ప్రేయ‌సి మాట్లాడే ప‌లు ప‌దాల‌ను గ‌మ‌నిస్తే ప్రియుడు ఆమె మ‌న‌సులో ఉన్న‌దేంటో తెలుసుకోవ‌చ్చ‌ట‌..!

ఆడ‌వారిని అర్థం చేసుకోవ‌డం మ‌గ‌వారికి సాధ్య‌మ‌య్యే ప‌ని కాదు. ఈ మాట గురించి అందరికీ తెలిసిందే. ఎన్నో సినిమాల్లోనూ ఈ త‌ర‌హా సంభాష‌ణ‌లను మ‌నం విన్నాం. అంటే ఆడ‌వారు అంత క‌ఠినంగా ఉంటార‌ని కాదు, కాక‌పోతే వారి మ‌న‌స్త‌త్వాన్ని ఎవ‌రూ తెలుసుకోలేర‌న్న‌మాట‌. పైకి క‌నిపించే హావ‌భావాలు వేరు. లోప‌ల వేరే విధంగా ఉంటార‌ని నానుడి. అయితే ఈ విష‌యం ఎలా ఉన్నా ప్రేయ‌సి మాట్లాడే ప‌లు మాట‌ల‌ను జాగ్ర‌త్త‌గా ప‌రిశీలించ‌గ‌లిగితే ప్రియుడు ఆమె మ‌న‌సులో ఏముందో ఇట్టే తెలుసుకోవ‌చ్చ‌ట‌. ఆ మాట‌లు కామ‌న్‌గా ఏముంటాయో ఇప్పుడు చూద్దాం.

1. ప్రేయ‌సి ‘ముందుకు సాగిపో (Go Ahead)’ అంటే ఆ ప‌ని చేయ‌కూడ‌ద‌ట‌. అది ఇష్ట‌పూర్వ‌కంగా చెప్పిన మాట కాద‌ట‌. సో, ప్రేయ‌సి ఆ మాట అంటే అందుకు సంబంధించిన ప‌నిని చేయ‌కూడ‌ద‌ట‌.

2. ప్రియురాలు ‘అంతా బాగానే ఉంది (Fine)’ అని అంటే ప్రియుడు ఏమీ మాట్లాడ‌కుండా ఉండాల‌ట‌. సాధార‌ణంగా ప్రియురాలు త‌నకు తాను క‌రెక్ట్ అని భావించుకునే సంద‌ర్భంలో అలా అంటుంద‌ట‌.

lovers

3. ప్రేయ‌సి ‘ఏమీ లేదు (Nothing)’ అని అంటే ఏదో ఒక స‌మ‌స్య ఉంద‌ని ప్రియుడు అర్థం చేసుకోవాలి. ఆ క్ర‌మంలో నెమ్మ‌దిగా ఆ స‌మ‌స్య గురించి తెలుసుకునే ప్ర‌య‌త్నం చేయాలి.

4. ప్రియురాలు ‘ఏమైనా కానీ (Whatever)’ అని అంటే ఆమెకు ప్రియుడంటే విసుగు పుడుతుంద‌ని అర్థం చేసుకోవాలి. అలాంటి సంద‌ర్భంలో వీలైనంత వ‌ర‌కు ప్రియురాలికి కొద్దిగా దూరంగా ఉండేందుకు య‌త్నించాలి.

5. ‘ఫ‌ర్వాలేదు, స‌రేలే అయితే (That’s OK)’ అని ప్రియురాలు అంటే ప్రియుడు చేయ‌బోయే పొర‌పాటు కోసం, అత‌నికి బుద్ధి చెప్ప‌డం కోసం ఆమె వేచి చూస్తుంద‌ని తెలుసుకోవాలి.

6. ‘ఎంత ఆనందంగా ఉందో (How Funny)’ అని ప్రియురాలు అంటే ఆమెను ప్రియుడు ఏదో ఒక సంద‌ర్భంలో వెక్కిరించాడ‌ని, దాన్ని దృష్టిలో ఉంచుకునే ఆమె ఇంకా అదే భావ‌న‌లో ఉంద‌ని, దాన్నే మ‌న‌సులో పెట్టుకుంద‌ని తెలుసుకోవాలి.

7. ‘చాలా అద్భుతంగా ఉంది, ఆశ్చ‌ర్యంగా ఉంది (Wow)’ అని ప్రేయ‌సి అంటే ప్రియుడు తాను ఓ మూర్ఖుడిన‌ని, వెధ‌వ‌న‌ని అర్థం చేసుకోవాలి.

8. ‘ఏదైన‌ప్ప‌టికీ (Anyway)’ అని ప్రేయ‌సి అంటే ఆమెకు ప్రియుడు మాట్లాడుతున్న అంశం న‌చ్చ‌లేద‌ని అర్థం చేసుకోవాలి.

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top