ఈ వ్య‌క్తి బార్బీ బొమ్మలా మారేందుకు 150 ప్లాస్టిక్ స‌ర్జీలు చేయించుకున్నాడు…చివరికి ఏమైందో తెలుసా..?

నేటి త‌రుణంలో ప్లాస్టిక్ సర్జ‌రీలు చాలా కామ‌న్ అయిపోయాయి. ముక్కు బాగాలేద‌నో, మూతి బాగా లేద‌నో, శ‌రీరంలోని ఇత‌ర భాగాలు స‌రిగ్గా లేవ‌నో చాలా మంది ప్లాస్టిక్ స‌ర్జ‌రీలు చేయించుకుంటున్నారు. త‌మ శ‌రీర భాగాల‌ను అందంగా మ‌లుచుకుంటున్నారు. అయితే అలా అందంగా మార‌డం కోసం ఓ వ్య‌క్తి ఏం చేశాడో తెలుసా..? ఏకంగా 150 ప్లాస్టిక్ స‌ర్జ‌రీల‌ను చేయించుకున్నాడు. అవును, మీరు విన్న‌ది నిజ‌మే. ఇంత‌కీ అత‌నెవ‌రో తెలుసా..? అత‌ని పేరు రోడ్రిగో ఆల్వ్స్.

రోడ్రిగో ఆల్వ్స్ చూసేందుకు అచ్చం కెన్ డాల్ లా ఉంటాడు. అంటే.. మీకు బార్బీ బొమ్మ తెలుసు క‌దా. ఆ బొమ్మ కోసం సృష్టించిన ఓ బాయ్ ఫ్రెండ్ బొమ్మ పేరే కెన్ డాల్‌. ఆ బొమ్మ‌లా ఇప్పుడు రోడ్రిగో మారాడు. అయితే అందుకు అత‌ను ఏకంగా 150 ప్లాస్టిక్ స‌ర్జ‌రీల‌ను చేయించుకున్నాడు. ఇత‌నిది బ్రెజిల్‌. అయినా ఇత‌నికి లండ‌న్‌లో, అమెరికాలో ఆస్తులు ఉన్నాయి. నివాసం ఉంటున్న‌ది లండ‌న్‌లోనే. ఈ క్ర‌మంలోనే రోడ్రిగో తాజాగా ఇండియాకు వ‌చ్చాడు. అయితే అత‌ను ఇండియాకు వ‌చ్చింది ఎందుకో తెలుసా..? ప‌్లాస్టిక్ స‌ర్జ‌రీల‌పై జ‌నాల్లో ఉన్న అపోహ‌ల‌ను తొల‌గించ‌డం కోసం. అందులో భాగంగానే విదేశాల్లో ప‌లు టీవీ షోల్లో కూడా పాల్గొన్నాడు. ఇక ఇక్క‌డ కూడా అలా టీవీ షోల్లో పాల్గొన‌బోతున్నాడు.

అయితే రోడ్రిగో ఇండియాలో ఓ బాలీవుడ్ మూవీలో కూడా నటిస్తున్న‌ట్టు స‌మాచారం. యూర‌ప్‌కు చెందిన ఓ వ్య‌క్తి ఇండియాలోని ఢిల్లీకి వ‌చ్చి అక్క‌డ ఎలా తప్పిపోయాడు, మ‌ళ్లీ స్వదేశానికి ఎలా చేరుకున్నాడు ? అనే క‌థాంశంతో నిర్మిస్తున్న సినిమాలో రోడ్రిగో న‌టిస్తున్నాడ‌ట‌. కాగా రోడ్రిగో ఈ మ‌ధ్యే తాజ్‌మ‌హ‌ల్‌తోపాటు మ‌న దేశంలో ఉన్న‌ ప‌లు ప్రాంతాల్లో ఉన్న అనాథాశ్ర‌మాల‌ను కూడా సంద‌ర్శించాడు. వారికి చేయూత‌నిచ్చేందుకు స‌హ‌కారం అందించ‌నున్నాడ‌ట‌. ఇక రోడ్రిగో త్వ‌ర‌లో సెక్సు మార్పిడి ఆప‌రేష‌న్ చేయించుకోవాల‌ని అనుకుంటున్నాడు. బార్బీ బొమ్మ‌ బాయ్ ఫ్రెండ్ అయి కెన్ డాల్‌లా మారిన ఇత‌ను ఇప్పుడు సెక్సు మార్పిడి చేయించుకుని బార్బీ బొమ్మ‌లా మారాల‌ని చూస్తున్నాడు. అందుకు గాను ఛాతి భాగంలో ఉండే కొన్ని ఎముక‌ల‌ను ఇప్ప‌టికే అత‌ను తీయించుకున్నాడు. మరి అత‌ను బార్బీ బొమ్మ‌లా మారుతాడా, లేదా అన్నది వేచి చూస్తే తెలుస్తుంది..!

Comments

comments

Share this post

scroll to top