ఊరేగింపులో పెళ్లి కొడుకు డాన్స్ చేస్తూ సడన్ గా…ఎలా మరణించాడో తెలుసా..?

పెళ్లి అంటే సంబరాలు ఎలా ఉంటాయో తెలిసిందే. అందులోను పెళ్లి కొడుకు ఊరేగింపు అంటే సందడే సందడి. పెళ్లి కొడుకు కూడా డాన్స్ చేసేస్తారు. కానీ ఒక పెళ్లి ఊరేగింపులో ఎలాంటి అపశ్రుతి నెలకొందో తెలుసా..? ఇళ్లంతా సందడి.. వీధంతా హడావిడి.. బాజాభజంత్రీలతో ఘనంగా జరుగుతుంది వేడుక. పెళ్లి కొడుకు అయితే ఓ స్నేహితుని భుజంపైకి ఎక్కి ఊరేగుతున్నాడు. ధూమ్ ధామ్ అని డాన్స్ చేస్తూ ఉన్నాడు. సడన్ గా ఒక్కసారి కుప్పకూలి పోయాడు. బాలన్స్ అవ్వక కిందకి తూలాడేమో అనుకోని స్నేహితుడు గమనించకుండా డాన్స్ చేస్తూనే ఉన్నారు. తర్వాత ఎంత పలకరించిన అతను స్పందించలేదు!

పరిశీలించి చూస్తే తెలిసింది.. అతను సృహలో లేడని.. అతని ఊపిరి ఆగిపోయింది. ఈ ఊహించని విషాధ ఘటన గుజరాత్ లో చోటుచేసుకుంది. వడోదరలోని రెనోలి గ్రామంలో పెళ్లి మండపానికి బయలుదేరిన పెళ్లి కొడుకు మధ్యలోనే ప్రాణాలు వదిలాడు. స్నేహితులు పెళ్లికొడుకును భుజంపైకి ఎక్కించుకుని.. బరాత్ ఆడుతుండగా ఒక్కసారిగా గుండెపోటు రావడంతో కుప్పకూలిపోయాడు. ఎంత పలకరించిన స్పందించకపోవడంతో బంధువులు హాస్పిటల్ కు తీసుకెళ్లారు. డాక్టర్లు పరీశిలించి పెళ్ళికొడుకు మరణించాడని చెప్పారు. కార్డియాక్ అరెస్ట్ కారణంగా మరణించాడు!

watch video here:

Comments

comments

Share this post

scroll to top