బాలుడి ప్రాణాలు పోతున్నా… సెల్ఫీలు దిగ‌డంలో మునిగిపోయారు..!

నేటి త‌రుణంలో సోష‌ల్ మీడియా పిచ్చి ఏ పీక్స్‌కు చేరిందంటే… దాని మాయ‌లో ప‌డి చేయ‌కూడ‌ని ప‌నులు చేస్తున్నారు. వేల కొద్దీ లైక్‌లు, కామెంట్లు తెప్పించుకోవ‌డం కోసం ఏ ప‌ని చేయ‌డానికైనా వెనుకాడ‌డం లేదు. మ‌రీ… ఈ మ‌ధ్య సెల్ఫీ అనే ఓ కొత్త మాయ రోగం వ‌చ్చిందిగా… ఇక దాని మోజులో ప‌డి ప్రాణాల మీద‌కే తెచ్చుకుంటున్నారు. కొంద‌రు సెల్ఫీలు దిగుతూ మృతి చెందిన సంద‌ర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడు చెప్ప‌బోయేది కూడా దాదాపుగా ఇలాంటి ఓ సంఘ‌ట‌న గురించే. కానీ ఈ సంఘ‌ట‌న‌లో సెల్ఫీలు దిగిన వారు మాత్రం బాగానే ఉన్నారు. కానీ జ‌రిగింది ఏంట‌య్యా అంటే… అవ‌త‌ల ఓ బాలుడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నా… స‌ద‌రు వ్య‌క్తులు సెల్ఫీ మోజులో ప‌డి ఆ బాలున్ని ప‌ట్టించుకోలేదు. దీంతో ఓ నిండు ప్రాణం బ‌లైంది. ఈ ఘ‌ట‌న జ‌రిగింది బెంగుళూరులో…

boy-selfie

బెంగుళూరులోని లాల్‌బాగ్ పార్కుకు స్థానికంగా నివాసం ఉండే కుమార్ అనే వ్య‌క్తి త‌న భార్య రేవ‌తి, కొడుకు విక్రం, ఇత‌ర బంధువుల‌తో క‌లిసి వ‌చ్చాడు. అయితే పార్కులో ఎవ‌రి ఆనందంలో వారే మునిగి ఉన్నారు. ఈ క్ర‌మంలో బాలుడు విక్రం పార్క్‌లో పెట్టిన ఓ కాంక్రీట్ స్తంభం వ‌ద్ద ఆడుకుంటున్నాడు. అక్క‌డికి కొద్ది దూరంలోనే కొంద‌రు అదే ప‌నిగా సెల్ఫీలు దిగుతున్నారు. అయితే స‌ద‌రు కాంక్రీట్ స్తంభం ఒక్క సారిగా కింద ప‌డింది. దీంతో ఆ స్తంభం కింద విక్రం ఇరుక్కుపోయాడు. కానీ ప‌క్క‌నే సెల్ఫీలు దిగుతన్న వారు మాత్రం ప‌ట్టించుకోలేదు. దీంతో ఆ బాలుడికి తీవ్ర‌గాయాలై చ‌నిపోయాడు. అత‌ని త‌ల్లిదండ్రులు, బంధువులు అక్క‌డికి వ‌చ్చే స‌రికి జ‌రగాల్సిన న‌ష్టం జ‌రిగిపోయింది. ఓ నిండు ప్రాణం బ‌లైంది.

అయితే బాలుడు అలా చ‌నిపోయినా స‌ద‌రు వ్య‌క్తులు సెల్ఫీలు దిగ‌డం ఆప‌లేదు. దీంతో అక్క‌డికి వ‌చ్చిన సంద‌ర్శ‌కుల‌కు, ఆ వ్య‌క్తుల‌కు మ‌ధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. పార్క్ సిబ్బంది క‌ల‌గ‌జేసుకోవ‌డంతో వివాదం స‌ద్దు మ‌ణిగింది. ఏది ఏమైనా మ‌నుషుల ప్రాణాల‌ను తీస్తున్న సెల్ఫీల‌పై మాత్రం ఏదో ఒక విధంగా ఎవ‌రో ఒక‌రు చ‌ర్య‌లు తీసుకోవాల్సిందే. లేదంటే ఇంకా ఎంద‌రు ఇలా బ‌ల‌వుతారో ఏమో..! అయినా మ‌నుషుల్లో ఉన్న మాన‌త్వం సోష‌ల్ మీడియా కార‌ణంగా మంట‌గ‌లుస్తుంద‌న‌డానికి ఇదొక ప్ర‌త్య‌క్ష నిద‌ర్శ‌నం..!

Comments

comments

Share this post

scroll to top