కాల్ చేసిన నాలుగు గంటల లోపే మనకు కావాల్సిన గ్రూప్ రక్తం మనదగ్గరికి వస్తుంది.

మీ బంధువులు ఎవరైనా ప్రాణాపాయ స్థితిలో ఉన్నారా? వారికి అర్జెంట్ గా రక్తం ఎక్కిచాలా? ఎంత వెతికినా ఆ  వ్యక్తికి సంబంధించిన  గ్రూప్ రక్తం దొరకట్లేదా?  అయితే మీ ఫోన్ తీయండి, 104 కు కాల్ చేయండి…. ఫోన్ చేసిన 4 గంటల లోపు, 40 కిలో మీటర్ల పరిధిలో ఉన్న మీ అడ్రస్ ను కనుక్కొని మరీ బ్లడ్ బాటిల్ ను మీ చేతిలో పెట్టిపోతారు..ఇదే  బ్లడ్ ఆన్ కాల్ ( BLOOD ON CALL) ప్రాజెక్ట్.   ఈ పైలట్  ప్రాజెక్ట్ ను సక్సెస్ చేసి ….మెల్లి మెల్లిగా దేశమంతా విస్తరింపజేయాలన్నది కేంద్ర ప్రభుత్వ ఆలోచనట.!? ఓ బాటిల్ రక్తానికి గాను 450, రవాణా చార్జీలకు 100 మొత్తం ఒక్క బాటిల్ రక్తానికి గాను 450+100= 550 రూపాయలను ఆర్డర్ చేసిన వ్యక్తి ఇవ్వాల్సి ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు.

Blood-on-Call-Project-on-104

అయితే సేమ్ ఇదే కాన్సెస్ట్ తో 2014 లోనే మహారాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి ప్రాజెక్ట్ ను ప్రవేశపెట్టింది. దీని పేరు జీవన్ అమృత్ సేవ…ఓNGO తో కలిసి రంగంలోకి దిగిన మహారాష్ట్ర గవర్నమెంట్ ఈ  స్కీమ్ ను సక్సెస్ చేయడంలో మాత్రం విఫలం అయ్యింది. రక్తాన్ని వేగంగా చేర్చే క్రమంలో చాలా సార్లు ఫెయిల్ అయ్యింది. అలాంటిది మరి కేంద్ర ప్రభుత్వం  ఈ ప్రాజెక్ట్ ను ఎలా సక్సెస్ చేస్తుందో చూడాలి….మరో విషయం…ఈ ప్రాజెక్ట్ ఇంకా లాంచ్ అవ్వలేదు….చేయ్యాలన్న ఉద్దేశ్యంతో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తుంది.

Comments

comments

Share this post

scroll to top