మ‌ల‌మూత్రాలు అని తెలియ‌క వారు ఆ ప‌దార్థాన్ని ఫ్రిడ్జ్ లో దాచుకున్నారు…చివరికి ఏమైందో తెలుస్తే షాక్ అవుతారు.!

ఏ విష‌య‌మైనా మ‌న‌కు తెలియ‌నంత వ‌ర‌కు బాగానే ఉంటుంది. కానీ ఒక్క‌సారి గ‌న‌క మ‌న‌కు దాని గురించి తెలిస్తే.. అది కూడా అస‌హ్యించుకునేంత విష‌యం అయితే అప్పుడు మ‌న‌కు క‌లిగే ఇబ్బంది అంతా ఇంతా కాదు. మ‌నం ఎందుకు అలా చేశాంరా బాబూ అంటూ ఫీల‌వుతాం. మ‌న దేశంలోని ఆ ప్రాంతానికి చెందిన ప‌లువురు ఇప్పుడు స‌రిగ్గా ఇలాగే ఫీల‌వుతున్నారు. ఎందుకంటే వారు చేసిన ప‌ని అలాంటిది మ‌రి. ఓ ప‌దార్థం గురించి తెలియ‌కుండానే త‌మ ఇండ్ల‌లో ఏకంగా ఫ్రిజ్‌ల‌లో దాన్ని పెట్టుకున్నారు. చివ‌ర‌కు దాని గురించి తెలిసే స‌రికి వాంతులు చేసుకునేంత ప‌ని చేశారు. ఇంత‌కీ అస‌లు విష‌యం ఏమిటంటే…

గురుగ్రామ్‌కు చెందిన ర‌జ్బీర్‌ యాద‌వ్ అనే ఓ రైతు త‌న పొలంలో ప‌నిచేసుకుంటూ ఉండ‌గా ఆకాశం నుంచి ఓ పెద్ద బండ‌రాయి లాంటి ప‌దార్థం వ‌చ్చి త‌న పొలంలో ప‌డింది. దీంతో భారీ శ‌బ్దం వ‌చ్చింది. అయితే చూసేందుకు ఆ ప‌దార్థం గోధుమ రంగులో ఉంది. పైగా కింద ప‌డడం వ‌ల్ల అది ముక్క‌లైంది. దీంతో ఆ ప‌దార్థం ఏమై ఉంటుందోన‌ని ర‌జ్బీర్‌తోపాటు చుట్టు ప‌క్క‌ల వాళ్లు తెగ ఆలోచించారు. చివ‌ర‌కు ఓ నిర్ణ‌యానికి వ‌చ్చారు.

ఆకాశం నుంచి వ‌చ్చింది క‌నుక అది ఉల్క అయి ఉంటుంద‌ని, క‌నుక ఆ ప‌దార్థాన్ని తీసుకెళ్లి ఇంట్లో పెట్టుకుంటే ప‌రిశోధ‌న‌ల కోసం వ‌చ్చే వారికి దాన్ని అమ్ముకుని సొమ్ము చేసుకోవ‌చ్చ‌ని అంద‌రూ భావించారు. దీంతో వారు ఆ ప‌దార్థానికి చెందిన ముక్క‌ల‌ను తీసుకెళ్లి ఏకంగా ఇండ్ల‌లో ఫ్రిజ్‌ల‌లో పెట్టుకున్నారు. అయితే ఈ స‌మాచారం తెలుసుకున్న వాతావరణశాఖాధికారులు, డిజాస్టర్ మేనేజ్ మెంట్ అధికారులు ఈ పదార్ధాన్ని పరీక్షించారు. దీంతో వారు అసలు ఆ ప‌దార్థం ఏమిటో చెప్పేస‌రికి స‌ద‌రు ప్రాంతానికి చెందిన వారు షాక్ అయ్యారు. కొంద‌రైతే వాంతులు చేసుకున్నంత ప‌ని చేశారు. అస‌లింత‌కీ మ‌రి ఆ ప‌దార్థం ఏమిటో తెలుసా..? ఏమీ లేదండీ… విమానాల్లో ప్ర‌యాణించే వారు టాయిలెట్‌కు వెళ్తారు క‌దా. అప్పుడు వారి మ‌లం, మూత్రంల‌ను ఒక కంటెయిన‌ర్‌లో స్టోర్ చేసి దాన్ని ఘ‌న ప‌దార్థంగా మారుస్తారు. దీన్ని బ్లూ ఐస్ అంటారు. అయితే గురుగ్రామ్‌లో ఆకాశం నుంచి ప‌డింది ఆ ప‌దార్థ‌మే. దీంతో అస‌లు ఈ విష‌యం తెలుసుకున్న వారు వెంట‌నే స‌ద‌రు ప‌దార్థాన్ని ఫ్రిజ్‌ల‌లో నుంచి తీసేశారు. కొంద‌రు వాంతులు చేసుకున్న‌ట్టు ప్ర‌వ‌ర్తించారు. అస‌లు ఆ ప‌దార్థాన్ని ఎందుకు తెచ్చుకున్నాం రా బాబూ అంటూ కొంద‌రు ఉసూరుమ‌ని ఫీల‌య్యారు..! ఏది ఏమైనా ఈ వార్త భ‌లే ఆశ్చ‌ర్యంగా ఉంది క‌దా..!

Comments

comments

Share this post

scroll to top