బాబా రామ్ దేవ్ తో కలిసి హీరోయిన్ శిల్పాశెట్టి యోగాసనాలు.!

పొడుగుకాళ్ళ  సుందరి శిల్పాశెట్టి.. బాబా రామ్ దేవ్ తో కలిసి యోగాసనాలు చేశారు. ముంబాయ్ లో 5 రోజుల పాటు ఏర్పాటు చేసిన యోగా కార్యక్రమానికి హజరయిన శిల్పా.. రామ్ దేవ్ బాబా తో కలసి స్టేజ్ మీద యోగాసనాలు చేస్తూ యోగా పై ప్రజల్లో చైతన్యం కల్గించారు. యోగా వలన కలిగే లాభాలపై ఆమె సిడీలను కూడా విడుదల చేశారు. అయితే స్టేజ్ మీద రామ్ దేవ్ తో పోటీ పడుతూ శిల్పా యోగసనాలు చేయలేకపోయారు. గతంలో కూడా శిల్పా రామ్ దేవ్ బాబా యోగా కార్యక్రమానికి చాలా సార్లు గెస్ట్ గా వచ్చారు.

Watch Video:


యోగా అంటే వ్యాయామ సాధనల సమాహారాల ఆధ్యాత్మిక రూపం. ఇది హిందూత్వ అధ్యాత్మిక సాధనలలో ఒక భాగం. మోక్షసాధనలో భాగమైన ధ్యానం అంతఃదృష్టి, పరమానంద ప్రాప్తి లాంటి అధ్యాత్మిక పరమైన సాధనలకు పునాది. దీనిని సాధన చేసే వాళ్ళను యోగులు అంటారు. వీరు సాధారణ సంఘ జీవితానికి దూరంగా మునులు సన్యాసులవలె అడవులలో ఆశ్రమ జీవితం గడుపుతూ సాధన శిక్షణ లాంటివి నిర్వహిస్తుంటారు. ధ్యానయోగం ఆధ్యాత్మిక సాధనకు మానసిక ఆరోగ్యానికి చక్కగా తోడ్పడుతుంది. హఠయోగములో భాగమైన శారీరకమైన ఆసనాలు శరీరారోగ్యానికి తోడ్పడి ఔషధాల వాడకాన్ని తగ్గించి దేహధారుడ్యాన్ని, ముఖ వర్చస్సుని ఇనుమడింప చేస్తుంది. బుద్ధమతం, జైనమతం, సిక్కుమతం మొదలైన ధార్మిక మతాలలోనూ, ఇతర ఆధ్యాత్మిక సాధనలలోను దీని ప్రాధాన్యత కనిపిస్తుంది.

 

Comments

comments

Share this post

scroll to top