వినయ విధేయ నష్టాల గోల.. 5 కోట్లు ఇవ్వను అంటున్న బోయపాటి, పుకార్లు నిజమేనా.?

మెగా పవర్ స్టార్ హీరో గా నటించిన వినయ విధేయ రామ సినిమా భారీ డిజాస్టర్స్ లో ఒకటిగా నిలిచిపోయింది, వినయ విధేయ రామ సినిమా 30 నుండి 40 కోట్ల వరకు నష్టాలను మిగిల్చింది అని సమాచారం, ఓవర్సీస్ లో వినయ విధేయ రామ సినిమా ని కొన్న డిస్ట్రిబ్యూటర్ నిండా మునిగాడు. ఇక సినిమాను కొన్న డిస్ట్రిబ్యూటర్స్ కు రామ్ చరణ్ 5 కోట్లు ఇచ్చాడని సమాచారం.

నువ్వు కూడా ఇవ్వు, బోయపాటి కూడా ఇవ్వాలి.. :

నిర్మాత దానయ్య తో కూడా రామ్ చరణ్ సంప్రదింపులు జరిపి దానయ్య ను కూడా డిస్ట్రిబ్యూటర్ లకి 5 కోట్లు ఇవ్వమని తెలిపాడంట, ఇందుకు దానయ్య అంగీకరించడం తో దానయ్య 5 కోట్లు రామ్ చరణ్ 5 కోట్లు డిస్ట్రిబ్యూటర్ లకి తిరిగిచ్చారు అంట. బోయపాటి కి ఇక్కడే చిక్కు వచ్చి పడింది. బోయపాటి సినిమాలు అంటే మాస్ జనాలకు పండగే, బోయపాటి సినిమాల్లో యాక్షన్ సన్నివేశాలు అదరహో అనే రేంజ్ లో ఉంటాయి, కొడితే ఎగిరి పడే సీన్స్ అయితే చాలానే ఉంటాయి, వినయ విధేయ రామ చిత్రం లో కూడా అలాంటి సీన్స్ చాలానే ఉన్నాయ్, కానీ కేవలం రెండు మూడు సీన్స్ మాత్రమే జనాలను ఆకట్టుకున్నాయి వినయ విధేయ రామ సినిమాలో, ఆ రెండు మూడు సీన్ లు మినహా మిగిలిన సినిమా అంత జనాలను ఆకట్టుకోలేదు.

నేనివ్వా.. :

రామ్ చరణ్, బోయపాటి ని కూడా డిస్ట్రిబ్యూటర్లకు 5 కోట్లు ఇవ్వమని అడిగినట్టు సమాచారం. అయితే బోయపాటి అంత ఇవ్వలేనని తెలిపాడంట, దీంతో దానయ్య రంగంలోకి దిగి, వినయ విధేయ రామ సినిమాకు 15 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నావ్, అందులో 5 కోట్లు తిరిగిస్తే ఏమవుతుందని అడగ్గా ఇద్దరి మధ్య కొట్లాట జరిగిందని సమాచారం, సినీ పెద్దల సమక్షం లోనే వాగ్వాదం జరిగిందని, బూతులు కూడా తిట్టుకున్నారు ఇరువురు అని వినిపిస్తున్న పుకారు, అయితే బహిరంగంగా అయితే ఎటువంటి వార్త బయటకు రాలేదు, అయితే ఇవి కేవలం పుకార్లేనా, లేక నిజంగానే జరిగిందా అని మెగా అభిమానుల్లోనే కాదు, సామాన్య ప్రజల్లో కూడా నెలకొన్న సందేహం.

 

Comments

comments

Share this post

scroll to top