చెల్లిని కాపాడి…ప్రాణాలొదిలిన అన్న.

అన్నా చెల్లెలు  స్కూల్ కు వెళ్ళడానికి రెడీ అయ్యారు. బస్టాప్ లో స్కూల్ బస్ కోసం ఎదురుచూస్తున్నారు. చెల్లి తన ఫ్రెండ్స్  ఓ పక్కన మాట్లాడుతుంది. అన్న కూడా తన ఫ్రెండ్స్ తో  ముచ్చట్లలో మునిగిపోయాడు. అంతలోనే ఓ కార్ ఇష్టమొచ్చిన తీరుగా వస్తుంది.  ఆ కార్ ను చూస్తే 100 మైళ్ళ వేగంతో దూసుకువస్తుంది. అది స్కూల్ పిల్లలు వెయిట్ చేస్తున్న బస్టాప్ వైపే పట్టాపగ్గాలు లేనట్టు వస్తుంది. దానిని గమనించాడు ఆ పిల్లాడు, ఆ కార్ తన సోదరి మీదకే వస్తుందని పసిగట్టాడు. అందరూ హహాకారాలు చేస్తున్నారు. మెరుపు వేగంతో కదిలిన ఆ కుర్రాడు  చెల్లిని  పక్కను తోసేశాడు… కింద పడ్డ అక్క బతికింది, కానీ కార్ ఆ కుర్రాడిని ఢీ కొట్టింది. దీంతో ఆ  అబ్బాయ్ గాల్లో ఎగిరిపడ్డాడు…. అక్కడిక్కడే ప్రాణాలు వదిలాడు.

అతడి పేరు లాడేరియస్‌ వైలే (11), ఇది జరిగింది సౌత్‌ కరోలినాలోని చెస్టర్‌ నగరంలో….  ఈ ఘటనను కళ్లారా చూసిన స్థానికులు బాలుడి సాహసాన్ని  వేయినోళ్ళ ప్రసంసిస్తున్నారు . కార్ నడుపుతూ ఇంతటి దుర్ఘటనకు కారణమైన  మిచెల్‌ జాన్సన్‌ను పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. సహాస బాలుడు  వైలే అంత్యక్రియల్లో వందలాది మంది పాల్గొని నివాళులర్పించారు.

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top