రాఘవేంద్రరావు పేరు తల్చుకోగానే ఆయన చేసిన సినిమాలకన్నా ముందు..ఆ సినిమాల్లో నటించిన హీరోయిన్లు..వారి బొడ్డుపై పండ్లు వేయడం ఇవే సీన్స్ గుర్తొస్తాయి.పళ్లు వేసి బోర్ కొట్టిందో..మరి ఢిఫరెంట్ గా ఉంటుందనుకున్నారో కానీ
‘ఝుమ్మందినాదం’ సినిమాలోని ఓ పాటలో హీరోయిన్ తాప్సీ బొడ్డుపై ఏకంగా కొబ్బరికాయ వేసి చూపించారు..ఇప్పుడ ఆ కొబ్బరికాయే న్యూస్ లో హాట్ టాఫిక్ గా మారింది..

‘‘ఝుమ్మందినాదం’ సినిమాలోని ఓ పాట కోసం డైరెక్టర్ తన బొడ్డుపై కొబ్బరికాయ వేశారని, అందులో రొమాన్స్ ఏముందో తనకైతే అర్థం కాలేద’ని ఓ రియాలిటీ షోలో తాప్సీ వెటకారంగా మాట్లాడిన విషయం తెలిసిందే. ఆ వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారడంతో తాప్సీ ఆ తర్వాత క్షమాపణలు కూడా చెప్పుకుంది.

ఇదే విషయం పై ఇప్పుడు హీరోయిన్ అమీ జాక్సన్ స్పందించింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ‘మీపై అలా కొబ్బరికాయ విసిరితే ఏమి చేస్తారు’ అనే ప్రశ్న అమీకి ఎదురైంది. దీనికి స్పందించిన అమీ.. ‘ అదృష్టవశాత్తూ ఇప్పటివరకు నేను మంచి వ్యక్తిత్వం ఉన్న దర్శకులతోనే పనిచేశాను. అలా కొబ్బరికాయలు విసరడం చాలా భయంకరంగా ఉంటుంది. నాకైతే ఎప్పుడూ అలాంటి అనుభవాలు ఎదురుకాలేదు. ఒకవేళ ఎవరైనా దర్శకుడు నాపై కొబ్బరికాయ విసిరితే తిరిగా వారి మొహం మీదకే విసిరేస్తాను. అందుకే నాతో ఎవరూ అలా ప్రవర్తించలేదేమో.’ని సమాధానమిచ్చింది అమీజాక్సన్…. ఇప్పుడు ఈ మాటలపై సదరు డైరెక్టర్ గారి అభిమానులు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.