డ్యామ్ పగిలి ఊరికి ఊరే కొట్టుకుపోయింది.!

డ్యామ్ పగిలి ఊరికి ఊరే కొట్టుకుపోయిన ఘటన బ్రెజిల్ లో జరిగింది. బ్రెజిల్ లో ఓ మైనింగ్ కంపెనీకి చెందిన డ్యామ్ పగిలిపోవడంతో ఓ గ్రామం  పూర్తిగా దెబ్బతింది, వాహనాలు, ఇల్లులు ఈ ప్రవాహంలో కొట్టుకుపోయాయి.నీటితో పాటు బురద ప్రవాహం ఎక్కువగా ఉండడంతో  దాని నుండి తప్పించుకునేందుకు ఆ గ్రామ ప్రజలు ఇంటిపై కప్పులపైకి, చెట్లపైకి ఎక్కి . సహాయం కోసం ఎదురు చూస్తున్నారని  అక్కడి  ఛానల్స్‌ వెల్లడించాయి . బ్రెజిల్ ప్రభుత్వం కూడా  బాధితులకు సహాయం అందించేందుకు  పౌర సహాయక బృందాలను  ఆ ప్రాంతానికి పంపింది కానీ… విమానాలు ఆ ప్రదేశంలో ల్యాండ్ అవ్వడానికి  పరిస్థితులు ఏమాత్రం అనకూలంగా లేకపోవడం తో సహాయ చర్యలు కష్టమవుతున్నాయి. . ఈ ప్రమాదంలో  కనీసం 17 మంది మరణించినట్లు, మరో 50 మందికి పైగా గాయాలయినట్టు తెలుస్తోంది.  చాలా మంది ఈ ప్రవాహానికి కొట్టుకుపోయారని కూడా సమాచారం అందుతోంది.

Watch Video:

 

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top