అది మణిపూర్ రాజధాని ఇంపాల్ లో రద్దీగా ఉండే మార్కెట్ లలో ఒకటి. ఉదయాన్నే హడావుడి స్టార్ట్ అయ్యింది. కస్టమర్ల రాకతో మార్కెట్ అంతా బిజీబిజీగా మారింది. అదే సమయంలో మిలిటెంట్లు మాస్క్ లు ధరించి ఆ మార్కెట్ లోకి చొరబడ్డారు. మార్కెట్ లోని ఓ షాప్ లో గ్రెనేడ్ విసిరి పారిపోయారు. మిలిటెంట్లు గ్రెనేడ్ విసరడాన్ని చూసింది 11 యేళ్ళ మైబమ్ ప్రీతి దేవి , ఆ పాప ఆ షాప్ ఓనర్ కూతురు. వెంటనే మైబమ్ మిలిటెంట్లు విసిరిన ఈ గ్రెనేడ్ ను పట్టుకొని జనాలకు దూరంగా పరిగెడుతుంది. అప్పటి వరకు షాప్ లో బుద్దిగా కూర్చున్న మైబమ్ అలా పరిగెడుతుంటే ఆమె తండ్రి ఏమయ్యిందా అని బయటికి వచ్చి చూస్తున్నాడు. మైబమ్ ఆ గ్రెనేడ్ ను జనాలకు దూరంగా విసరడం…అది విస్పోటనం చెందడం…మైబమ్ కు తీవ్ర గాయాలవ్వడం ..అంతా క్షణాల్లో జరిగిపోయింది.

ఒకవేళ అదే గ్రెనేడ్ గనక ఆ షాప్ లో పేలిఉంటే…ఆ షాప్ లో ఉన్న కస్టమర్లతో పాటు మార్కెట్ లో ఉన్న చాలా మంది ప్రాణాలకే ముప్పు వాటిల్లేది. ఇంతటి సాహసానికి ఒడిగట్టిన ప్రీతిదేవిని అందరూ ప్రశంసిచారు. ఈ ఘటన తర్వాత ప్రీతి చెప్పిన సమాధానం చూస్తే ఆమె ధైర్యానికి నిజంగా హ్యాట్సాఫ్ చెప్పాలనిపిస్తుంది. పోలీస్ కావడమే నాలక్ష్యం.. పోలీస్ అయ్యి మా ప్రాంతంలోని మిలిటెంట్లను ఏరిపారేస్తానని ధైర్యంతో చెబుతుంది ప్రీతి.
ఈ సాహసానికి గాను ప్రీతిదేవికి 2009 లో అప్పటి రాష్ట్రపతి ప్రతిభాపాటిల్ చేతుల మీదుగా సాహస బాలుర అవార్డ్ లభించింది.