తండ్రి మరణంతో అనాధలా మారిన గుండు కొడుకు..! అతని పెళ్లి భాద్యత ఎవరు తీసున్నారో తెలిస్తే శభాష్ అంటారు!

గత కొంతకాలంగా అనారోగ్యంతో బాదపడుతున్న గుండు హనుమంతరావు మృతి టాలివుడ్ కి తీరని లోటు.సుమారు 400 సినిమాల్లో హాస్యనటుడిగా  నవ్వులు పంచిన గుండు హనుమంతరావు  ఇకలేరు అనే వార్త జీర్ణించుకోవడం సినిమావారితో పాటు,అభిమానులకు సాధ్యం కావడంలేదు.అమృతం అంజిగా అతడు పండించిన కామెడిని ఎవరూ మర్చిపోలేరు. రిపీటెడ్ గా అన్ని ఛానెల్స్లో ప్రసారమైన ఈ ధారావాహిక ఇప్పటికీ ఆదరణ తగ్గలేదంటే అందులో గుండు హనుమంతరావు పండించిన కామెడి కూడా ఒక కారణం. గుండు హనుమంతరావు మృతితో తన కొడుకు అనాధయ్యాడు..

గత కొంతకాలంగా ఆయన కిడ్నీ సమస్యతో బాదపడుతున్నారు.భార్య ఝాన్సీ మరణం అతన్ని మరింత కృంగదీసింది అని చెప్పొచ్చు..ఎమ్ఎస్ చదువుతున్న కుమారుడు ఆదిత్య శాయి విద్యను,ఉద్యోగాన్ని కాదనుకుని వచ్చి నాలుగేళ్లుగా తండ్రిని కంటికి రెప్పలా చూసుకుంటున్నారు.ఎన్నో  పాత్రలతో అలరించిన గుండు హనుమంతరావు నాలుగు రాళ్లు వెనకేసుకోలేకపోవడం,తన అనారోగ్యానికి వైధ్యం చేయించుకోవడానికి కూడా మా అసోసియేషన్,తెలంగాణ ప్రభుత్వం ఇతరులు సాయం చేయడం జరిగింది..కిడ్నీ సమస్యకు ఆపరేషన్ చేయించుకున్న గుండు హనుమంతరావు కోలుకుని ఆరోగ్యంగా ఉంటారని అందరూ భావించారు.కానీ ఇంతలోనే ఇప్పుడు ఇలా జరిగింది.

తల్లిలేదు..ఇప్పుడు తండ్రి కూడా లేకపోవడంతో గుండు హనుమంతరావు కొడుకు అనాధయ్యాడు.సోదరి హరిప్రియ బ్రెయిన్ ఫీవర్ తో మరణించింది.తనకంటూ కుటుంబం లేకుండా పోయింది ఆదిత్య శాయికి.అనారోగ్యానికి ఇప్పటికే చాలామంది ఆర్ధిక సహాయం చేశారు.. అంతేకాదు గుండుహనుమంతరావు కుమారుడికి ఉద్యోగం ఇప్పిస్తానని ఆలి హామి ఇచ్చారు.మరోవైపు ఆదిత్య శాయి వివాహ బాద్యతలను బ్రహ్మానందం స్వీకరించారు.ఏదేమైనప్పటికి కళామతల్లికి వీరందరూ కన్నబిడ్డలే ..ఒక కుటుంబ సభ్యులే..అందుకే ఇప్పుడు అనాధలా మారిన ఆనంద శాయికి అందరూ తోడు నిలవడం సంతోషించాల్సిన విషయం.

Comments

comments

Share this post

scroll to top