చివరిశ్వాస వరకు బోని కోసమే.! ప్రేమ కోసం పరితపించిన శ్రీదేవి..! ఆ విషయంతో కంటతడి.?

అందాల నటి శ్రీదేవి ఇకలేరు..యావత్ భారతాన్ని శోకసంద్రంలో ముంచి ,దివికేగారు..బాలనటులుగా ఎందరో నటిస్తారు కాని సూపర్ స్టార్ గా ఎదిగే వరకూ తమ ప్రస్థానాన్ని కొనసాగించిన వారిలో మాత్రం శ్రీదేవి ఒక్కరే ఉంటారు. బాలనటిగా, హీరోయిన్ గా ,సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశాక కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్న శ్రీదేవి అర్దాంతరంగా మన మద్యనుండి వెళ్లిపోవడం శోచనీయం.అభిమానులు,సినిమా వాళ్లు యావత్ ప్రపంచం కన్నీటితో శ్రీదేవికి వీడ్కోలు పలకారు.కానీ తల్లి తోడు అవసరం అయిన సమయంలో కూతుళ్లకు దూరం కావడం,బోణికి అన్ని సంధర్బాల్లో  తోడు నిలిచిన శ్రీదేవి లేని లోటు పూడ్చడం సాధ్యమేనా..శ్రీదేవి మరణం నేపధ్యంలో అనేక అనుమానాలు వెలిబుచ్చారు.ఆఖరుకి తనెంతగానో ప్రేమించిన భర్తను కూడా అనుమానించారు..కాని భర్త పట్ల శ్రీదేవి కి ఉన్న ప్రేమ,వారి బంధం గురించి కొన్ని వివరాలు మీకోసం..

శ్రీదేవికి బోణి అంటే అమితమైన ప్రేమ..బోణి ఎలాంటి నిర్ణయం తీసుకొన్నా.. దాని వల్ల ఎదురయ్యే పరిస్థితులను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండేది.కెరీర్ పరంగా బోణి పడిపోతే తనకే సంభవించినట్టు బాధపడిపోయేది. .. ఉన్నత స్థానంలో నిలిస్తే సంతోషపడేది.అంతేకాదు శ్రీదేవికి దైవభక్తి ఎక్కువ. లోఖండ్‌వాలా కాంప్లెక్స్‌లోని వాళ్ల ఇంటి నుంచి సిద్ధి వినాయక్ ఆలయం వరకు చెప్పులు లేకుండా నడిచివెళ్లింది.అది కూడా భర్తకు మంచి జరగాలని  దేవుడ్ని ప్రార్థించడానికి….షాపింగ్ అంటే ఇష్టం ఉన్నప్పటికి బోణి ఆర్దిక పరిస్థితిని గమనించి దుబారాగా ఖర్చు చేయకుండా శ్రీదేవి షాపింగ్ చేసేదట.ఒకసారి భర్త బర్త్‌డే కోసం ఓ విలాసవంతమైన కారును గిఫ్ట్‌గా ఇచ్చింది. ఆ సమయంలో బోణికి దానిని మెయింటెన్ చేసేంతా ఆర్థిక స్థోమత లేదు. కానీ  పాతకారును 9 ఏళ్లుగా వాడటం చూసి ఆ కారును కొనుగోలు చేసి బహుమతిగా ఇచ్చింది. నిజంగా గ్రేట్ కదూ…

ఇంట్లో రిమోట్ గురించి తగవులాడుకోని భార్య భర్తలుండరు..అలాంటిది బోణి ఎక్కువగా స్పోర్ట్స్, న్యూస్ కార్యక్రమాలు ఇష్టపడతారు. అవి శ్రీదేవికి  ఇష్టం ఉండవు. ఒకవేళ తనకు నచ్చిన కార్యక్రమం చూస్తుండగా బోణి గదిలోకి వెళితే  రిమోట్ బోణి చేతికి ఇచ్చి శ్రీదేవి బోణితో గడపడాన్నే ఎక్కువగా ఎంజాయ్ చేసేదట.2013లో లక్నోలో జరిగిన దుర్గాపూజలో శ్రీదేవి, బోనికపూర్ దంపతులు పాల్గోన్నారు. ఆ కార్యక్రమంలో సింధూర్ మేళా అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆ సందర్భంగా తన వీపుపై సింధూరంతో బోనికపూర్ పేరును శ్రీదేవి రాసుకొని తన ప్రేమను వ్యక్తం చేశారు. ఆ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతుంది.లక్నో దుర్గాపూజను గుర్తుచేసుకొంటూ.. నేను సంప్రదాయ కుటుంబం నుంచి వచ్చినప్పటికీ ఇప్పటివరకు దుర్గాపూజలో పాల్గొనలేదు. తొలిసారి దుర్గమాత సన్నిధిలో గడిపాను. చాలా సంతోషభరితమైన క్షణాలు అవి అని శ్రీదేవి అప్పట్లో పేర్కొన్నారు.

నిజంగా చీటికి మాటికి చిన్నదానికి పెద్దదానికి విడాకులు తీసుకుంటున్న నేటి తరుణంలో…సినిమా వాళ్లకు విడాకులు అనేవి చాలా చిన్న విషయం..అయినప్పటికి ఇన్నేళ్ల వైవాహిక జీవితంలో బోణి,శ్రీదేవి సంతోషంగా ఉన్నారంటే అది కేవలం శ్రీదేవి గొప్పతనమే కాదు..బోణి ప్రేమ కూడా ఒక కారణం.. నిజంగా బోణి జీవితంలో శ్రీదేవి లేని లోటు ఎవరూ పూడ్చలేరు…

Comments

comments

Share this post

scroll to top