గడ్డలు మాత్రమే కాదు… బ్రెస్ట్ క్యాన్సర్ ను గుర్తించడానికి మనకు తెలియని ఎన్నో సంకేతాలు!

క్యాన్సర్ పేరు వింటేనే ఏదో తెలియని భయం కలుగుతుంది..మహిళల్లో సాధారణంగా కనిపించే క్యాన్సర్ బ్రెస్ట్ క్యాన్సర్.. రొమ్ము క్యాన్సర్ ఇటీవల ఎంతో మందిని అటాక్ చేసింది… ముందుగా గుర్తిస్తే దీన్ని ఎదుర్కోవడం కష్టమేం కాదంటున్నారు డాక్టర్లు..కేవలం రొమ్ములో గడ్డలు మాత్రమే కాదు ..రొమ్ము క్యాన్సర్ ను గుర్తించడానికి అనేక సంకేతాలున్నాయి..అవేంటో తెలుసుకోండి…

  • బ్రెస్ట్ పైన ఏదైనా సొట్టలా ఏర్పడితే దాన్ని బ్రెస్ట్ క్యాన్సర్ కి సంకేతంగా భావించొచ్చు..రెండు వైపులా ఇలా సొట్టలా వచ్చినట్టయితే మన ఒంట్లో ఉన్న కొవ్వు కరగడం దానికి కారణం..ఒకే వైపు సొట్ట ఏర్పడితే మాత్రం డాక్టర్ ని సంప్రదించాలి..

  • చర్మం నునుపుగా ఉండకుండా చాలా రఫ్ గా మారుతుంది.అంతే కాదు చర్మం సాగి చర్మం పై ఉండే చిన్న చిన్న రంధ్రాలు కూడా పెద్దవిగా కనిపిస్తాయి..ఇది కూడా బ్రెస్ట్ క్యాన్సర్ కు సంకేతం..
  • రెండు వక్షోజాలలో ఒకటి వాచినట్టు గా లేదా సాగినట్టుగా అన్పించినా,చర్మం రెడ్ గా ఉన్నా,దద్దుర్లు,నొప్పి ఉన్నా క్యాన్సర్ గా అనుమానించాల్సిన అవసరం ఉంది.చాలా మంది వక్షోజాలు రెండు ఒకే పరిమాణంలో ఉండవు..కానీ ఈ మార్పు అనేది నెమ్మదిగా జరుగుతుంది కాబట్టి గమనించొచ్చు..
  • నిప్పుల్ షేప్ లో మార్పు వచ్చినా..రొమ్ములోకి చొచ్చుకుపోయినట్టుగా అన్పించినా క్యాన్సర్ గా భావించాలి..కొంతమందికి పుట్టుకతోనే నిప్పల్స్ రొమ్ములోకి ఉన్నట్టుగా ఉంటాయి..తర్వాత తర్వాత మారతాయి..అలా ఉన్నవాల్లు కాకుండా మధ్యలో ఏదైనా మార్పు వస్తే గమనించాలి..
  • చనుమెనల నుండి ఏవైనా ద్రవాలు స్రవిస్తున్నట్టు అప్రమత్తంగా ఉండడం అవసరం.ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు లేదా పసిపిల్లలకు పాలిచ్చే వారు కాకుండా ఉన్నప్పుడు మీ చనుమొనలనుండి ఏవైనా ద్రవాలు స్రవిస్తున్నట్టుగా ఉంటే డాక్టర్ ను సంప్రదించాలి.

Comments

comments

Share this post

scroll to top