బోయపాటి దర్శకత్వంలో వచ్చిన “జయ జానకి నాయక” హిట్టా.? ఫట్టా..? స్టోరీ, రివ్యూ & రేటింగ్ (తెలుగులో)

Movie Title (చిత్రం): జయ జానకి నాయక (jaya janaki nayaka )

Cast & Crew:

 • నటీనటులు: బెల్లంకొండ శ్రీనివాస్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రగ్య జైస్వాల్, కాథరిన్, జగపతి బాబు, తరుణ్ అరోరా, తదితరులు
 • సంగీతం: దేవిశ్రీ ప్రసాద్
 • నిర్మాత: మిర్యాల రవీందర్ రెడ్డి (ద్వారకా క్రియేషన్స్)
 • దర్శకత్వం: బోయపాటి శ్రీను

Story:

జీవితంలో ఎంతో సాదించాలి అని ఎన్నో గోల్స్ పెట్టుకుంటాడు “శ్రీనివాస్” (బెల్లంకొండ శ్రీనివాస్). శరత్ కుమార్, ప్రగ్య జైస్వాల్, ఆది పినిశెట్టిలు శ్రీనివాస్ గమ్యం చేరడానికి సాయపడుతుంటారు. ఇంతలో “రకుల్ ప్రీత్ సింగ్ (జానకి)” శ్రీనివాస్ ప్రేమలో పడుతుంది. కానీ శ్రీనివాస్ జానకిని ప్రేమించాడు. శ్రీనివాస్ క్యారెక్టర్ మార్చాలి అనుకుంటుంది జానకి. ఈ క్రమంలో జానకితో ప్రేమలో పడిపోతాడు శ్రీనివాస్. ఇంతలో అనుకోని దుర్ఘటన జానకి జీవితంలో చోటు చేసుకుంటుంది. జానకిని చంపాలని కొందరు ప్రయత్నిస్తుంటారు. వారి నుండి శ్రీనివాస్ జానకి కాపాడాడా? అసలు చంపాలనుకుంది ఎవరు? ఎందుకు చంపాలి అనుకున్నారు? ఈ ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే “జయ జానకి నాయక” చిత్రం చూడాల్సిందే!

Review:

సరైనోడు లో ఎమోషన్స్ టచ్ చేసి పర్లేదు అనిపించుకున్న బోయపాటి ఈ సినిమా లవ్ ఎలిమెంట్ ని ట్రై చేస్తున్నారు. రిషి పంజాబీ అందించిన విజువల్స్ మాత్రం చాలా రిచ్ గా ఉన్నాయి. హీరో బెల్లంకొండ శ్రీనివాస్ లుక్స్ స్టైలిష్ గా, బాడీ ఫిట్ గా ఉన్నప్పటికీ రత్నం రాసిన డైలాగ్స్ లోని పవర్ అతని వాయిస్ లో పూర్తిగా ఎలివేట్ కాలేదు అనే ఫీలింగ్ మాత్రం కలుగుతుంది. ఇక దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ మాత్రం సీన్స్ లోని కంటెంట్ కి మెయిన్ ఎస్సెట్ గా నిలిచింది. ఈ సినిమా ప్రొడ్యూసర్ మిర్యాల రవీందర్ రెడ్డి ఖర్చుకు వెనకాడకుండా బోయపాటి ని నమ్మి ఫుల్ గా ఖర్చుపెట్టారు. అందుకే ప్రతి ఫ్రేమ్ చాలా రిచ్ గా కనిపిస్తుంది. రామ్-లక్ష్మణ్ కంపోజ్ చేసిన ఫైట్స్ సినిమాకి హైలైట్ గా నిలిచేలా కనిపిస్తున్నాయి. ఇక సీనియర్ హీరో శరత్ కుమార్ పాజిటివ్ క్యారెక్టర్ లో సాఫ్ట్ గా కనిపిస్తే లెజెండ్ సినిమాతో స్టైలిష్ విలన్ గా కొత్త అవతారం ఎత్తిన జగపతి బాబు మరో సారి ఫెరోషియస్ బాడ్ మ్యాన్ గా కనిపిస్తున్నాడు. క ఈ మధ్య తన అందాల ప్రదర్శనతో ప్రతి సినిమాకి తనవంతు సహకారం అందిస్తున్న కేథరిన్ కవ్వింస్తుంటే, నక్షత్రం సినిమాతో తనలోని గ్లామరస్ యాంగిల్ ఓపెన్ చేసిన ప్రగ్య కూడా మోడరన్ డ్రెస్సులు వేసి అదరహో అనిపిస్తుంది. ఇక అన్నిటికంటే ముఖ్యం..ఈ సినిమాకి మెయిన్ హార్ట్ “రకుల్”. సినిమా మొత్తం తన చుట్టూనే తిరుగుతుంది.

Plus Points:

 • రకుల్ ప్రీత్
 • ప్రొడక్షన్ వాల్యూస్
 • దేవిశ్రీప్రసాద్ సంగీతం
 • డైలాగ్స్
 • శ్రీనివాస్ డాన్స్
 • ఫైట్స్
 • సాంగ్స్
 • ప్రగ్య జైస్వాల్, కాథరిన్ గ్లామర్
 • శరత్ కుమార్, జగపతి బాబు, తరుణ్ అరోరా యాక్టింగ్

Minus Points:

 • ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడంలో ఫెయిల్ అయ్యాడు శ్రీనివాస్
 • డైలాగ్స్ కూడా అంత పర్ఫెక్ట్ గా చెప్పలేకపోయాడు
 • సింపుల్ స్టోరీ.

Final Verdict:

కమర్షియల్ ఎలెమెంట్స్ తో నిండిన లవ్ ఆక్షన్ ఎంటర్టైనర్ “జయ జానకి నాయక”

AP2TG Rating: 2. 5 / 5

Trailer:

https://www.youtube.com/watch?v=uqkojQeXkZ8 –

Comments

comments

Share this post

scroll to top