84 ఏళ్ళ వ‌య‌స్సులో…ఆటోన‌డుపుతూ బ‌తుకుతున్న ఈయ‌న‌..ఓ టీమ్ ఇండియా క్రికెట‌ర్ తాత‌!!

జ‌స్‌ప్రీత్ సింగ్ బుమ్రా… భార‌త క్రికెట్ జ‌ట్టులో ఇప్పుడు ముఖ్య‌మైన ఫాస్ట్ బౌల‌ర్‌గా పేరు గాంచాడు. త‌న‌దైన విభిన్న‌శైలిలో బౌలింగ్ వేయ‌డ‌మే కాదు, అదే స్థాయిలో ప్ర‌త్య‌ర్థి బ్యాట్స్‌మెన్‌కు ముచ్చెమ‌ట‌లు ప‌ట్టించ‌గ‌ల‌డు. ప్రస్తుతం ఇత‌ని కెరీర్ చాలా బాగానే ఉంది. పేద కుటుంబం నుంచి వ‌చ్చిన‌ప్పటికీ ఇప్పుడు స్టార్ ప్లేయ‌ర్‌గా మార‌డంతో అత‌ని లైఫ్ పూర్తిగా ఛేంజ్ అయింది. విలాస‌వంత‌మైన జీవితం, సౌకర్యాలు… ఇలా చెప్పుకుంటూ పోతే స్టార్ క్రికెట్ ఆట‌గాళ్ల‌కు ఏ రీతిలో సౌక‌ర్యాలు ఉంటాయో అదే స్థాయిలో బుమ్రాకు కూడా అవి ల‌భిస్తున్నాయి. అయితే బుమ్రాయే ఇలా ఉంటే అత‌ని కుటుంబం ఇక ఎలాంటి ఢోకా లేకుండా జీవిస్తార‌ని ఎవ‌రైనా అనుకుంటారు. కానీ.. నిజానికి ప‌రిస్థితి వేరేగా ఉంది. ఎందుకంటే బుమ్రా తాత ఇప్పుడు పండు ముస‌లి వ‌య‌స్సులో బ‌తుకు పోరాటం చేస్తున్నాడు. అవును, మీరు విన్న‌ది నిజ‌మే. పూట తిండికి కూడా నోచుకోని అత్యంత దీన స్థితిలో జీవితం గ‌డుపుతున్నాడు.

జ‌స్‌ప్రీత్ సింగ్‌ బుమ్రా తాత పేరు సంతోక్‌సింగ్ బుమ్రా. ఒక‌ప్పుడు ఆయ‌న బాగానే బ‌తికాడు. అత‌ని కొడుకు జ‌స్వీర్ సింగ్ బుమ్రా. ఇత‌ని కుమారుడే జ‌స్‌ప్రీత్ సింగ్‌. వీరు ఉత్త‌రాఖండ్‌లోని ఉద్ధ‌మ్‌సింగ్ న‌గ‌ర్‌లో నివాసం ఉండేవారు. సంతోక్‌సింగ్‌కు అప్ప‌ట్లో అహ్మ‌దాబాద్‌లో 3 ఫ్యాక్టరీలు ఉండేవి. వాటికి సంతోక్‌సింగ్ య‌జ‌మాని. అయితే 2001లో బుమ్రా తండ్రి జస్వీర్ సింగ్ మృతి చెందాడు. దీంతో అప్పుల వాళ్లు మీద ప‌డ్డారు. ఇక ఆ ఫ్యాక్ట‌రీల‌ను సంతోక్‌సింగ్ అమ్మ‌క త‌ప్ప‌లేదు. దీనికి తోడు బుమ్రా బాధ్య‌త కూడా తాత సంతోక్ సింగ్‌పై ప‌డింది.

అయితే సంతోక్‌సింగ్ 4 ఆటోల‌ను కొని తిప్ప‌డం మొద‌లు పెట్టాడు. కానీ కాలం క‌ల‌సిరాలేదు. అందులో కూడా న‌ష్టాలే వ‌చ్చాయి. ఇక చేసేది లేక సంతోక్ సింగ్ ఉన్న 4 ఆటోల్లో 3 ఆటోల‌ను అమ్మేవాడు. మిగిలిన ఒక్క ఆటోను తానే స్వ‌యంగా న‌డుపుకుని బ‌తుకుతున్నాడు. ఇప్పుడాయ‌న‌కు 84 ఏళ్లు. ఈ వ‌య‌స్సులోనూ ఆయ‌న రోజూ ఆటో న‌డుపుతున్నాడు. ఆ ప‌ని చేయ‌క‌పోతే ఆయ‌న‌కు తిండి ఉండ‌దు క‌దా. ఇక ఆయ‌న ఉంటున్న ఇల్లు కూడా అద్దె ఇల్లే కావ‌డం గ‌మ‌నార్హం. ఈ క్ర‌మంలో తాజాగా బుమ్రా తాత సంతోక్ సింగ్ గురించిన ఈ విష‌యం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది. అస‌లు బుమ్రా తాత నుంచి ఎందుకు దూర‌మ‌య్యాడు..? చిన్న‌ప్పుటి నుంచి పెంచి పెద్ద చేసిన తాత అంతటి దీన స్థితిలో ఉన్న‌ప్ప‌టికీ బుమ్రా ఎందుకు స్పందించ‌డం లేదు..? అన్న వివ‌రాలు మాత్రం తెలియ‌లేదు. ఏది ఏమైనా ఆ పండు ముస‌లి వ‌య‌స్సులో బుమ్రా తాత సంతోక్ సింగ్ ప‌డుతున్న క‌ష్టాలు మాత్రం వ‌ర్ణ‌నాతీతం. ఈ క్ర‌మంలో బుమ్రా ఇప్ప‌టికైనా తాత‌ను చేర‌దీయాల‌ని ప‌లువురు హిత‌వు చెబుతున్నారు..!

Comments

comments

Share this post

scroll to top