దుబాయ్‌లో అసలు ఏం జరిగిందో ఎట్టకేలకు బయటపెట్టిన “బోనీ”.! హోటల్‌లో అమ్మ ఒకరే ఉన్నారని జాన్వి.?

సినిమా హీరోయిన్లు మరణాలు మాత్రమే కనిపిస్తాయి..ఆ మరణాలకు గల కారణాలు,నిజాలు మాత్రం వెలుగులోకి రావు.పిన్న వయసులో ,హఠాత్తుగా మరణించిన హీరోయిన్ల మరణాల గురించి వాస్తవాలెవరికి తెలీదు.రకరకాల అనుమానాలు వినిపిస్తాయి..అదేవిధంగా గ్లామర్ క్వీన్ శ్రీదేవి లోకాన్ని వీడిపోయింది..తన మరణాన్ని గురించిన అనుమానాలు మాత్రం అలాగే ఉండిపోయాయి…కానీ శ్రీదేవి చనిపోయిన రోజు ఏం జరిగింది అనే దానిపై బోణి నోరు విప్పారు.ఇప్పటివరకు ఏం మాట్లాడని బోణి తన స్నేహితుడికి ఆ రోజు ఏం జరిగిందో చెప్పారు..

ఆ రోజు ఏం జరిగింది?

ఫిబ్రవరి 24 శనివారం శ్రీదేవి చనిపోయింది. అయితే ఆ రోజు ఏం జరిగిందన్న దానిపై బోనీ కపూర్ ఎట్టకేలకు నోరు విప్పారు. సర్ ప్రైజ్ ఇవ్వడం నుంచి.. శ్రీదేవిని హాస్పిటల్ తీసుకెళ్లడం వరకు.. ఆ రెండు గంటల్లో ఏం జరిగిందో కోమల్ నహ్తా అనే స్నేహితుడికి బోనీ కపూర్ చెప్పుకోగా.. అతను ఈ విషయాలన్నింటిని ట్విట్టర్‌లో పెట్టాడు. ఫిబ్రవరి 20న బంధువుల పెళ్లికి శ్రీదేవి దంపతులు హాజరయ్యారు. ఆ తర్వాత ఇంపార్టెంట్ మీటింగ్ ఉందని బోనీ కపూర్ ఇండియా వచ్చేశాడు. అయితే శ్రీదేవి మాత్రం జాన్వి కోసం షాపింగ్ చేయాలని చెప్పేసి దుబాయ్ హోటల్లోనే ఉండిపోయింది. బోనీ కపూర్ ఎప్పుడూ శ్రీదేవిని వదిలి ఉండలేదు. అందులోనూ ఎప్పుడూ ఒంటరిగా విదేశాలకు పంపించలేదు. శ్రీదేవిని సర్‌ప్రైజ్ చేయడం అంటే బోనీకి భలే ఇష్టం. అటు హోటల్‌లో అమ్మ ఒకరే ఉన్నారు.. భయపడుతుంది. దుబాయ్ వెళ్లండి అంటూ బోనీ కపూర్‌ను జాన్వి కూడా ఫోర్స్ చేసింది. దీంతో వెంటనే దుబాయ్‌ బయల్దేరి వెళ్లారు బోనీ కపూర్.
ఫిబ్రవరి 24న దుబాయ్‌ వెళ్లి బోనీ కపూర్.. సాయంత్రం ఆరున్నర సమయంలో శ్రీదేవి ఉంటున్న జుమైరా ఎస్టేట్స్ హోటల్ రూం నంబర్ 2201కి వెళ్లాడు. భర్త రాకతో సర్ ప్రైజ్ అయిన శ్రీదేవి చాలా ఆనందపడిపోయింది. 15 నిమిషాలపాటు మాట్లాడుకున్న తర్వాత.. డిన్నర్‌కు వెళ్దామని ప్లాన్ చేసుకున్నారు. దీంతో శ్రీదేవి స్నానం కోసమని బాత్రూంకు వెళ్లింది. బోనీ మాత్రం లివింగ్ రూంలోకి వెళ్లి ఇండియా, సౌతాఫ్రికా మ్యాచ్ చూస్తూ ఉండిపోయారు. అయితే పావుగంట గడిచినా ఆమె బయటకిరాకపోవడంతో ఆందోళనతో వెళ్లి చూశారు బోనీ కపూర్. బాత్రూం డోర్‌ లాక్ చేసి ఉండకపోవడం, ట్యాప్ సౌండ్ ఇంకా వినిపిస్తుండడంతో టెన్షన్‌తో లోపలికి వెళ్లి చూస్తే గుండె ఆగినంత పని అయిపోయిందని బోనీ కపూర్ తన ఫ్రెండ్‌కు చెప్పారు. బాత్ టబ్‌లో ఫుల్‌గా నీళ్లు.. అందులో శ్రీదేవి పడిపోయి ఉంది. వెంటనే ఆమెను బైటికి తీసినా.. కదలిక లేకపోవడంతో.. కంగారులో ఫ్రెండ్‌కు ఫోన్ చేసి ఆ తర్వాత ఆసుపత్రికి తీసుకెళ్లానంటూ బోనీ కపూర్ తన స్నేహితుడు నహ్తాకు చెప్పారు.బోనీ చెప్పిన ప్రతీ విషయాన్ని నహ్తా తన ట్విట్టర్‌లో చెప్పాడు.
శ్రీదేవి మరణాన్ని ధృవీకరించే డాక్టర్లు  మొదట గుండెపోటు అన్నారు.. ఆ తర్వాత బాత్‌టబ్‌లో పడి మరణించిందని తేల్చారు. దీంతో శ్రీదేవీ మరణంపై  అనుమానాలు కలిగాయి.. బాత్ టబ్‌లో శ్రీదేవి ఎలా పడింది. స్పృహ కోల్పోయి బాత్ టబ్‌లో పడ్డారా.. బాత్ టబ్‌లోకి వెళ్లాక స్పృహ కోల్పోయారా.. ఏం జరిగింది. ఎంతో జాగ్రత్తగా ఉండే శ్రీదేవి బాత్ టబ్‌లో పడి ఎలా చనిపోయిందన్న ప్రశ్నలకు మాత్రం బోణి దగ్గర కూడా సమాధానం  లేదు.

Comments

comments

Share this post

scroll to top