పెళ్లి కొడుకు వంటి మీద ఉన్న నగల్లో కొన్ని డ్రైనేజీ లో కొట్టుకొని పోయాయి, ఫంక్షన్ హాల్ ఓనర్ పైన పెళ్లి కొడుకు, పెళ్లి కూతురి బంధువులు విరుచుకుపడ్డారు, దీంతో ఆయన 3 లక్షలు వెనక్కి ఇచ్చాడు, ఆ తరువాత కొద్ది సేపటికి వరుడు తాళి కట్టాడు, పెళ్లి కి ముందు గుంట లో పడినా పెళ్లి చేసుకున్నాడు అంటే, ఆడు మగాడ్రా బుజ్జి.

 

Comments

comments

Share this post

scroll to top